'రాహుల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు'
న్యూఢిల్లీ: దేశంలొ ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేయాలనే విమర్శలు వినిపిస్తున్నా.. ఆ పార్టీ నేతలు మాత్రం రాహుల్ ను వెనుకేసుకొస్తున్నారు. అసలు రాహుల్ రాజీనామా ఎందుకు చేయాలని కూడా పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ కు అండగా నిలిచిన వారిలో పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ కూడా చేరిపోయారు. ఈ రోజు ఓ జాతీయ టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటూర్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
' రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నది కేవలం ఎనిమిది నెలలే. దానికి పూర్తి బాధ్యత రాహుల్ నే చేయడం తగదు. ప్రభుత్వం సాధించిన విజయాలకు, పనితీరుకు ఆయనపై విమర్శలకు దిగడం ఎంతవరకు సబబు. ఇది ఏమి మతలబు అంటూ' ప్రశ్నించారు. పార్టీ ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పగించింది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్న అది పార్టీనే నిర్ణయిస్తుందని కమల్ నాథ్ పేర్కొన్నారు. రాహుల్ ను తొలగించే నిర్ణయాన్ని తమ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని తాను భావించడంలేదన్నారు.