ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు రంగులు మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. అవసరాన్ని బట్టి పూటకో మాట మార్చడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.