అలంపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ప్రతి సారి ఓటర్లు పెరుగుతున్నారు. అందుకు అనువుగా పోలింగ్ శాతం పెరుగుతోంది. పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం జోరు ప్రచారాలతో ఓటర్లలలో అవగాహన కల్పిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యంతో ముందుకు వస్తున్నారు. కానీ పోలింగ్ మాత్రం వంద శాతానికి దూరంగా ఉంటుంది.
దీంతో గెలుపోటములపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశం ఉంటుంది. 2009 సార్వత్రిక ఎన్నికల 1,88,678 మంది ఓటర్లు ఉండగా 1,29282 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,10,047 మంది ఓటర్లు ఉండగా 1,58,069 మంది ఓటు హక్కు వినియోగించకోవడం జరిగింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,17, 157 మంది ఓటర్లు ఉండగా 1,79,683 మంది, 2023 ఎన్నికల్లో 2,37,938 మంది ఓటర్లు ఉండగా 1,96,307 మంది తమ ఓటు హక్కును వి నియోగించుకున్నారు. ఇదిలాఉండగా, 2009లో 59,396 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
అలాగే, 2014లో 51,978 మంది, 2018లో 37,474 మంది, 2023 ఎన్నికల్లో 41,631 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రతి సారి జరిగే ఎన్నికల్లో దాదాపు 15 నుంచి 20 శా తం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘం ప్రచారం మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది.
ఇది చదవండి: జిల్లాలో 06 నియోజక వర్గాలు.. తొలి ఫలితం మిర్యాలగూడదే!
Comments
Please login to add a commentAdd a comment