
డైనమిక్ లీడర్లనే ఎన్నుకోండి: స్నేహ
ప్రజాస్వామ్యంలో మనిషికి ఓటే ఏకైక ఆయుధం.. ఐదేళ్లకోసారి పాలకుల తలరాత మార్చే ఆయుధం ఓటు.. అటువంటి పవిత్రమైన, ఎంతో విలువైన ఓటును డబ్బులు తీసుకుని వేయొద్దు.. ప్రలోభాలకు ఓటును అమ్ముకోవద్దు... అలా చేస్తే దేశాన్ని మోసం చేసినట్టు.. ఓరకంగా దేశాన్ని అమ్మేసినట్టు..
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.. అది దేశ పౌరులుగా మన కనీస బాధ్యత.. మన చుట్టూ ఉన్న సమాజానికి ఎవరైతే మేలు చేయగలరో ఒకటికి పదిసార్లు ఆలోచించి అలాంటి వారికే ఓటేయండి.. డైనమిక్ లీడర్లు అని మీరు ఎవరని భావిస్తారో అలాంటి నేతలకే ఓటేయండి...