AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా | AP Panchayat Election 2021 Live Updates And Results | Sakshi
Sakshi News home page

AP Panchayat Election 2021:పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా

Published Sun, Nov 14 2021 3:02 AM | Last Updated on Sun, Nov 14 2021 9:58 PM

AP Panchayat Election 2021 Live Updates And Results - Sakshi

ఎన్నికల ఫలితాలు Live Updates:

► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. 

తూర్పు గోదావరి జిల్లా:
► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో  వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు

శ్రీకాకుళం జిల్లా:
రేగిడి ఆమదాలవలస  మండలం తోకల వలస పంచాయతీలో  వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు.

విజయనగరం జిల్లా:
► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి  బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం.
 లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.
► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత  44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు.

ప్రకాశం జిల్లా
► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం.
► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం.
 కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం.
► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం.
ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు.
► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం..
► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం

గుంటూరు జిల్లా:
► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు.
► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు.
► వినుకొండ మండలం శివపురం సర్పంచ్‌గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్‌సీపీ)
► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్‌సీపీ)

విశాఖ జిల్లా 
అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి  గెలుపు.
► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు.
► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు.
► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు

చిత్తూరు జిల్లా
గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్‌ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు.

కర్నూలు జిల్లా 
సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున  బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి.
 కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు.
సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ  ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు.
 కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు.

కృష్ణాజిల్లా

 కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ 
 సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు
 వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు
 కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు
 ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు
 నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు
 ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు

వార్డు ఎన్నికల ఫలితాలు
 తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు
 నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు
 ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం 
 కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు 
 ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం
 చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం
 పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం
 బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం
 కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి
10 ఓట్లతో గెలుపు 
 మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం
 ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా  టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం

నెల్లూరు జిల్లా
మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో  వైఎస్సార్‌సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో  విజయం.

అనంతపురం జిల్లా
సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం.
రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. 
శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో  ఘనవిజయం. 
► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. 
రాయదుర్గం  మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం.
సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో    వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. 
రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. 
పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం.

 పశ్చిమ గోదావరి జిల్లా
తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్‌సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్‌సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది.
పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. 
పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్  23 ఓట్ల   మెజార్టీతో గెలుపు.
కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. 
పెరవలి మండలం ‌మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం.
► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం  వైస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి  892ఓట్ల మెజారిటీతో పావని విజయం.
► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి  కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో  విజయం.
 ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి  దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు.

మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. 

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

కృష్ణా జిల్లా
జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలుకొండ (సర్పంచ్)74 శాతం
కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం
ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం
మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34
జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. 

చిత్తూరు జిల్లా
గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్‌ అయినట్లు ప్రకటించిన అధికారులు.

విశాఖపట్నం
విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్‌ నమోదు.

తూర్పు గోదావరి
పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్‌ అయ్యాయి.

పశ్చిమగోదావరి
- ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40%
- జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 %
- తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % 
- పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20%
- ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76%
- పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు.
- కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు

► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్‌లు, 68 వార్డులకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్‌ జరపనున్నారు. అనంతరం  ఫలితాలు ప్రకటించనున్నారు.

అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే
గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్‌ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.

సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్‌అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్‌ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్‌ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్‌ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్‌ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. 



కోవిడ్‌ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్‌ఈసీ  
స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెబ్‌ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement