
అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న తమ్మినేని వాణిశ్రీ
ఆమదాలవలస రూరల్: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని తొగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం తనయుడు తమ్మినేని చిరంజీవినాగ్, మద్దతుదారులతో కలసి వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమెతో పాటు 10 మంది వార్డు మెంబర్లు సైతం నామినేషన్‌లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment