AP Panchayat Elections 2021: First Phase Of Polling Live Updates - Sakshi
Sakshi News home page

తొలి దశ పంచాయతీ ఎన్నికలు: ముగిసిన కౌంటింగ్‌

Published Tue, Feb 9 2021 6:33 AM | Last Updated on Wed, Feb 10 2021 2:04 PM

AP Panchayat Election 2021: Live Updates - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,723 పంచాయతీల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచ్‌లను ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్‌ ఎన్నిక పూర్తి కాని చోట మరుసటి రోజున ఆ ప్రక్రియ ఉటుంది. కాగా తొలి దశలో ఇప్పటివరకు 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా .. ఇందులో వైఎస్సార్‌‌సీపీ నుంచి 518, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది.

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్‌, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. 


అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకెళ్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హరిప్రసాద్.
సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్ ద్వారా గిరిజా శంకర్‌‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.

పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌:
బ్యాలెట్ బాక్స్‌లో నీళ్లు పోసిన సర్పంచ్ అభ్యర్థి 
చిత్తూరు: ఎస్ఆర్‌పురం మండలం కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్యాలెట్ బాక్స్‌లో టీడీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్ధి రమేష్‌ నీళ్లు పోయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో  పోలింగ్‌ నిలిచిపోయింది.

మధ్యాహ్నం 12:30 వరకు 62 శాతం పోలింగ్ నమోదు
శ్రీకాకుళం జిల్లా-54.5 శాతం
విశాఖ జిల్లా-65 శాతం
తూర్పుగోదావరి -62.14 శాతం
పశ్చిమ గోదావరి-54.09 శాతం
కృష్ణా జిల్లా-67 శాతం
గుంటూరు జిల్లా-62 శాతం
ప్రకాశం జిల్లా-57 శాతం
నెల్లూరు జిల్లా-61 శాతం
చిత్తూరు జిల్లా 66.3 శాతం
వైఎస్ఆర్ జిల్లా 61.19 శాతం
కర్నూలు జిల్లా 70.06 శాతం
అనంతపురం జిల్లా 63 శాతం

మందకొడిగా పోలింగ్‌..
ఉదయం 10:30 వరకు జిల్లాల వారీగా పోలింగ్‌ వివరాలు
తూర్పుగోదావరి-29 శాతం
పశ్చిమగోదావరి-24 శాతం
కృష్ణా జిల్లా-36 శాతం
గుంటూరు జిల్లా-30 శాతం
వైఎస్సాఆర్ జిల్లా- 29.21 శాతం
అనంతపురం-27 శాతం
ప్రకాశం జిల్లా- 28.65 శాతం
నెల్లూరు జిల్లా-  26.72 శాతం
చిత్తూరు జిల్లా-36.38 శాతం
కర్నూలు జిల్లా-49 శాతం
విశాఖ జిల్లా 40.78 శాతం
శ్రీకాకుళం జిల్లా- 29.15 శాతం

గుండెపోటుతో పోలింగ్‌ ఏజెంట్‌ మృతి
గుంటూరు జిల్లా: కాకుమాను మండలం గరికపాడులో గుండెనొప్పితో ఏజెంట్ నూర్‌ బాషా  మృతి చెందాడు. గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. 

సిబ్బంది ఓవరాక్షన్
చిత్తూరు జిల్లా: రామచంద్రాపురం మండలంలో పోలింగ్ సిబ్బంది ఓవరాక్షన్ చేశారు.‌ కమ్మకండ్రిగలో వృద్ధులు చెప్పిన దానికి భిన్నంగా  సిబ్బంది ఓటు వేశారు గుర్తించిన ఏజెంట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ రాజశేఖర్‌రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

మహిళలకు ముక్కుపుడకలు: పట్టుబడిన టీడీపీ నేతలు..
వైఎస్సార్‌ జిల్లా: దువ్వూరు మండలంలో ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఉదయం 8:30 వరకు 18 శాతం పోలింగ్ నమోదు
శ్రీకాకుళం జిల్లాలో 8.5 శాతం పోలింగ్‌ నమోదు
విశాఖ జిల్లాలో 17 శాతం పోలింగ్ నమోదు
తూ.గో.జిల్లాలో 8.42 శాతం పోలింగ్ నమోదు
ప.గో.జిల్లాలో 11 శాతం పోలింగ్ నమోదు
కృష్ణా జిల్లాలో 9 శాతం పోలింగ్ నమోదు
గుంటూరు జిల్లాలో 15 శాతం పోలింగ్ నమోదు
ప్రకాశం జిల్లాలో 11 శాతం పోలింగ్ నమోదు
నెల్లూరు జిల్లాలో 14 శాతం పోలింగ్ నమోదు
చిత్తూరు జిల్లాలో 15.51 శాతం పోలింగ్ నమోదు
వైఎస్సార్‌ జిల్లాలో 6.62 శాతం పోలింగ్ నమోదు
కర్నూలు జిల్లాలో 10 శాతం పోలింగ్ నమోదు
అనంతపురం జిల్లాలో 7.25 శాతం పోలింగ్ నమోదు

శ్రీకాకుళం: నిమ్మాడలో 23 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. నిమ్మాడలో పోలింగ్‌ను ఎన్నికల పరిశీలకులు శ్రీధర్‌ పరిశీలించారు.

తూర్పుగోదావరి:  మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

టీడీపీ ప్రలోభాలు..
ప్రకాశం: ఇంకొల్లు మండలం సూదివారిపాలెంలో టీడీపీ ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ నేతలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు: వరికుంటపాడులో ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

పశ్చిమ గోదావరి: పంచాయతీ ఎన్నికల్లో  ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ సానుభూతి పరుడు, సర్పంచ్ అభ్యర్థి జుత్తిక  శ్రీనివాస్ పోలీసులకు పట్టుబడ్డారు.



ఓటు హక్కు వినియోగించుకున్న మాడుగుల ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు
తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి, 20160 వార్డులకు పోలింగ్ జరగనుంది.  పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్‌ను కేటాయించారు. సా.4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది.  చదవండి: నేడే తొలి సం'గ్రామం'

12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ..
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట

► శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
► ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం..
► కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

 విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్
► అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు..
► కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి..
►బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

తూర్పు గోదావరి:
►కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు..
► యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు..
► పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం.. 
►తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్


పశ్చిమ గోదావరి:
►నర్సాపురం డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు..
►నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు..
►ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కృష్ణా:
విజయవాడ రెవిన్యూ డివిజన్‌లో తొలి దశ ఎన్నికలు
చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల..
కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు..
వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

గుంటూరు:
తెనాలి డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల..
కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం..
పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు

ప్రకాశం:
ఒంగోలు డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు..
జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు..
ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం..
టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు

నెల్లూరు:
కావలి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి..
కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికలు
ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ..
గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది..
ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

అనంతపురం:
కదిరి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట..
నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి..
తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

వైఎస్ఆర్ జిల్లా:
కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు
చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు..
అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె.ఎన్..
కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

చిత్తూరు
 రెవిన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం..
నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు..
పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట..
వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్

చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు
342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్
సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement