గుంటూరు జిల్లాలో గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలో గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ నేత జంగా కృష్ణమూర్తిపై డీఎస్పీ చేయి చేసుకున్నారు. అంతేకాక జంగాతోపాటు మరో 12మందిని దాచేపల్లి పోలీసు స్టేషన్లో నిర్భందించారు. డీఎస్పీ ఓవరాక్షన్పై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.
డీఎస్పీ చర్యకు నిరసనగా దాచేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. డీఎస్పీ నాగేశ్వరరావు చర్యపై నిరసనకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అప్పిరెడ్డి సంఘీభావం తెలిపారు.