
కృష్ణాజిల్లా: చంద్రబాబు తీరు చూస్తుంటే ఏడవలేక మద్దెల దరువు అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో 80% పంచాయితీలు వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలవడంతో చంద్రబాబు అయిపోయిందని తెలిపారు. కుప్పం నియోజకవర్గవాసులు ఎప్పుడూ టీడీపీనే గెలిపించేవారని, కానీ చంద్రబాబును కదాని వివరణ ఇచ్చారు.
కృష్ణాజిల్లాలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మాటలతూటాలు విసిరారు. తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయినట్టేనని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. గెలిస్తే తన గొప్పతనం అని చెప్పుకునే చంద్రబాబు ఓడిపోయాడు కనక దొంగే దొంగ అని అరిసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గెలిచిన పంచాయితీలు పుచ్చలపల్లి సుందరయ్య మార్గంలో ఏమైనా గెలిచారా అని ప్రశ్నించారు. ఎదుటివారు గెలిస్తే డబ్బు ఖర్చు చేసి గెలిచారు అంటున్నారు.. అసలు డబ్బు రాజకీయం మొదలు పెట్టిందే చంద్రబాబేనని చెప్పారు. ఆ సంస్కృతిని కృష్ణ జిల్లా ఉయ్యూరులో మొదలుపెట్టింది చంద్రబాబేనని వంశీ తెలిపారు.
40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకొంటూ ప్రజలు నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా వంకలు చెప్పటం నేర్చుకున్నాడని వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. ఓటు వేసినందుకు జనాలని దొంగలు అనటం సరి కాదు చేతనైతే టీడీపీ పార్టీని మెరుగుపరచుకో అని సలహా ఇచ్చారు. కొంగల మల్లయ్య కథలు.. నేను లెగిస్తే మగోడిని కాదు అని లెగలేనోడు చెప్పే కథలు చెప్పొద్దు అని వల్లభనేని వంశీ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment