
యువ సత్తా చాటిన జగన్
వర్తమాన రాజకీయాల్లో యువ సత్తా చాటిన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి చిన్న వయస్సులో సొంతంగా పార్టీ పెట్టి బలమైన శక్తిగా ఎదగడం రాజకీయాల్లో యువశక్తి ఏమి టో చాటింది. రాజకీయాల్లో యువత క్రియాశీలకమైతే ఎలా ఉంటుందనేందుకు ఇదే నిదర్శనం.
క్రికెట్, ఇతర వ్యాపకాలపై గంటల సమయం గడిపే యువత మన జీవితాలను ప్రభావితం చేసే పాలిటిక్స్‌పై దృష్టిసారించాలి. ఇందుకు తొలి అడుగు ఎన్నికల్లో ఓటు చేయడమే. ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకుని సమర్థులైన పాలకులనే ఎన్నుకోవాలి...
-ఇషా (‘అంతకుముందు ఆ తర్వాత’ ఫేం)