
సాక్షి, అమరావతి: స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు.. ఏం జరిగినా సరే చంద్రబాబు వెంటనే తాను ఉంటానని జనసేన పవన్ కల్యాణ్ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో రానున్న ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘తోడేళ్ల ముఠాతో సింహం తలపడుతోంది. వచ్చే ఎన్నికలు దురాశ, ప్రజాసంక్షేమం మధ్య ఉండబోతున్నాయి. కుల రాజకీయాలు, ఐక్యత మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయి. అవకాశవాదం, నిజాయితీ మధ్య ఎన్నికలు జరుగుతాయి’ అని కామెంట్స్ చేశారు.
The 2024 AP elections is going to be between TDP vs. YSRCP respectively which can be compared as a pack of wolves versus a lion, greed for power vs. public welfare, U-turn politics vs. credibility, instability vs. stability, opportunism vs. honesty, caste politics vs. unity,…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2023
మరోవైపు.. ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ఎప్పుడో చెప్పాం. ఆ మాటలు దత్తపుత్రుడు నిజం చేశాడు. టీడీపీ, జనసేన పొత్తును జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ, జనసేన బంగాళాఖాతంలో కలవడం ఖాయం అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: బాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే.. మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment