
నేతలను నడిపించే నీడలు
శత్రు సైన్యంపై దండెత్తేందుకు వెళ్లే యోధుల్లో ముందుండేది సేనాని. సారథిగా ముందున్నా.. ఆయన వెనుక ఎందరో వ్యూహకర్తలు.. మరెందరో యుద్ధ తాంత్రికులు! పొరుగు సైన్యం ఎత్తుల్ని చిత్తు చేస్తూ ముందుకు సాగేందుకు కావాల్సిన ఎత్తుగడల వ్యూహాన్ని తెరవెనుక రచించేది వారే.
శత్రు సైన్యంపై దండెత్తేందుకు వెళ్లే యోధుల్లో ముందుండేది సేనాని. సారథిగా ముందున్నా.. ఆయన వెనుక ఎందరో వ్యూహకర్తలు.. మరెందరో యుద్ధ తాంత్రికులు! పొరుగు సైన్యం ఎత్తుల్ని చిత్తు చేస్తూ ముందుకు సాగేందుకు కావాల్సిన ఎత్తుగడల వ్యూహాన్ని తెరవెనుక రచించేది వారే. అస్త్రశస్త్రాలు ఎన్ని ఉన్నా వాటిని ఎప్పుడు, ఎలా, ఎవరిపై ప్రయోగించాలో సేనానికి చెప్పే ఆంతరంగికులు వారు! మరి ఈ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ సారథి రాహుల్‌గాంధీ, బీజేపీ సేనాని నరేంద్ర మోడీ వెనుక ఉన్న వ్యూహకర్తలు, నమ్మిన బంట్లు ఎవరు..? వీరిద్దరి వెనుక ఉన్న అదృశ్య శక్తులను ఓసారి చూద్దాం..
ఎలక్షన్ సెల్
సలహాదారులు
రాజేష్ జైన్, (53)
పనిచేసే స్థానం: ముంబై
పారిశ్రామికవేత్త. ఇండియా ఇన్ఫోలైన్, నీతి సెంట్రల్ వ్యవస్థాపకుడు. దేశంలో ఓటర్ల వివరాలతో సమగ్రమైన డేటాబేస్‌ను ఒకచోట చేర్చడంలో సహాయపడుతున్నారు.
పీయూష్ గోయల్, (55)
పనిచేసే స్థానం: ముంబై
మోడీకి సన్నిహితుడు. విధాన రూపకల్పన, సామాజిక మీడియా, వ్యూహరచన వంటి అంశా ల్లో ఈయనది కీలకపాత్ర.
వికాస్ సాంకృత్యాయన్, (32)
పనిచేసే స్థానం: ఢిల్లీ
మోడీ సోషల్ మీడియా బృందానికి కొన్ని స్వతంత్ర బృందాలు మద్దతు అందిస్తున్నాయి.సాంకృత్యాయన్ నడిపే ‘ఐ సపోర్ట్ నమో’ పేజీ ఇందులో భాగమే.
బిపిన్ చౌహాన్
మోడీ జనంలోకి వెళ్తే ఎలా ఉండాలి..? ఎలా కనిపించాలి...? ఎలాంటి డ్రెస్సు వేసుకోవాలి..? ఈ వ్యవహారాలన్నీ ఈయనే చూస్తారు.
ప్రచారకర్తలు
జగదీశ్ ఠక్కర్ (69)
సంజయ్ భావ్సార్ (49)
పనిచేసేస్థానం: గాంధీనగర్
మోడీ కార్యక్రమాలు ప్రభావశీలంగా ఉండేందుకు వీరి బృందం సాయపడుతుంది. మోడీ సమావేశాలు, అపాయింట్‌మెంట్ల నిర్వహణ చూస్తుంది. మోడీ మీడియానూ, ప్రజలను కలిసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మిగిలిన బృందాలను,
నాయకులను సమన్వయపరుస్తారు.
ఐటీ బృందం
అరవింద్ గుప్తా (43)
బీజేపీ ఐటీ సెల్ అధిపతి
పనిచేసేస్థానం: ఢిల్లీ, ఈ సెల్ మోడీ సామాజిక మీడియా బాధ్యతలను చూస్తోంది. ఈ విభాగంలో స్వచ్ఛంద కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఉన్నారు.
సామాజిక మీడియా బృందం
హీరేన్ జోషీ (43)
పనిచేసేస్థానం: గాంధీనగర్
గుజరాత్ సీఎం ఆఫీసులోని ఐటీ నిపుణుల్లో ఈయన ఒకరు. సోషల్ మీడియాలో ఇండియా 272 ప్లస్ ప్రచారంతోపాటు మోడీ ఫేస్‌బుక్ పేజీని నిర్వహిస్తున్నారు.
జైరాం రమేశ్ (59)
రాహుల్‌గాంధీకి ప్రధాన సలహాదారు. దిగ్విజయ్‌సింగ్‌ను సైతం వెనక్కినెట్టి ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నికల ప్రధాన వ్యూహకర్త.
అశోక్ తన్వర్ (37)
రాహుల్ బృందంలో దళితుల ప్రతినిధి. హర్యానా రాష్ట్ర పార్టీ విభాగానికి సారథి.
కనిష్క సింగ్ (35)
రాహుల్ సొంత మనిషి. ఢిల్లీలోని 12-తుగ్లక్ లేన్ నివాసం నుంచి రాహుల్ కార్యాలయ నిర్వహణ పనులను పర్యవేక్షిస్తారు.
సచిన్ రావు (42)
విధాన నిర్ణయాల సమన్వయకర్త. ప్రత్యేకించి సామాజిక, సంక్షేమ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. రాహుల్ కార్యాలయం, ప్రజా సంఘాల సమన్వయం ఈయన పని.
జితేందర్ సింగ్ (42)
యూపీ ఇన్‌చార్జి. రాహుల్‌తో కలిసి
సన్నిహితంగా పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య పంథాకు మార్గదర్శి.
మాణిక్ ఠాగూర్ (38)
అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జి. రాహుల్ ఆఫీసులో
కీలక వ్యక్తి. 2009 ఎన్నికల్లో ఎండీఎంకే అధినేత వై.గోపాలస్వామిని ఓడించారు.
మీనాక్షి నటరాజన్ (40)
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా ఇన్‌చార్జి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ సిటింగ్ ఎంపీ. ఎన్‌ఎస్‌యూఐ సెక్రటరీ ఇన్‌చార్జి. రాహుల్‌కు నమ్మిన బంటు.
శుభంకర్ సర్కార్ (53)
కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు వ్యవహారాల ఇన్‌చార్జి. ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ ఎన్‌ఎస్‌యూఐ దళపతి.
పరేశ్ ధనానీ (37)
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి. గుజ రాత్ మాజీ ఎమ్మెల్యే. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
కులజీత్ నాగ్రా (48)
రాజస్థాన్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్, గుజరాత్ వ్యవహారాల ఇన్‌చార్జి. రాహుల్ ఎంపిక చేసుకున్న 20 మంది యువతరం సెక్రెటరీల్లో ఒకరు.
భక్తచరణ్ దాస్ (55)
గోవా, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి. గిరిజన హక్కుల యోధుడు. పార్టీ అధికార ప్రతినిధి.
హరీశ్ చౌధరీ (43)
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ వ్యవహారాల ఇన్‌చార్జి. రాజస్థాన్‌లోని బార్మేర్ ఎంపీ. రాహుల్ బృందంలో కొత్త ముఖం. 2012లో యూపీ ఎన్నికల పోరాటంలో దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి పనిచేశారు.
రాజీవ్ సాతవ్ (39)
మహారాష్ట్ర కాంగ్రెస్ యువనేత. యువజన కాంగ్రెస్ సంస్కరణల భారం నెత్తిన వేసుకున్నారు.
మధుసూదన్ మిస్త్రీ (69)
ఒకప్పుడు ట్రేడ్ యూనియన్
కార్యకలాపాలు చూశారు. నిన్నమొన్నటి వరకు ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు చూశారు.
దీపేందర్ హుడా (36)
ఈయన హర్యానా సీఎం భూపీందర్ హుడా కుమారుడు. రాహుల్‌కు సామాజిక మీడియాలో ప్రచారం కల్పించే బాధ్యతను చూస్తుంటారు.