కొండలు, గుట్టలు దాటి.. 8 కిలోమీటర్లు నడిచి.. | Voters in Girishikhara villages participated in the polling | Sakshi
Sakshi News home page

కొండలు, గుట్టలు దాటి.. 8 కిలోమీటర్లు నడిచి..

Published Sun, Feb 14 2021 4:45 AM | Last Updated on Sun, Feb 14 2021 8:02 AM

Voters in Girishikhara villages participated in the polling - Sakshi

కొండలు గుట్టలపై 8 కిలోమీటర్లు నడిచి వస్తున్న గిరిజనులు

సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మావోయిస్టు ప్రభావిత గ్రామంగా గుర్తించిన సాలూరు మండలం ఒడిశా సరిహద్దు సంపంగిపాడు పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో గిరిశిఖర గ్రామాల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పంచాయతీలోని దిగువరూడ, కాగరూడ, గాడివలస, కొంకమామిడి, గాలిపాడు గిరిశిఖర గ్రామాల ప్రజలు కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ సుమారు 8 కిలోమీటర్లు నడిచి దళాయివలసలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఎంతో శ్రమపడి ఓటుహక్కు వినియోగించుకున్న గిరిశిఖర గ్రామాల వారు ఆదర్శంగా నిలిచారు. ఈ పోలింగ్‌ కేంద్రంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు 485 ఓట్లకుగాను 297 (61 శాతం) పోలయ్యాయి. సంపంగిపాడు గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. వైఎస్సార్‌సీపీ అభిమాని బుడియా చంద్రయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement