
సాక్షి, అమరావతి: తుది విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగాల్సిన గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 13 జిల్లాల పరిధిలో 162 మండలాల్లోని 3,299 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులతో 34,112 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతాయి. బుధవారం ఉ.10.30 నుంచి 12వ తేదీ సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
మూడో విడత సర్పంచి బరిలో 17,664 మంది
మూడో విడతగా ఈనెల 17న ఎన్నికలు జరగనున్న 3,323 పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. సర్పంచి పదవులకు 17,664 మంది బరిలో ఉన్నారు. 31,516 వార్డు సభ్యుల పదవులకు 77,447 మంది పోటీలో ఉన్నారు.
2వ విడతలో 539 సర్పంచ్‌లు ఏకగ్రీవం
రెండో విడతగా ఈనెల 13న ఎన్నికలు జరిగే 3,328 గ్రామ పంచాయతీల పరిధిలో 539 సర్పంచి పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయా పంచాయతీల పరిధిలోని 33,570 వార్డు పదవుల్లో 12,605 వార్డు పదవులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment