![Vamshi Wife Pankaja Sri Key Comments Over Arrest](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Vamshi-Wife-Pankaja-Sri.jpg.webp?itok=Jm80fyFg)
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు ఆయన భార్య పంకజశ్రీ. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. వంశీకి ఆరోగ్యం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం రాత్రి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య పంకజశ్రీ స్పందించారు.
ఈ క్రమంలో పంకజశ్రీ మాట్లాడుతూ..‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకి కచ్చితంగా వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం అని కామెంట్స్ చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_455.jpg)
ఎఫ్‌ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు..
నా భర్తపై నమోదుచేసిన కేసు ఎఫ్‌ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు. ఎందుకు అరెస్టుచేశారో చెప్పడంలేదు. రిమాండుకు తీసుకెళ్లినప్పుడు ఇస్తామంటున్నారు. ఎఫ్‌ఐఆర్ లేకపోతే లీగల్‌గా వెళ్లడానికి అవకాశం ఉండకూడదని ఇలా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మా ఇంటికొచ్చి అరెస్టుచేశారు. నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టుచేస్తున్నారని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పేపర్‌పై రాసిచ్చారు. అక్రమ కేసులో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలంగాణ సరిహద్దుల వద్దే ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్మోహనరావు సహాయంతో ఇక్కడకు చేరుకున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/4_21.jpg)
Comments
Please login to add a commentAdd a comment