సాక్షి, అమరావతి : నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ప్రస్తుతం 2,743 పంచాయతీలు, 22,423 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 417 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 61, ఇతరులు 75 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి..
పార్టీ మద్దతుదారుల వారీగా విజయాలు
జిల్లా |
వైఎస్సార్‌సీపీ | టీడీపీ | బీజేపీ | ఇతరులు |
శ్రీకాకుళం | 149 | 24 | 2 | 5 |
విజయనగరం | 202 | 32 | 2 | 1 |
విశాఖ | 68 | 18 | 1 | 1 |
తూర్పు గోదావరి | 96 | 29 | 21 | 28 |
పశ్చిమ గోదావరి | 152 | 41 | 5 | 4 |
కృష్ణా | 162 | 39 | 1 | 5 |
గుంటూరు | 153 | 59 | 5 | 4 |
ప్రకాశం | 164 | 26 | 0 | 6 |
నెల్లూరు | 158 | 14 | 2 | 1 |
చిత్తూరు | 324 | 44 | 0 | 8 |
కర్నూలు | 271 | 49 | 0 | 11 |
అనంతపురం | 139 | 24 | 0 | 2 |
వైఎస్సార్ జిల్లా | 203 | 0 | 19 | 2 |
Comments
Please login to add a commentAdd a comment