నోరారా తిట్టుకున్నారు...
ఈ ఎన్నికల స్పెషల్
మోడీని ఏమైనా అంటే కేసీఆర్ తాట తీస్తా.... పవన్‌కల్యాణ్
వాడెవడు? నేను చిటికేస్తే వేయి తుకడలైతడు... కేసీఆర్
కేసీఆర్ ద్రోహి, నమ్మించి మోసం చేయడం అలవాటు... సోనియా
రాక్షసుడు, మోసకారి, అబద్ధాలకోరు, సైకిల్‌తో తొక్కేస్తా... చంద్రబాబు
దొంగ పాస్‌పోర్టులు, మనుషుల అక్రమ రవాణా... పొన్నాల
తెలంగాణలో మైకులు మూగబోయాయి. కానీ ఈసారి పార్టీల ప్రచార సరళిని పరిశీలిస్తే.. వివిధ పార్టీల నాయకుల నడుమ మునుపెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత వివుర్శల దాడి జోరుగా జరిగింది. కాలంతోపాటు రాజకీయ ప్రచారాల్లో ప్రమాణాల పతనం కనిపిస్తున్నా.. గడువు సవుయుం దగ్గరపడేకొద్దీ ఎన్నికల వేడి పెరుగుతూ తిట్ల పురాణానికి తెరలేచింది. వ్యక్తిగత వివుర్శలు, ప్రతి వివుర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, బెదిరింపులు, ఎదురుదాడి యథేచ్ఛగా సాగిన తీరు మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది.
ఎన్నికలనగానే పార్టీలు, నాయకుల మధ్య వాగ్వివాదాలు, ఆరోపణలు పరిపాటే. కానీ పార్టీల సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, గత ప్రభుత్వాల పనితీరు, కొత్త హామీల గురించి ఉద్రిక్త వాతావరణం ఉందా అనే స్థారుులో వేడెక్కించే విమర్శలు కూడా సాధారణమే. కానీ, ఈసారి తెలంగాణ ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నడుమ నెలకొన్న పోటాపోటీ వాతావరణం, ఎంత ప్రయత్నించినా తన ఉనికి ప్రదర్శించలేకపోతున్న టీడీపీ ఉడుకుమోత్తనం, బీజేపీ కోసం పరిణతి లేని పవన్‌కల్యాణ్ రంగప్రవేశం కారణంగా ఈ పార్టీల నడు మ విమర్శలు కొన్ని ‘లక్ష్మణరేఖలు’ దాటేశారుు. వాస్తవానికి ముప్పేట దాడికీ, అన్ని వైపుల నుం చీ ఈ నిందారోపణలకు గురై న నాయకుడు కేసీఆర్ కాగా, వాచాలతను తీవ్ర స్థాయిలో ప్రదర్శించి, పరిస్థితిని మరింత దిగజార్చింది మాత్రం పవన్‌కల్యాణేనని చెప్పవచ్చు.
పోటీ పెరిగే కొద్దీ వూటల సవురం
పోటీ ఏకపక్షంగా లేదు. విలీనమనే మాట వదిలేసి ఒంటరిపోరుకు సిద్ధపడిన వెంటనే కేసీఆర్ కాంగ్రెస్ నాయకులకు లక్ష్యంగా మారారు. సుడిగాలిలా ఆయన తెలంగాణ అంతటా విసృ్తతంగా పర్యటిస్తూ ప్రచారంలో ముందుండేసరికి, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం విజయం కోసం చెమటోచ్చాల్సిన దుస్థితి నెలకొంది. దాంతో ఇక ఆ పార్టీ నేతలు కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శల దాడి మొదలెట్టారు. కేసీఆర్ కూడా మాటకుమాట అన్నట్లుగా ఎదురుదాడి ఆరంభించారు. ఇటు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అటు కేసీఆర్ రోజూ తమ విమర్శల తీవ్రతను పెంచుతూ వెళ్లారు. క్షేత్ర స్థాయిలో టీఆర్‌ఎస్ మరింత బలపడుతున్న తీరు గమనించిన కాంగ్రెస్ నాయకులు చివరకు సోనియా, రాహుల్ ద్వారా కేసీఆర్‌పై వాగ్బాణాలు సంధించేలా చేరుుంచడంలో సఫలీకృతవుయ్యూరు. ఢిల్లీ నుంచి గల్లీ నాయకుల దాకా కేసీఆర్ లక్ష్యంగా మారా రు. మరోవైపు ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి వీసమెత్తు ఆదరణ కనిపించని టీడీపీ అధినేత చంద్రబాబునాయుుడు కూడా కే సీఆర్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ధోరణితో ఆయనలో పెరిగిపోతున్న నిరాశాని సృహల్ని బయుటపెట్టేశారు. ఎప్పుడైతే పవన్‌కల్యాణ్ రంగప్రవేశం చేశారో అప్పుడే ఈ విమర్శల పర్వం పక్కదోవ పట్టి పరిస్థితి మరింత దిగజారింది.
పవన్ దుందుడుకు ధోరణి
నాయకుల నడుమ విపరీత ధోరణిలో సాగే తిట్లు, వ్యక్తిగత నిందారోపణలను ప్రజలు ఎప్పుడూ స్వాగతించరు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్ ‘పంచెలూడదీసి కొడతా’ వంటి తీవ్ర పదజాలాన్ని వాడిన తీరు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. రాజకీయ పార్టీల చరిత్రలో తొలిసారిగా అన్నట్లు... బీజేపీ, టీడీపీలకు ప్రచారం చేయడం కోసమే సొంతంగా పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్ ఈసారి కూడా తన పరిణతిలేమిని, సంస్కార రాహిత్యాన్ని బయటపెట్టేశారు. కేసీఆర్ తాటతీస్తా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ మాటల ధోరణి పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గమనించి చివరకు టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం తలలుపట్టుకుంటున్నాయి. ప్రచారంలో సోవువారం సా యుంత్రం వుుగియుడంతో ఓటర్లు ఒక్కసారిగా హమ్మయ్య అంటూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. పార్టీలు, నాయకులను విమర్శించడంలో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కొందరు ప్రశంసనీయమైన సంయమనం పాటించారు. ప్రత్యేకించి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ప్రచారం చేసిన వైఎస్ జగన్, షర్మిల ఈవిషయంలో హుందాగా వ్యవహరించారు. చంద్రబాబు రాజకీయపరమైన సంస్కారాన్ని, మర్యాదలను తుంగలోతొక్కి ఏకవచనంలో జగన్‌పై ఇష్టారాజ్యంగా నిందారోపణలు చేస్తున్నా సరే... జగన్ ఒక్కసారైనా చంద్రబాబును తన ప్రసంగాల్లో కనీసం ఏకవచనంలో కూడా సంబోధించకపోవడం గవునార్హం.