సాక్షి, కోనేరు సెంటర్(మచిలీపట్నం) : ‘నామినేషన్‌లు రద్దుచేసుకోమని మీ ఇంట్లో మగాళ్లకు చెప్పండి.. లేదంటే ప్రాణాలు తీస్తాం’.. అంటూ తెలుగుదేశం మాజీమంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెదిరింపులకు తెగబడ్డారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించడంటూ సోమవారం కృష్ణాజిల్లా బందరు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ..
బందరు మండలం పొట్లపాలెం గ్రామానికి చెందిన గాజుల నాగరాజు (మాజీ సర్పంచ్) ఈ నెల 7న వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ పంచాయతీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఆ పార్టీ నేతలు కుంచే దుర్గాప్రసాద్ (నాని), వాలిశెట్టి విమినేష్‌లు పొట్లపాలెం టీడీపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు మూడ్రోజులుగా యతి్నస్తున్నారు. కానీ, ఎవరూ ముందుకు రావటంలేదు. సోమవారం వారు మరోసారి గ్రామంలోకి వెళ్లి చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో అతని అనుచరులు నాగరాజు ఇంటి ముందు నిలబడి దుర్భాలాషలాడటం మొదలుపెట్టారు.
దుర్గాప్రసాద్, విమినేష్‌లు నాగరాజు ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి దిగారు. ఒంటరిగా ఉన్న నాగరాజు భార్యతో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే అతనితో పాటు కుటుంబసభ్యులను చంపుతామంటూ బెదిరించారు. నాగరాజు భార్య భయంతో కేకలు పెట్టటంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇదిచూసి కొల్లు రవీంద్ర అతని అనుచరులు అక్కడి నుంచి కారుల్లో వెళ్లిపోయారు. కాగా, నాగరాజు ఫిర్యాదు మేరకు కొల్లు రవీంద్ర, దుర్గాప్రసాద్, విమినేష్‌లపై 448, 506, 188, 171 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మూర్తి తెలిపారు.
చదవండి: చంపేస్తామంటూ.. విత్‌డ్రా చేయిస్తున్న టీడీపీ నేతలు
పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి
Comments
Please login to add a commentAdd a comment