nominations withdrawal
-
మునుగోడు బరిలో 33 మంది స్వతంత్రులు
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగిసింది. మొత్తంగా పోటీలో 47 మంది మిగిలారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులూ పోటీలో నిలిచారు. ఉప ఎన్నికకు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించగా.. మొత్తం 130 మంది దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు స్క్రుటినీలో 47 మంది నామినేషన్లను తిరస్కరించి, 83 మంది పత్రాలను ఆమోదించారు. ఇందులో సోమవారం 36 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 47 మంది బరిలో ఉన్నారు. మంత్రుల హామీతో తప్పుకున్న కొందరు మునుగోడు నియోజకవర్గంలోని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయినవారు, ఇతర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసినవారితో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపి ఉపసంహరణకు ఒప్పించారు. 26 మంది ఇతర జిల్లాల వారే.. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిగిలిన స్వతంత్రుల్లో ఇతర జిల్లాల వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం 33 మంది స్వతంత్రులు పోటీలో ఉంటే.. అందులో 26 మంది ఇతర జిల్లాలకు చెందిన వారే. మొత్తంగా నల్లగొండకు చెందిన ఏడుగురు, హైదరాబాద్ 5, రంగారెడ్డి 4, కరీంనగర్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 3, యాదాద్రి 3, ములుగు 3, సూర్యాపేట 2, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్‌ల నుంచి ఒక్కొక్కరు పోటీలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (బీజేపీ), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టీఆర్ఎస్), పాల్వాయి స్రవంతి (కాంగ్రెస్), ఆందోజు శంకరాచారి (బీఎస్పీ). రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు కొలిశెట్టి శివకుమార్ (యుగ తులసి పార్టీ), లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ), నందిపాటి జానయ్య (తెలంగాణ సకల జనుల పార్టీ), పల్లె వినయ్‌కుమార్ (తెలంగాణ జన సమితి), కంభంపాటి సత్యనారాయణ (నేషనల్ నవ క్రాంతి పార్టీ), మారమోని శ్రీశైలం యాదవ్ (సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి), పాల్వాయి వేణు (సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా), బత్తుల దిలీప్ (ప్రజా ఏక్తా), ప్రతాప్ సింహరాయుడు (తెలంగాణ జాగీర్ పార్టీ), యాదీశ్వర్ నక్క (తెలంగాణ రిపబ్లికన్ పార్టీ). ఒక్కో పోలింగ్ బూత్‌లో మూడు ఈవీఎంలు నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో 47 మంది బరిలో ఉండటంతో పెద్ద సంఖ్యలో ఈవీఎంలు అవసరం పడనున్నాయి. సాధారణంగా ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లతోపాటు నోటా బటన్ ఒకటి ఉంటుంది. ఈ లెక్కన మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి పోలింగ్ బూత్‌లో మూడు చొప్పున ఈవీఎంలు అవసరం పడనున్నాయి. ఓటర్లు మూడు ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లను వెతుక్కుని ఓటు వేయాల్సి ఉంటుంది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా అభ్యర్థులు.. మూడోసారి మునుగోడు ఉప ఎన్నికలో 47 మంది బరిలో మిగలడంతో.. రాష్ట్రంలో ఎక్కువ మంది అభ్యర్థులతో జరుగుతున్న మూడో ఎన్నికగా నిలవనుంది. ఇంతకుముందు 1996లో మొదటిసారిగా నల్లగొండ లోక్‌సభ ఎన్నికల్లో 480 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో 444 మంది నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యపై జల సాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో నామినేషన్లు వేయడం గమనార్హం. బ్యాలెట్ పత్రాన్ని పెద్ద బుక్‌లెట్‌లా ముద్రించాల్సి వచ్చింది. దీనితో నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యపై జాతీయస్థాయిలో దృష్టి పడింది. ఇక 2019లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పెద్ద సంఖ్యలో పసుపు రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికలో 185 మంది పోటీపడటం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. తాజాగా మునుగోడులో వివిధ డిమాండ్లతో నామినేషన్లు దాఖలుకాగా.. 47 మంది బరిలో నిలిచారు. -
మున్సిపోల్స్: జిల్లాల వారిగా ఏకగ్రీవాల వివరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించింది. చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ పాగా.. చిత్తూరు కార్పొరేషన్ పరిధలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకంది. దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. వైఎస్సార్ జిల్లాలో తిరుగేలేదు.. పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34కు 34 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ లోని 20 వార్డుల్లో 13 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ ఖాతాలో డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలు.. కర్నూల్ జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 12, ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలోని 27 వార్డులకు గాను 8, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, ఆదోని మున్సిపాలిటీలో 9, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3, గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు 7, మార్కాపురం మున్సిపాలిటీలోని 35 వార్డులకుగాను 5 వార్డులు, కనిగిరి నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డులు, నాయుడుపేట మున్సిపాలిటీలోని 25కి గాను 21 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల, పిడుగురాళ్ల వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. మాచర్ల మున్సిపాలిటీలోని మొత్తం 31 వార్డుల్లో, పిడుగురాళ్లలోని మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినుకొండ మున్సిపాలిటిలో 7, రేపల్లె మున్సిపాలిటీలో 4, సత్తెనపల్లిలో 2, తెనాలిలో 2, గుంటూరు కార్పొరేషన్లో 1 డివిజన్( 48వ డివిజన్)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు, తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డులు, నూజివీడు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులు, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులు, అమలాపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6, పిఠాపురంలో 6, సామర్లకోటలో 28 వార్డుల్లో 2, ముమ్మిడివరంలో 20 వార్డుల్లో 1 వార్డును వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో 3 డివిజన్లు, కొవ్వూరు మున్సిపాలిటీలో 9 వార్డులు, నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 2 వార్డులు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 2 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6 వార్డులు, బొబ్బిలి మున్సిపాలిటీలో 1 వార్డులో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం. -
తొలి రోజు 2,472 నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో 2,472 మంది అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు మంగళవారం, బుధవారం అవకాశం ఇవ్వగా.. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో తొలి రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 1,070 మంది, టీడీపీ అభ్యర్థులు 738 మంది, జనసేన అభ్యర్థులు 76 మంది, బీజేపీ అభ్యర్థులు 77 మంది, సీపీఎం అభ్యర్థులు 34 మంది, సీపీఐ అభ్యర్థులు 18 మంది ఉండగా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లు. ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీదే ఆధిక్యత తొలి రోజు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాష్ట్రంలో దాదాపు 245 డివిజన్లు/వార్డులు ఏకగ్రీవమైనట్టు అనధికారిక సమాచారం. ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ఒక్కొక్కటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. రాయచోటిలో 34 వార్డులకు గాను ఒక్కొక్క నామినేషన్ దాఖలు అయిన వార్డులు 28 ఉన్నాయి. కడప కార్పొరేషన్లో 18 డివిజన్లలో ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవమయ్యేందుకు మార్గం సుగమమైంది. బుధవారం మధ్యాహ్నం 3 తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిౖకైన డివిజన్లు/వార్డుల విషయంలో స్పష్టత వస్తుంది. -
నామినేషన్లు రద్దు చేసుకోండి.. లేదంటే చంపేస్తాం
సాక్షి, కోనేరు సెంటర్(మచిలీపట్నం) : ‘నామినేషన్లు రద్దుచేసుకోమని మీ ఇంట్లో మగాళ్లకు చెప్పండి.. లేదంటే ప్రాణాలు తీస్తాం’.. అంటూ తెలుగుదేశం మాజీమంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెదిరింపులకు తెగబడ్డారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించడంటూ సోమవారం కృష్ణాజిల్లా బందరు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ.. బందరు మండలం పొట్లపాలెం గ్రామానికి చెందిన గాజుల నాగరాజు (మాజీ సర్పంచ్) ఈ నెల 7న వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ పంచాయతీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఆ పార్టీ నేతలు కుంచే దుర్గాప్రసాద్ (నాని), వాలిశెట్టి విమినేష్లు పొట్లపాలెం టీడీపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు మూడ్రోజులుగా యతి్నస్తున్నారు. కానీ, ఎవరూ ముందుకు రావటంలేదు. సోమవారం వారు మరోసారి గ్రామంలోకి వెళ్లి చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో అతని అనుచరులు నాగరాజు ఇంటి ముందు నిలబడి దుర్భాలాషలాడటం మొదలుపెట్టారు. దుర్గాప్రసాద్, విమినేష్లు నాగరాజు ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి దిగారు. ఒంటరిగా ఉన్న నాగరాజు భార్యతో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే అతనితో పాటు కుటుంబసభ్యులను చంపుతామంటూ బెదిరించారు. నాగరాజు భార్య భయంతో కేకలు పెట్టటంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇదిచూసి కొల్లు రవీంద్ర అతని అనుచరులు అక్కడి నుంచి కారుల్లో వెళ్లిపోయారు. కాగా, నాగరాజు ఫిర్యాదు మేరకు కొల్లు రవీంద్ర, దుర్గాప్రసాద్, విమినేష్లపై 448, 506, 188, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. చదవండి: చంపేస్తామంటూ.. విత్‌డ్రా చేయిస్తున్న టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి -
రసవత్తరంగా మారిన రాజకీయం
-
నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో పూర్తి అయింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలో చివరగా 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెరాస నుంచి తన్నీరు హారిష్ రావు,భాజపా నుంచి నాయిని నరోత్తంరెడ్డి, మహాకూటమికి చెందిన తెలంగాణ జనసమితి పార్టీ నుంచి భవానిరెడ్డిలు పోటీలో ఉన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి గ్యాదరి జగన్, బహుజన సమాజ్ పార్టీ నుంచి పెద్దోళ్ల శ్రీనివాస్, శ్రమ జీవి పార్టీ నుంచి పుష్పలత, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి బుర్ర శ్రీనివాసులు పోటీచేస్తున్నారు. వీరితో పాటు సిద్దిపేట పట్టణానికి చెందిన మరో ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని సిద్దిపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. 31 మంది 59 సెట్లు నామినేషన్ల దాఖలు చేయగా, అందులో 2 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలిపారు. 29 మంది నామినేషన్లు సవ్యంగా ఉన్నట్టు చెప్పారు. గురువారం రోజు 17 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని కోరారు. -
ఫలించిన బుజ్జగింపులు; వెనక్కు తగ్గిన రెబల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు సాగించిన బుజ్జగింపులు ఫలించాయి. చాలా స్థానాల్లో రెబల్స్, స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్, తెలంగాణ జనసమితి మధ్య స్నేహపూర్వక పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను సాయంత్రం 6 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ రెబల్ భిక్షపతి యాదవ్, టీడీపీ రెబల్ మువ్వ సత్యనారాయణ, టీఆర్ఎస్ రెబల్ శంకర్ గౌడ్, మరో ఐదుగురు నామినేషన్ల ఉపసంహరణ చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం పాదాభివందనంతో దిగివచ్చిన రెబల్ వెంకటస్వామి, నామినేషన్ ఉపసంహరణ ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రాంరెడ్డి (ఎన్సీపీ), మర్పల్లి అంజయ్య యాదవ్(బీజేపీ రెబల్), గడ్డ జంగయ్య(ఇండిపెండెంట్), తోడే బాలచందర్(ఇండిపెండెంట్) నామినేషన్ల ఉపసంహరణ మేడ్చల్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ నామినేషన్ ఉపసంహరణ సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో కాంగ్రెస్ రెబల్స్ అంజి రెడ్డి, సహను దేవ్, కొలను బాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, శశికళ యాదవ్ రెడ్డి నామినేషన్ల ఉపసంహరణ ఆందోల్‌లో అల్లారం రత్నయ్య, పొట్టిపల్లి మొగులయ్య, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మల్యాద్రి రెడ్డి నామినేషన్ ఉపసంహరణ ఎల్లారెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పైలా కృష్ణారెడ్డి నామినేషన్ల ఉపసంహరణ ఇండిపెండెంట్ నారాయణ నామినేషన్ ఉపసంహరణ నిజామాబాద్‌లో బీజేపీ రెబల్ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నామినేషన్ ఉపసంహరణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు అమరేందర్ రెడ్డి, రేపాల శ్రీనివాస్, పోరెడ్డి స్రవంత్ రెడ్డి, టీజేఎస్ అభ్యర్థి గవ్వా విద్యాధర్ రెడ్డి సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్స్ పటేల్ రమెష్ రెడ్డి, తండు శ్రీనివాస్ నామినేషన్ల ఉపసంహరణ కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థి శశిదర్ రెడ్డి నామినేషన్ విత్‌డ్రా కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఈటల జమున, బండి కళాధర్, బోయిని రఘు, మంతిని ప్రశాంత్, రాచపల్లి రమేష్, చిలువేరు శ్రీకాంత్, గుర్రం వెంకటేశ్వర్లు, కురుమెల్లి హరి నామినేషన్ల విత్‌డ్రా జగిత్యాల జిల్లా కోరుట్లలో స్వతంత్ర అభ్యర్థులు కొమిరెడ్డి జ్యోతి, జంగిలి సునీత, జువ్వాడి కృష్ణారావు పోటీ నుంచి తప్పుకున్నారు. ధర్మపురిలో స్వతంత్ర అభ్యర్థి రామగిరి సంతోష్ నామినేషన్ ఉపసంహరణ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకున్న చేతి ధర్మయ్య, దాసరి పుష్పలతారెడ్డి, బొంకూరి కైలాసం, పల్కల వాసుదేవ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి గోపు అయిలయ్య యాదవ్ నామినేషన్ ఉపసంహరణ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి(స్వతంత్ర) రాజేందర్ రెడ్డి(టీజేఎస్) నామినేషన్ల ఉపసంహరణ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీజేఎస్, కాంగ్రెస్ రెబల్స్ సున్నం నాగమణి, మడకం ప్రసాద్ నామినేషన్ల ఉపసంహరణ పినపాకలో బీఎస్పీ అభ్యర్థి కేతావత్ స్వప్న, స్వతంత్ర అభ్యర్థి కొమరం రాంగోపాల్ నామినేషన్ల ఉపసంహరణ భద్రాచలంలో స్వతంత్రులు తెల్లం సీతమ్మ, పుణెం రాంబాబు నామినేషన్ల ఉపసంహరణ -
బరిలో నిలిచేదెవరో..!
సాక్షి, సిరిసిల్ల: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం తుది గడువు కాగా ఎంతమంది బరిలో నిలువనున్నారు.. ఎంతమంది తప్పుకోనున్నారో, అసలు పోటీదారులెందరో తేలనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకరు, వేములవాడ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థుల నామినేషన్‌పత్రాలు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు అంగీకరించడంతో ఆయా పార్టీల అనుబంధంగా వేసిన ఇతర అభ్యర్థులతోపాటు, నామినేషన్ పత్రాలను సరిగా పూర్తిచేయని మరికొంత మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపసంహరణ తర్వాత ఎన్నికల పోరులో నిలువనున్న అభ్యర్థుల సంఖ్య ఎంత అన్నది తేటతెల్లమవుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల్లోకి చేరికలు, నియోజకవర్గం అంతటా పర్యటనలు, ర్యాలీలు, ప్రచార వ్యూహాలతో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రచారానికి మిగిలింది 14 రోజులే.. ముందస్తు ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేసుకుని మలిదశ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా 14రోజులు మాత్రమే సమయం ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మైలేజీ పొందేలా అభ్యర్థులు ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. రోజూ నియోజకవర్గంలో ఏదోఒక మూలన సభ, ర్యాలీ, సమావేశం, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళిక చేసుకుంటున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గాల్లో పార్టీలు, జెండాల వేడి ఇంతకింతకు రాజుకోనుంది. పెద్ద తలలపైనే భారం.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో తమ శక్తియుక్తులను ధారబోశారు. ఇకపై ఉన్న సమయంలో తమదైన ప్రచారంతోపాటు తమతమ పార్టీల పెద్దల ప్రచార స మయాన్ని నియోజకవర్గంలో కేటా యించాలని ప్రయత్నాలు చేసుకుం టున్నారు. ఇప్పటి కే గులాబీ అధినేత కేసీఆర్ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వేడి పుట్టించగా.. అదే దిశగా మిగిలిన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, రాష్ట్రస్థాయి నేతలతో పాటు స్టార్ కాంపెయినర్ల సమయం కోసం జిల్లాలోని అభ్యర్థులు వేచిచూస్తున్నారు. వారిరాక కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. మిగిలిన రెండు వారాల సమయంలో జిల్లాలో వివిధ పార్టీల నేతల అధినేతలు, పార్టీ పెద్దలు, స్టార్ కాంపెయినర్లతో మోత పుట్టించేం దుకు ఆయా పార్టీల అభ్యర్థులంతా రెడీ అవుతున్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైన సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి 1) అర్వరాజు కృష్ణంరావు – న్యూఇండియా పార్టీ వేములవాడ అభ్యర్థులు.. 1) ఆది వనజ – కాంగ్రెస్ 2) ప్రతాప మార్తాండ తేజ – బీజేపీ 3) చెల్మెడ రాజేశ్వర్‌రావు – టీఆర్ఎస్ 4) మ్యాకల ఉదయ్‌కుమార్ – సమజ్వాదీ పార్టీ 5) కొండ దినేశ్ – ఇండిపెండెంట్ 6) గోగుల రమేశ్ – సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా 7) గంటా ఇస్తరీ – ఇండిపెండెంట్ -
రెబెల్స్: ప్రస్తుత రాజకీయ వేడి ఎలా ఉందంటే..
సాక్షినెట్‌వర్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా మారుతోంది. ఈ రణరంగంలో మిగేలేదెవరో.. పోటీ నుంచి వైదొలగేదెవరో గురువారం తేలిపోనుంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కని ఆశావహులు రె‘బెల్స్’ మోగించారు. కొందరు జాతీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీల నుంచి నామినేషన్లు వేయగా, మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల్లో మొత్తంగా 648 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో బుజ్జ గింపుల పర్వం ఊపందుకుంది. సనత్‌నగర్‌లో ఏ పార్టీకీ రెబల్స్ బెడద లేనప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ‘దండే విఠల్’కు కేటీఆర్ ఫోన్ చేశారు. పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు సహకరించాలని కోరారు. మజ్లిస్‌కు పట్టున్న అసెంబ్లీసెగ్మెంట్లలో ప్రధాన పార్టీలకు పెద్దగా రెబల్స్ బెడద లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఆజామ్ ఖాన్, కావూరి వెంకటేష్ టీఆర్ఎస్ రెబెల్స్‌గా కార్వాన్లో నామినేషన్లు వేశారు. నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ వేడి ఎలా ఉందంటే.. ఉప్పల్: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు మేకల శివారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థికి సహకరిస్తామని ప్రకటించారు. సింగిరెడ్డిని కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలి, డీకే.శివకుమార్‌లు పిలిపించి బుజ్జగించి సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నందికొండ శ్రీనివాస్‌రెడ్డి వేసిన నామినేషన్ అనూహ్య పరిణామాల మధ్య తిరస్కరించడంతో ఉప్పల్ అభ్యర్థులకు రెబల్ బెడద లేనట్టయింది. ఖైరతాబాద్: కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్లు వేసిన చేసిన డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి, బి.రాజుయాదవ్, టీడీపీ రెబల్ అభ్యర్థి బీఎన్ రెడ్డిల నామినేషన్లు తిరస్కరణతో ప్రజాకూటమికి లైన్ క్లియర్ అయింది. ఇక టీఆర్ఎస్లో రెబల్‌గా నామినేషన్ వేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. మల్కాజిగిరి: పొత్తులో భాగంగా టీజేఎస్‌కు ఈ సీటు వెళ్లగా, కాంగెస్ ఓబీసీ సెల్ జాతీయ కో–ఆర్డినేటర్ బి.సురేష్‌యాదవ్, సీనియర్ నేత రామకృష్ణ నాయుడు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి గోపు రమణారెడ్డి నామినేషన్ వేశారు. టీఆఎర్ఎస్కు ఇక్కడ రెబల్స్ బెడద లేదు. అంబర్‌పేట: అంబర్‌పేట మహాకూటమి చర్చల సీన్ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసానికి చేరింది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న లక్షణ్యాదవ్, టీజేఎస్ అభ్యర్థి నిజ్జన రమేష్ ఇద్దరూ బుధవారం వీహెచ్‌ను కలిశారు. అక్కడే ఉన్న మీడియా ‘అంబర్‌పేట మహాకూటమి అభ్యర్థిపై స్పష్టత ఇస్తారా?’ అని ప్రశ్నించడంతో ‘‘ఇద్దరూ ఉంటార’’ని ఆయన చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఇద్దరిలో ఎవరు ఉపసంహరించుకుంటారో చూడాలి. టీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్తలైన బీవీ రమణ, సునీల్ బిడ్లల నామినేషన్లు ఆమోదం పొందాయి. వీరు బరిలో ఉంటారా.. లేదా అన్నది గురువారం తేలిపోనుంది. అంబర్‌పేట నుంచి టీడీపీ టికెట్ ఆశించిన వనం రమేష్ స్వతంత్రుడిగా నామినేషన్ వేశారు. జూబ్లీహిల్స్: టీఆర్ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ మహ్మద్ హుస్సేన్ బరిలో కొనసాగే అవకాశాలున్నాయి. బుధవారం ఆయన తన మద్ధతుదారులు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమై టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను ఓడించాలని తీర్మానించారు. ఎంఐఎం ఎవరినీ పోటీలో నిలపకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ రెబల్‌గా నామినేసన్ వేసిన కొలన్ హన్మంత్‌రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య టీడీపీలో చేరారు. ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌కు మద్దతిస్తున్న ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కాసాని వీరేశ్ పోటీలో ఉంటారా.. లేదా.. అనేది గురువారం తేలనుంది. సికింద్రాబాద్: కాంగ్రెస్ నుంచి రెబల్‌గా నామినేషన్ వేసిన మాజీ మేయర్ కార్తీకరెడ్డి ఇంకా అలక వీడలేదు. మరో రెబల్ ఆదం ఉమాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు పలికారు. ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు దాసరి శ్రీనివాస్, ఎస్.యాదగిరిలను కూడా ఆపద్ధర్మ మంత్రి పద్మారావు బుజ్జగిస్తున్నారు. కంటోన్మెంట్: ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు టీఆర్ఎస్ రెబల్స్‌గా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన గజ్జెల నాగేశ్‌తో పాటు తెలంగాణ ఉద్యమకారిణి గంధం దయామణి ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. అయితే, వీరిద్దరూ పోటీలో ఉంటామని చెబుతుండగా, బుధవారం రాత్రి కేటీఆర్ ఇద్దరికీ ఫోన్ చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన శ్రీగణేష్ ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. మేడ్చల్: టీఆర్ఎస్ టికెట్ ఆశించిన నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు అవకాశం దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్(జంగయ్య యాదవ్) కూడా బరిలో ఉన్నారు. అయితే, మేడ్చల్‌లో శుక్రవారం సోనియాగాంధీ బహిరంగసభ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు ఇది మింగుడుపడని అంశంగా మారింది. కూకట్పల్లి: ప్రజాకూటమి అభ్యర్థికి రెబల్‌గా కాంగ్రెస్ నేత గొట్టముక్కల వెంగళరావు నామినేషన్ వేయగా, టీఆర్ఎస్ టికెట్ ఆశించిన హరీష్ చంద్రారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. ప్రచారం కూడా వేగవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోవడంతో కేడర్ రెండుమూడు వర్గాలుగా చీలిపోయింది. మహేశ్వరం: గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కొత్త మనోహరెడ్డికి టికెట్ రాకపోవడంతో ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన్ను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సిందే. రాజేంద్రనగర్: ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ సభ్యుడు వేణుగౌడ్తో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి చర్చించారు. శంషాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆయన.. పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి లేదా సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా శాంతింపజేశారు. ఇబ్రహీంపట్నం: ఇక్కడ మాత్రం మల్రెడ్డి బ్రదర్స్ ఇంకా కుదటపడలేదు. కాంగ్రెస్ తరఫున నుంచి పోటీ చేయాలని భావించిన మల్రెడ్డి రంగారెడ్డికి టీడీపీ రూపేణా దురదృష్టం వెంటాడింది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ‘దేశం’కు కేటా యించారు. అయితే, టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీపై డైలామాలో ఉండడంతో తమకు అవకాశం ఇవ్వాలని మల్రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. బీఎస్పీ, ఎన్సీపీల తరుఫున నామినేషన్లు కూడా వేసిన ఈ ఇరువురు తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కూడా కలిసి.. ఇబ్రహీంపట్నం సీటు మార్పిడిపై చంద్రబాబుతో చర్చించాలని కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షుల భేటీ అనంతరం వీరి పోటీపై స్పష్టత రానుంది. ఒకవేళ టీడీపీ తప్పుకోకపోతే.. వీరిని పోటీ నుంచి తప్పించేందుకు అధిష్టానం రంగంలోకి దిగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. శేరిలింగంపల్లి: టీడీపీ రెబల్‌గా పోటీలో ఉన్న మొవ్వా సత్యనారాయణ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ఆయన్ను అమరావతికి పిలిపించి టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. టీఆర్ఎస్ అసమ్మతి నేత శంకర్‌గౌడ్‌కు కేటీఆర్ ఫోన్ చేసి బుజ్జగించి పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. స్వతంత్రుడిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఆయన్ను కలిశారు. అయితే, మరోవైపు భిక్షపతి యాదవ్‌కు టీఆర్ఎస్కు పిలుపు వచ్చినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఏకంగా చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలిసి హుటాహుటిన ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌పటేల్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డి, జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్‌లు బుధవారం రాత్రి భిక్షపతియాదవ్ నివాసానికి వెళ్లి బుజ్జగించారు. అన్యాయం జరిగిన విషయం వాస్తవమే అని తగిన న్యాయం చేస్తామని అహ్మద్‌పటేల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. నామినేషన్ ఉపసంహరించుకొని మహా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. అయితే కార్యకర్తల సమావేశంలో వారి మనోభావాలు తెలుసుకున్నాక భిక్షపతియాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని పార్టీలో.. అంతమంది అభ్యర్థులు నామినేషన్లు అర్హత పొందిన అభ్యర్థుల్లో ఎన్నెన్నో పార్టీల వారున్నారు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనవాహిని పార్టీ, యువ పార్టీ, న్యూ ఇండియా పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), తెలంగాణ యువశక్తి, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ పార్టీ, బహుజన రాష్ట్ర సమితి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, బీఎల్ఎఫ్, ఇండియన్ ప్రజాబంధు పార్టీ, దళిత బహుజన్ పార్టీ, బీఎస్పీ, హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ, జైభారత్ జనసేన పార్టీ, జేడీ(ఎస్), లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీ, జాతీయ మహిళా పార్టీ, నవ సమాజ్ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, మజ్లిస్ మర్కజ్–ఇ–సియాజీ, తదితర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
హైదరాబాద్: తెలంగాణలోని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. నాలుగు జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ప్రతిపక్ష, స్వతంత్ర సభ్యులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు, వరంగల్ నుంచి కొండా మురళి, ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్ కుమార్, మెదక్ నుంచి భూపాల్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 27 పోలింగ్ జరగనుంది. 30 వతేదీ ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. కాగా ఎన్నికలు జరుగుతున్న నాలుగు జిల్లాల్లోనే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. క్యాంప్ రాజకీయాలకు పాల్పడితే ఒప్పుకోమని ఆయన హెచ్చరించారు. ఒకే బ్యాలెట్ తో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. -
నామినేషన్ల ఉపసంహరణ నేడు
టీఆర్ఎస్ ఐదో అభ్యర్థి బరిలోనే ఉంటారా? ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఐదో అభ్యర్థిని పోటీలో కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఆరు ఖాళీలకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. అయితే అధికార పార్టీ నాలుగు స్థానాలతో తృప్తి పడి, ఐదో అభ్యర్థిని ఉపసంహరించుకుంటే ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. కానీ, టీఆర్ఎస్ తనకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని కాకుండా ‘అంకెల గారడీ’ని నమ్ముకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీ సీటుకు 2 ఓట్ల దూరంలో నిలిచిపోయిన టీడీపీ తన విజయంపై విశ్వాసంతోనే ఉంది. కానీ, టీఆర్ఎస్ ఎక్కడ తమ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయిస్తుందోనన్న ఆందోళన అటు టీడీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ ఉంది. దీంతో నామినేషన్ ఉపసంహరణపై సోమవారం టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఊపందుకుంది. మండలిలో టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని టీటీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఎమ్మెల్యేలంతా ఆత్మప్రభోదం ప్రకారం ఓట్లేయాలని టీఆర్ఎస్ నాయకులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ గూటికి చేరగా, మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రకాశ్ గౌడ్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేస్తారన్న అంచనాలు మొదలయ్యాయి. -
పోరుకు సిద్ధం
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపైనే దృష్టి సారించారు. అయితే ఈ పోరులో కాంగ్రెస్‌పార్టీ పూర్తిస్థాయిలో కుదేలైంది. కనీసం అభ్యర్థులను కూడా బరిలోకి దింపలేక చేతులెత్తేసింది. డీసీసీ అధ్యక్షుడు సైతం తన నియోజకవర్గంలోనే పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరో వైపు లోక్‌సత్తాతోపాటు కమ్యూనిస్టులు, బీజేపీ, బీఎస్పీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆదివారం సాయంత్రానికి 539 మంది జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారిలో 212 మంది సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల సంఖ్య 327 మంది. మొత్తం 790 ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి 17 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైఎస్సార్సీపీకి 9 స్థానాలు లభించగా టీడీపీకి 4, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు లభించాయి. మిగిలిన 773 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీ జరగనున్నాయి. ఇక జెడ్పీ చైర్మన్ అభ్యర్థి పోరుకు సిద్ధం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ గుడ్లూరు, పుల్లలచెరువు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో గుడ్లూరు నుంచి ఆయన ఉపసంహరించుకొని పుల్లలచెరువు నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి అభ్యర్థులుగా భావిస్తున్న మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మన్నె రవీంద్ర దొనకొండ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్న మరో అభ్యర్థి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు పొన్నలూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జనన మరణాల నివేదికలు సకాలంలో పంపాలి ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జనన మరణాల నివేదికలు సకాలంలో పంపాలని డెరైక్టరేట్ ఆఫ్ సెన్సస్ అదనపు డైరక్టర్ వై సుబ్రహ్మణ్యం ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వచ్చే జనన మరణ నెలసరి నివేదికలు కౌంటర్ ఫైళ్లతో పాటూ సకాలంలో జనన మరణ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపడంలో జరుగుతున్న జాప్యాలను పరిశీలించడానికి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కందుకూరు, పొన్నలూరు, సింగరాయకొండ, మర్రిపూడి, పొదిలి మండలాలను సందర్శించారు. వివిధ పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులతో క్షేత్ర స్థాయిలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పరిశీలనలో కుటుంబ నియంత్రణ గణాంక అధికారి పీ శ్రీధర్‌రావు, అబ్దుల్ కలాం, ఎల్డీ కంప్యూటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నజరానా....
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణలో రూ.లక్షలు చేతులు మారాయి. జెడ్పీ ఆవరణలో సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో.. భారీ మొత్తంలో ఒప్పందం చేసుకుని కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జెడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరణకు పలువురు అభ్యర్థులు రూ.5 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేశారు. చివరకు ఆయా పార్టీల నేతలు సైతం రెబల్ అభ్యర్థులను ఉపసంహరింపజేయడానికి నానా అవస్థలు పడ్డారు. తాము విజయం సాధిస్తే తమ పరిధిలోని క్రాంటాక్ట్ పనులు కూడా ఇప్పిస్తామని బరిలో నిలిచే అభ్యర్థులు రెబల్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఎంపీటీసీ స్థానానికి గ్రామ పెద్దలు రూ.12 లక్షలకు వేలం వేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈ నిధులను గ్రామాభివృద్ది కోసం వినియోగించాలని షరతు విధించారనే ప్రచారం సాగుతోంది. జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు ఆయా పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారు. రెబల్ అభ్యర్థులను బరిలోనుంచి తప్పించేందుకు డబ్బు వెదలజ్లేందుకైనా వెనకాడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్ల, పినపాక, వేంసూరు, వెంకటాపురం, ఏన్కూర్, కొత్తగూడెం, భద్రాచలం మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ రెబల్ అభ్యర్థులను బరిలో నుంచి ఉపసంహరించడానికి ఆయా పార్టీల నేతలు తలకిందులయ్యారు. చివరకు బేరసారాల నడుమ బరిలో నుంచి తప్పుకున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, మధిర, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. వాటి ఉపసంహరణకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. నేతలకు తలనొప్పి.... నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు ఆయా పార్టీల నాయకులు ఉరుకులు పరుగులు తీశారు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు రెబల్స్ కోరినంత ముట్టజెప్పేందుకు వెనకాడలేదు. ఇలా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల పైగా డిమాండ్ చేసినవారు ఉన్నారు. ఖమ్మం పరిసర మండలంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని ఉపసంహరింపజేయడానికి ఆ పార్టీ నేతలకు చెమటలు పట్టాయి. రూ. లక్షల్లో డిమాండ్ చేసిన ఆ ఆభ్యర్థి ఏ నాయకుడు వారించినా వినలేదు. చివరకు తాను గెలిస్తే తన పరిధిలోని క్రాంటాక్ట్ పనులు ఇస్తానని అధికారిక అభ్యర్థి హామీ ఇవ్వడంతో పాటు నామినేషన్ ఖర్చులు రూ.5 వేలు చెల్లించాక రెబల్ అభ్యర్థి తప్పుకున్నాడు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, సహకార ఎన్నికలు ముగియడంతో గ్రామ, మండల స్థాయి నాయకులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే చివరి అవకాశం. దీంతో పోటీ నుంచి తప్పుకునేందుకు చాలామంది అంగీకరించలేదు. కొందరు మాత్రం నజరానాలు, నామినేటెడ్ పదవులు ఆశించి రంగం నుంచి తప్పుకున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
1094 జడ్పీటీసీలకు బరిలో 5276 మంది సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. 1096 జడ్పీటీసీలకు 12,590 నామినేషన్లు, 16,589 ఎంపీటీసీ స్థానాలకు 1,17,629 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని నామినేషన్ల పరిశీలన దశలోనే తిరస్కారానికి గురయ్యాయి. ఇక సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ.. రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితాను రూపొందించడంలో అధికారులు తీవ్ర జాప్యంచేశారు. రాత్రి పొద్దుపోయాక వారికి గుర్తులు కేటాయిం చారు. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు 1094 జడ్పీటీసీలకు మొత్తం 5276 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడాన్ని నిరసిస్తూ రెండు మండలాల్లో ఎన్నికలను బహిష్కరించారు. ఈ జిల్లాలోని కుక్కునూరు(ఎవరూ నామినేషన్ వేయలేదు), వేలేర్పాడు(వేసిన వారంతా ఉపసంహరించుకున్నారు) మండలాల్లో ఎవరూ బరిలో లేకపోవడంతో ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాల్లో ఇదివరకే ఎంపిక చేసిన ఆఫ్సెట్ ప్రింటర్ల యజమానులకు ఆ పని అప్పగించారు. నాలుగైదు రోజుల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తులతో కూడిన బ్యాలెట్ పత్రాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేసు మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో.. రెండుదశల్లో ఎన్నికలకు సుప్రీంకోర్టు అనుమతినిస్తే జిల్లాల్లో డివిజన్ల సంఖ్య ఆధారంగా రెండుగా విభజించి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. వచ్చే నెల 6, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి, 11న ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావిస్తోంది. -
ముగిసిన ఉపసంహరణ ఘట్టం
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపట్లో ప్రకటించనుంది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 11న ఫలితాలు ప్రకటిస్తారు. * ప్రకాశం జిల్లా దర్మి ఎంపీటీసీ-2 స్థానాన్ని వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. * చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 287 మంది అభ్యర్థులు ఉన్నారు. * ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ 54 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, 8 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. -
బరిలో మిగిలేది ఎవరో..?!
భద్రాచలం, న్యూస్‌లైన్: స్థానిక సమరం రసవత్తరంగా మారుతోంది. బరిలో నిలిచేది ఎవరో సోమవారం సాయంత్రానికి తెలిసిపోతుంది. భద్రాచలం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 93 ఎంపీటీసీ స్థానాలకు 553 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శని, ఆదివారాల్లో దుమ్ముగూడెం మండలంలో ఆరు, వీఆర్‌పురం మండలంలో నలుగురు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల నుంచి డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని సోమవారం ఉపసంహరించనున్నారు. రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు బుజ్జగించే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరుగుతున్నా అవి సఫలం కాకపోవడంతో నామినేషన్ల ఉపసంహరణకు ఆయా పార్టీల అభ్యర్థులు ముందుకు రావడం లేదు. వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో పొత్తులపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. మిగతా మండలాల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు సీపీఐ, ఇతర పార్టీల వారు కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్, టీడీపీలకు రెబల్స్ బెడద జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు చాలా చోట్ల కాంగ్రెస్, టీడీపీలకు రెబల్స్ బెడద తీవ్రంగానే ఉంది. భద్రాచలం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ తరుపున ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ఒకరికి పట్టణ కమిటీ, మరొకరికి మండల కమిటీ, ఇంకొకరికి జిల్లా స్థాయిలో పార్టీ వ్యవ హారాలు చూసే నాయకుల మద్దతు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. బీఫామ్ ఎవరికిచ్చినా మిగిలిన ఇద్దరు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి విషయంలో ఇప్పటికే విభేదాలు తారాస్థాయికి చేరాయి. తనకు కాదని మరో వ్యక్తికి బీఫామ్ కట్టబెట్టడంపై చింతిర్యాల రవికుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీకి రాజీనామా ప్రకటించటంతో పాటు ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై తీవ్రమైన ఆరోపణలు సంధించారు. చర్ల మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్, టీడీపీల విషయంలో దాదాపు ఇదే రీతిన ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇటువంటి వారు ప్రజలకేం సేవచే స్తారని పరిశీలకులు అంటున్నారు. బేరసారాలకు దిగుతున్న నాయకులు తాము పోటీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీల నుంచి రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తెగేసి చెబుతుండడంతో వారిని బుజ్జగించే పనిలో నాయకులు ఉన్నారు. ఉపసంహరించుకున్న వారికి నజరానాలు కూడా ముట్టజెబుతామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రానికి బరిలో ఎవరు ఉంటారో... తేలిపోనుంది. -
బేరసారాలు మొదలు !
ఉపసంహరణకు రూ.లక్షలు నజరానా ? రెబల్స్‌ను బుజ్జగిస్తున్న పార్టీల నేతలు ‘స్థానిక’ పోరులో అభ్యర్థుల హైరానా బీఫాం కోసం నేతల చుట్టూ ప్ర‘దక్షిణ’లు! ఖమ్మం: స్థానిక పోరులో ఇక బేరసారాలకు తెర లేచింది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థులకు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. లక్షల రూపాయలు నజరానా ఇచ్చేందుకు మధ్యవర్తులతో మంతనాలు జరుపుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ప్రస్తుతం ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 640 ఎంపీటీసీ స్థానాలకు నాలుగు వేలకు పైగా నామినేషన్లు, 46 జెడ్పీటీసీలకు 497 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని పార్టీలు ఒక స్థానం నుంచి ఒక్క అభ్యర్థినే బరిలోకి దించితే.. మరికొన్ని పార్టీల నుంచి ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు వరకు నామినేషన్లు వేశారు. ప్రధానంగా ఎంపీటీసీ నామినేషన్లలో ఈ పరిస్థితి కనిపించింది. నేతల హామీలతో వారి అనుచరగణమంతా ఎవరికివారు తమది ఫలానా పార్టీ అని పేర్కొంటూ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కో స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేయడంతో ఇప్పుడు ఎవరు బరిలో ఉంటారు..?ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారనే చర్చ ఆయా పార్టీల్లో కొనసాగుతోంది. కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, మధిర, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ స్థానాలకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అనుచరులు పోటీగా నామినేషన్లను వేసి వర్గపోరు సమసిపోలేదని నిరూపించారు. అలాగే పార్టీల తరఫున బీఫాం వస్తుందో..రాదోనని మరికొంత మంది స్వతంత్రులుగా కూడా నామినేషన్ వేశారు. ఇలా పార్టీల తరఫున ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ వేయడంతో ఎవరిని బుజ్జగించాలన్నది ఇప్పుడు నాయకులకు తలనొప్పిగా మారింది. బుజ్జగింపులు.. నజరానాలు.. నామినేషన్ల పరిశీలన ముగియడం, ఉప సంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరిని బరిలో ఉంచాలన్నది పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బరిలో తప్పకుండా నిలవాలనుకనే వారు.. నామినేషన్ వేసిన వారికి ఎంతోకొంత నజరానా ఇవ్వాల్సిందేనని ఇప్పటికే నేతలు అభ్యర్థుల ముందు ప్రస్తావన తెచ్చారని తెలుస్తోంది. ఎంపీటీసీకి రిజర్వేషన్ ఆధారంగా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల పైగా బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. మండలపరిషత్ పీఠం దక్కించుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. కొన్ని చోట్ల వర్గాల వారీగా నామినేషన్లు వేయడంతో ఇక్కడ బుజ్జగింపులు ఉండవని, ప్రత్యక్ష పోరులోనే అమీతుమీ తేల్చుకుంటామని ఆయా పార్టీల నేతలు అంటున్నారు. బీ ఫారానికీ ‘రేటు’.. కొన్ని పార్టీల తీరు ఎలా ఉందంటే....పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులకు రెండువైపులా చిలుము వదిలే పరిస్థితి ఎదురవుతోంది. రెబల్స్‌ను బుజ్జగించడానికి నజరానా ఇవ్వడం ఒకటయితే.. బీఫాం దక్కించుకోవడానికి కూడా జేబు ఖాళీ అవుతోంది. ఎక్కువ ఓటర్లు ఉండి, రాజకీయంగా పలుకుబడి ఉండే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ తరఫున బీఫాం దక్కాలంటే.. ఆయా నేతలు నిర్ణయించిన రేటుకు తల ఊపాల్సిందే. నామినేషన్ వేసిన అభ్యర్థులు పార్టీ బీఫాం దక్కించుకోవడానికి తమకు తెలిసిన నేతల ద్వారా అసలు నేతలతో బేరసారాలకు తెరలేపారు. నామినేషన్ వేసినా పార్టీ గుర్తింపు లేకపోతే విజయం వరించదన్న భావనతో బీఫాం కోసమే రూ.లక్షలు ముట్టజెప్పడానికి కూడా కొందరు అభ్యర్థులు వెనుకాడడం లేదని సమాచారం. నామినేషన్ల ఉప సంహరణకు ఇక మూడు రోజులే గడువు ఉండడంతో మధ్యవర్తులతో ప్రయోజనం లేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు ఏకంగా నేతల ఇంటి చుట్టూ అప్పుడే ప్రదక్షిణలు చేస్తున్నారు. -
ఇక ప్రచార హోరు!
మున్సిపోల్స్‌కు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. చివరిరోజున వేలాదిమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. అరుుతే 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు గాను మొత్తం ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉన్నారో పూర్తి వివరాలు మంగళవారం అర్ధరాత్రి వరకు అందలేదు. అందిన సమాచారం మేరకు కరీంనగర్ కార్పొరేషన్లో 50 డివిజన్లకు గాను 376 మంది, రాజమండ్రి 50-278, ఏలూరు 50-174, కడప 50-311, అనంతపురం 50-222, చిత్తూరు 50-209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 114 మునిసిపాలిటీలకు సంబంధించిన 3,089 వార్డులకు 12,840 మంది పోటీలో ఉన్నట్టు సమాచారం. ఇలావుండగా.. ఇప్పటికే ఇటు మునిసిపల్ అటు సాధారణ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న పార్టీలు బుధవారం నుంచి ప్రచార జోరు పెంచనున్నారుు. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ నాయకురాలు షర్మిల వేర్వేరుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కాగా సీమాంధ్రలోని కొన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అసలు నామినేషన్లే దాఖలు కాకపోవడం గమనార్హం. మరికొన్ని మునిసిపాలిటీల్లో ఒకటీ రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సీమాంధ్రలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే పోటీ నెలకొంది. ఇక తెలంగాణలో చాలాచోట్ల కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ ప్రధానంగా పోటీ పడనున్నాయి. -
మున్సిపల్ బరిలో 525 మంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మున్సిపల్ ఎన్నికల బరిలో కీలకఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ నామినేషన్లు ఉపసహరించుకున్నారు. దీంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ఈనెల 30న 97 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 525 మంది బరిలో మిగిలారు. ఇల్లెందులో 24 వార్డులకు గాను 175 మంది, కొత్తగూడెంలో 33 వార్డులకు గాను 190 మంది, సత్తుపల్లిలో 20 వార్డులకు గాను 74 మంది, మధిరలో 20 వార్డులకు 86 మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ-సీపీఎం, కాంగ్రెస్-సీపీఐలు పొత్తు కుదుర్చుకోగా టీడీపీ స్వతంత్రంగానే బరిలో ఉంది. కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ ఒంటరిపోరు చేస్తుండగా, సీపీఐ-టీఆర్ఎస్లు అవగాహనకు వచ్చాయి. మొత్తంమీద నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం చాలా వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని చోట్ల వివిధ పార్టీల రెబల్ అభ్యర్థులతో పాటు ఇతరులు కూడా బరిలో ఉండడంతో బహుముఖ పోటీ కూడా నెలకొంది. రెబల్స్‌కు సంబంధించి అధికార పార్టీలో ఎక్కువ మంది బరిలో ఉన్నారు. ఒక్క ఇల్లెందు మున్సిపాలిటీలోనే ఆ పార్టీ తరఫున 34 మంది రెబల్స్ బరిలో ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి. మిగిలిన పార్టీలకు కూడా అక్కడక్కడా తిరుగుబాటు తలనొప్పి మిగిలింది. ‘బరి’ గీశారిలా.... నామినేషన్ల ఉపసంహరణ విషయానికి వస్తే కొత్తగూడెంలో అత్యధికంగా 105 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మొత్తం 309 నామినేషన్లు దాఖలైతే14 తిరస్కరణకు గురికాగా, ఉపసంహ రణలు పోను 190 మంది బరిలో ఉన్నారు. ఇల్లెందులో 255 మంది నామినేషన్లు దాఖలు చేయగా, తొమ్మిది తిరస్కరించారు. 71 మంది ఉపసంహరించుకుంటే 175 మంది బరిలో ఉన్నారు. మధిరలో 115 నామినేషన్లలో ఏడు తిరస్కరణకు గురయ్యాయి. 22 మంది ఉపసంహరించుకోగా 86 మంది పోటీలో ఉన్నారు. సత్తుపల్లి విషయానికొస్తే మొత్తం 109 నామినేషన్లు దాఖలయ్యాయి. 35 మంది ఉపసంహరించుకుంటే 74 మంది బరిలో నిలిచారు. ఇక్కడ ఒక్క నామినేషన్‌ను కూడా తిరస్కరించలేదు. ఇక తమ పార్టీల తరఫున రంగంలో దిగిన రెబల్స్‌ను బుజ్జగించేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడ్డాయి. ఉపసంహరణలకు చివరిరోజు కావడంతో మంగళవారమంతా అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థులను బతిమిలాడే పనిలో బిజీగా గడిపారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆర్థిక, రాజకీయ ఆఫర్లను కూడా ఇచ్చి తాత్కాలికంగా గండం నుంచి గట్టెక్కారు. -
వికారాబాద్‌లో17వ వార్డు ఏకగ్రీవం
వికారాబాద్, న్యూస్‌లైన్: వేసవి ఎండలతో పాటు వికారాబాద్ మున్సిపల్ ఎన్నిక ల ఘట్టం రోజురోజుకూ వేడెక్కుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న రెబల్స్ మనసు మార్చుకొని పోటీ నుంచి వైదొలుగుతున్నారు. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పట్టణంలోని 17వ వార్డు జనరల్ మహిళ స్థానం నుంచి బరిలో దిగిన అభ్యర్థులంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి పల్లెగోని అనంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ కౌన్సిలర్ ఖాజా సతీమణి ఫైమిదా బేగంకు మంత్రి ప్రసాద్‌కుమార్ నచ్చచెప్పడంతో ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఎవరు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి అనంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అనంతమ్మకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జైత్రామ్ నాయక్ ధ్రుకరణ పత్రాన్ని అందచేశారు. పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీ నిర్వహించాయి. వికారాబాద్ మున్సిపల్లోని 28 వార్డుల్లో 17వ వార్డు ఏకగ్రీవంగా కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణంలోని ప్రధాన వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతమ్మ మాట్లాడుతూ... తన విజయానికి తోడ్పడిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇందిరానగర్, గరీబ్‌నగర్ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొండాల శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శేఖర్‌గౌడ్, బొండాల అశోక్, రాజు, నాగేష్, పాండు, లతీఫ్, రమేష్‌గౌడ్, ఖదీర్, అన్వర్, ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు. -
ఇక క్షేత్రంలోకి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని పురపాలక సమర క్షేత్రాల్లో అసలు సిసలు పోరు షురువైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం నాటికి ముగియడంతో ఇక ప్రత్యక్ష యుద్ధమే మిగిలింది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయడంతో అభ్యర్థులందరికీ తమ ప్రత్యర్థులెవరనే దానిపై పూర్తి స్పష్టత వచ్చింది. పార్టీ బీ-ఫారం సొంతం చేసుకున్న అభ్యర్థులు ఉత్సాహంగా ఎన్నికల బరిలోకి దూకగా, టికెట్ ఆశించి భంగపడిన పలువురు రెబల్‌గా రంగంలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులకే సవాలు విసుతున్నారు. టికెట్ రాక అలకబూనిన తమ నేతలను బుజ్జగించే పనిలో ఆయా పార్టీల అధిష్టానాలు బిజీగా ఉన్నాయి. అవకాశం రాలేదన్న అసంతృప్తితో ఉన్న నాయకులకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేస్తుండడంతో ఫిరాయింపులు జోరందుకున్నాయి. తుది పోరులో తమ ప్రత్యర్థులెవరనేది తేలిపోవడంతో అభ్యర్థులు విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులను చిత్తుచేసే ఎత్తుగడలలో భాగంగా అవతలి పార్టీలలో అసంతృంప్తులను ప్రోత్సహిస్తున్నారు. వారిని రెబల్స్‌గా బరిలో నిలిపి ఉంచి తమ విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల రెబల్ క్యాండెట్లకు భారీ నజరానాలు ఆశచూపుతున్నారు. టికెట్ రాక నిరాశకు గురైన వారి పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని పార్టీల్లో ఒకే కుటుంబంలో నలుగురైదుగురు టికెట్లు పొంది జాక్‌పాట్ కొట్టారు. మరి కొన్ని స్థానాల్లో ఒకే కుటుంబం ఇద్దరు, ముగ్గురు బీ-ఫారాలు పొంది బరిలో నిలిచారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల్లో టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడ్డవారు అధినేతలపై తిట్లదండకానికి దిగగా మరి కొందరు ఇండిపెండెంట్లుగా బరిలో దిగి పోరులో నిలిచారు. అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద అధికంగా ఉంది.