సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని సవాల్ చేసిన చంద్రబాబు ఎందుకు మాట మార్చుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని చిత్తుగా ఓడించమని ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఎందుకు ఓడించాలో కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు వైఎస్సార్‌సీని ఒడించాలా.. బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ఓడించాలా అని జోగి రమేష్ చంద్రబాబును ప్రశ్నించారు. (స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల)
చంద్రబాబును ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా మళ్లీ మీడియా ముందుకు వచ్చి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెబుతున్నారని ఆయన విమర్శించారు. కరోనా వైరస్ రాష్ట్రానికి రాలేదని, టీడీపీకి వచ్చిందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, అభ్యర్థులు దొరికిన డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ పక్షాన ఉన్నారన్నారు.
(‘ఏ క్షణంలో ఎన్నికలైనా మేము సిద్ధం’)
గత ఎన్నికల్లో చంద్రబాబు అనే శనిని బీసీలు వదిలించుకున్నారని జంగా కృష్ణమూర్తి దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన నిజ స్వరూపం బీసీలు తెలుసుకున్నారని అన్నారు. బాబు బీసీల ద్రోహి అని, బీసీలకు మూడవ వంతు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పదివేల కోట్లు ఇస్తానని చెప్పి, బీసీ కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాడని మండిపడ్డారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌లో పెట్టిన ఒక్క హామీ అయినా నెరవేర్చరా అని నిలదీశారు. 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వలేదని చంద్రబాబే సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారని గుర్తు చేశారు. బీసీలకు సీఎం జగన్ అండగా ఉన్నారన్న దురుద్ధేశంతోనే బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిది అని ప్రశంసించారు. (ఎప్పటికైనా ఆ ఒక్కడినే అనుమతిస్తా: కరీనా)
Comments
Please login to add a commentAdd a comment