బాల్యవివాహాలు అరికట్టాలి: విజయసాయిరెడ్డి | YSRCP mp vijayasai reddy questioned on child marriages in ap | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు అరికట్టాలి: విజయసాయిరెడ్డి

Published Fri, Mar 31 2017 5:38 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

బాల్యవివాహాలు అరికట్టాలి: విజయసాయిరెడ్డి - Sakshi

బాల్యవివాహాలు అరికట్టాలి: విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: బాల్యవివాహాల అంశాన్ని రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తారు. బాల్యవివాహాల నిరోధక చట్టం-2006 ఉన్నా.. ఏపీలో సరిగా అమలు కావడం లేదన్నారు. బాల్య వివాహాలలో ఏపీలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. 20,584 మంది బాలికలు, 19,557 మంది బాలురకు వివాహ వయసుకు ముందే బాల్య వివాహాలు జరిగాయని వెల్లడించారు. విశాఖ, అనంతపురం, కర్నూల్, చిత్తూరు జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని చెప్పారు. విశాఖలో 16,876 మంది బాలికలు, అనంతపురం జిల్లాలో 16,738 మంది బాలికలు కర్నూలు జిల్లాలో 16,532 మంది బాలికలు, చిత్తూరు జిల్లాలో 15, 769 మంది బాలికలు బాల్యవివాహాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

బాల్య వివాహాలు సమాజంపై తీవ్ర దుష్పరిణామం చూపిస్తాయని.. దీనివల్ల ఆడపిల్లల విద్యావకాశాలు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తిచేశారు. బాల్యవివాహాల వల్ల తలెత్తే సమస్యలు, అనర్ధాలపై గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement