
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించడంతో ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారిగా ఆగి.. ఆయనను పలుకరించారు. ‘విజయ్ గారూ..’ అంటూ సంబోధించి ఆయనతో మోదీ కరచాలనం చేశారు.
ఇక, జమిలి ఎన్నికలతోపాటు పలుకీలక అంశాలపై జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు కొనసాగింది. జమిలి ఎన్నికలపై ఓ కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇది ప్రభుత్వ ఎజెండా కాదు, యావత్ దేశ ఎజెండా అని, ఈ అఖిలపక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానించగా.. 24 పార్టీలు పాల్గొన్నాయని తెలిపారు.