న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు.
విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రణాళిక సంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన సభలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ మంత్రులు, ఆ కూటమి ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కేటాయింపులోనూ ఏపీకి అన్యాయం జరిగిందని, విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని కేంద్రం మాట తప్పిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment