
రైతు నోట బాబు కొట్టిన మట్టి
చుకుంటే ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు ప్రయత్నాలను ఆపేందుకు గట్టిగా ప్రయత్నించగలిగే స్థాయిలో ఉండి కూడా కళ్లు మూసుకున్నారంటూ బీజేపీ దుమ్మెత్తిపోసింది. ‘‘ఆలమట్టి... ఆంధ్రుల నోట మట్టి’’ అంటూ 1996 ఆగస్టులో ప్రచురించిన పుస్తకంలో ఆయన్ను ఎలా ఏకిపారేసిందో చూడండి...
‘‘నీటిపారుదల ప్రాజెక్టులంటే బాబుకు గిట్టేది కాదు. అందుకే, తాను మద్దతిస్తున్న ప్రధాని దేవెగౌడే అడ్డగోలుగా ఆలమట్టి ఎత్తు పెంచినా కిమ్మనలేదు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు, 119 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నిల్వ చేసుకునేందుకు కర్ణాటకకు కేంద్రం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదంటూ కేంద్ర జలవనరుల మంత్రి జ్ఞానేశ్వర్ మిశ్రా 1996 జూలై 11న బాబుకు లేఖ రాశారు. కానీ అంతకు వారం ముందే, అంటే జూలై 4వ తేదీనే ఆలమట్టి ఎత్తు పెంపుకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది! అది కూడా... జూలై 3న ప్రధాని దేవెగౌడకు బాబు లేఖ రాసిన మర్నాడు! పైగా ఆ మర్నాడు, అంటే జూలై 5న బాబు స్వయంగా దేవెగౌడను కలిశారు. అయినా, అలమట్టి ఎత్తు పెంపునకు ముం దు రోజే అనుమతించినట్టు బాబుకు ఆయన మాట మాత్రంగానైనా చెప్పలేదు. ఇందుకు నిరసనగా కేంద్రానికి బాబు మద్దతు ఉపసంహరించాల్సింది. కానీ ఆయన అలా చేయలేదు. చివరికి ఆగస్టు 2న పత్రికల్లో వచ్చే దాకా, ఆలమట్టి ఎత్తు పెంపునకు అనుమతి గురించి ఎవరికీ తెలియదు. ప్రధానులుగా ఎవరుండాలో తానే నిర్ణయించానని చెప్పుకునే చంద్రబాబు, ఆ పలుకుబడితో రాష్ట్రానికి ఒనగూర్చిన ప్రయోజనం... ఇదీ. ఒకరకంగా ఢిల్లీలో బాబు కరివేపాకే’’.
ుుఖ్యమంత్రిగా చంద్రబాబు రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘రెండేళ్ల చంద్రజాలం’ పేరుతో 1997 సెప్టెంబర్‌లో బీజేపీ మరో పుస్తకం వేసింది. అందులో ఏమందంటే...‘‘చంద్రబాబు సొంతమామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదోవన గద్దెనెక్కి పెత్తనం చెలాయించడం మొదలుపెట్టిన నాటి నుంచీ ప్రభుత్వం వ్యాపారమైపోయింది. ఎన్టీఆర్‌కు ప్రజా సంక్షేమ దృష్టి ఒకటుండేది. బాబుకు మాత్రం లాభనష్టాల లావాదేవీలే తప్ప జనసంక్షేమం పట్టదు. కొత్త సంక్షేమ చర్యలు దేవుడెరుగు. ఎన్నికల వాగ్దానాలకే దిక్కు లేదు’’
పథకాలన్నీ అటకెక్కించిన ఘనుడు
‘‘రెండు రూపాయల కిలో బియ్యం పథకం తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం కదా! 1992లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ పథకాన్ని నీరుగారిస్తే ఇదే బాబు ప్రతిపక్షంలో ఉండి మన్నూ మిన్నూ ఏకం చేశారే! కానీ తాను అధికారంలోకి రాగానే మొహమాటం లేకుండా తక్షణం కిలో బియ్యాన్ని రూ.3.5కు పెంచేయడం నమ్మకద్రోహం కాదా? శ్వేతపత్రాలు పట్టుకు ఊరూరా తిరిగి మరీ మద్యనిషేధాన్నీ ఎత్తేశారు’’
నిషేధాన్ని బూచిగా చూపి చార్జీలు పెంచాడు
‘‘విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల మీద బాబు ఏకంగా రూ.1,492 కోట్ల భారం మోపారు. సబ్సిడీ బియ్యం ధర పెంపుతో అదనంగా రూ.611 కోట్లు, టర్నోవర్ టాక్స్‌తో రూ.220 కోట్లు, రూ.60 కోట్ల వృత్తి పన్ను, మరో రూ.50 కోట్ల ఎంట్రీ టాక్స్, రూ.25 కోట్ల లగ్జరీ టాక్స్, రూ.200 కోట్ల వాటర్ సెస్.. ఇలా అక్షరాలా రూ.2,658 కోట్లు గుంజారు. అది కూడా.. మద్యనిషేధం వల్ల ఆదాయం తగ్గిందన్న సాకుతో! (తర్వాత నిషేధాన్ని ఎత్తేసి కూడా, పెంచిన ఈ పన్నులను యథాతథంగా ఉంచారు).