వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతులను ఆదుకోవచ్చని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పథకం అమలు కోసం రూ.5510 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ పథకంలో భాగంగా 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ. 12,500 చొప్పన సాయం అందుతుందుని తెలిపారు. ఈ పథకంతో నోరు పెగలడం లేదు కదా చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.