మహిళల భద్రతే కీలకాంశం
ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పన.. మహిళల భద్రత, మహిళా సాధికారత.. ఆర్థికాభివృద్ధి, మెరుగైన ఆర్థిక విధానాలు.. మత సామరస్యం, నేరాల కట్టడి.. ఇవీ నవ యువ ఓటర్లు కొత్త ప్రభుత్వం నుంచి కోరుకుంటున్న ముఖ్యమైన హామీలు. ముఖ్యంగా మహిళల భద్రతను ఢిల్లీ యువతులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
తమ ఆశలు, ఆశయాలను నెరవేర్చే అభ్యర్థులను, పార్టీలను గుర్తించి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేశామంటున్నారు ఓటుహక్కును మొదటిసారి వినియోగించుకున్న యువ ఓటర్లు. ‘నేరాలు పెరిగిపోతున్నాయని, అవినీతి అని, తాగునీరు లేదని.. ఇలా రకరకాల సమస్యలపై ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఓటేసేందుకు ముందుకు రారు. మార్పు కోరుకునే వారు కచ్చితంగా తమ ఓటును అందుకు ఆయుధంగా ఉపయోగించుకోవాలి’ అని ఢిల్లీ వర్సిటీకి చెందిన కార్తీక్ చెప్పారు. ‘మహిళల భద్రత చాలా ముఖ్యమైన అంశం. కానీ ఏ పార్టీ ఢిల్లీని సేఫ్ సిటీగా చేస్తుందనుకోను’ అని 23 ఏళ్ల సురభి రంజన్ అన్నారు.