
సాక్షి, కృష్ణా: రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూ ఘాటు విమర్శలు చేశారు. జనసేన అధినేత ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ చురకలంటించారు.
కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అవినీతి, అక్రమాల పుట్ట. చంద్రబాబు లాయర్లు 17A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చట్ట విరుద్ధమంటున్నారు. రాష్ట్ర ఖజానా దోచుకున్న దొంగ చంద్రబాబు. ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని వాదిస్తున్నారు. సెక్షన్ 17A రాకుండానే నమోదైన కేసు ఇది. చంద్రబాబు 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయే సరికి కమీషన్లకు కక్కుర్తి పడేవాడు.
2014లో లోకేష్ ఎంటరయ్యాక దొంగ అకౌంట్లకు ప్రభుత్వ సొమ్ము తరలించి విచ్చలవిడిగా దోచేశారు. చంద్రబాబు అవినీతి చేయలేదని కాకుండా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గుచేటు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420. చంద్రబాబు, టీడీపీ ఎన్ని డ్రామాలు చేసినా.. గరిటెలు, పళ్లాలు కొట్టినా ప్రజలు క్షమించరు. చంద్రబాబు లోపలుంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఎవరికి పనికొస్తాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్‌కు కౌంటర్..
ఇదే కమ్రంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా కొడాలి నాని కౌంటరిచ్చారు. పవన్ ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో ఆయనకే తెలియదు. టీడీపీతో కలిసి వెళ్తానని పవన్ చెబుతున్నాడు. టీడీపీతో కలిసేదేలేదని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు పవన్ ఎన్డీయే కూటమిలో ఉన్నట్టా.. లేనట్టా?. పవన్ బీజేపీతో కలిసి ఉన్నా.. వారితో ఎన్నికలకు వెళ్తానని పవన్ చెప్పడం లేదు. 151 స్థానాల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీ.. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా భయపడేది లేదు.
ఎన్నికల్లో పోటీ డిపాజిట్లు కూడా రాని పవన్ రెచ్చిపోతున్నాడు. జనసేన వంటి పార్టీలు చాలా వచ్చాయి.. అడ్రస్ కూడా లేకుండా పోయాయి. చంద్రబాబు దారిలోనే పవన్ కూడా చంద్రబాబు దారిలోనే వెళ్తున్నాడు. అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పవన్ భాషను అందరూ అర్థం చేసుకోవాలి. ఆయనో పావలా కల్యాణ్. చంద్రబాబుకు బెయిల్ వచ్చే వరకూ కొవ్వొత్తులు పట్టుకుని తిరగమనండి.. మాకేం నష్టంలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: స్కిల్ స్కామ్ కేసులో మరో సంచలనం.. టీడీపీకి, స్కిల్ కార్పొరేషన్‌కు ఒక్కరే అడిటర్
Comments
Please login to add a commentAdd a comment