అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కోక్కటిగా వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,477 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 500 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 14, ఇతరులు 38 చోట్ల గెలుపొందారు. రెండో విడతలో మొత్తంగా 3,328 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా..
జిల్లా | పార్టీ మద్దతుదారులు | |||
వైఎస్సార్‌సీపీ | టీడీపీ | బీజేపీ | ఇతరులు | |
శ్రీకాకుళం | 243 | 28 | 0 | 1 |
విజయనగరం | 284 | 63 | 1 | 12 |
విశాఖ | 189 | 58 | 1 | 2 |
తూర్పు గోదావరి | 153 | 24 | 7 | 2 |
పశ్చిమ గోదావరి | 128 | 23 | 3 | 2 |
కృష్ణా | 144 | 35 | 1 | 4 |
గుంటూరు | 177 | 42 | 0 | 3 |
ప్రకాశం | 228 | 36 | 0 | 0 |
నెల్లూరు | 166 | 22 | 0 | 2 |
చిత్తూరు | 232 | 38 | 1 | 4 |
కర్నూలు | 184 | 40 | 0 | 3 |
అనంతపురం | 226 | 51 | 0 | 0 |
వైఎస్సార్ జిల్లా | 150 | 19 | 0 | 3 |
Comments
Please login to add a commentAdd a comment