
కాకినాడ రూరల్: రాష్ట్రంలో సిగ్గులేని రాజకీయ నాయ కుల లిస్టు తీస్తే పై వరుసలో చంద్రబాబు ఉంటారని, గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో పెద్ద ఎత్తున గెలిచి నట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్‌లో శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు. తొలిదశ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు 85 శాతం వరకు విజయం సాధించారని, ఒక్క కాకినాడ రూరల్‌లోనే 95 శాతం విజయం సాధించారన్నారు.
చంద్రబాబు టీడీపీకి 38 శాతం పంచాయతీలు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారని, వాటి వివరాలు వెల్ల డించాలన్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్‌ఈసీ ఏకపక్షం గా పనిచేస్తున్నారని, సక్రమంగా పని చేయలేదని ప్రచారాన్ని చంద్రబాబు మొదలు పెట్టారని దీని వెనక నిగూఢ రహస్యం అందరికీ తెలుసన్నారు. ఎస్‌ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఎన్నికలకు భయపడే ప్రభుత్వం తమది కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా ప్రజలు మాత్రం ఏకపక్షంగానే తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.