బాబు ఓ శిఖండి
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని, ప్రజల ఆశించే తెలంగాణను సాధించడం కోసమే ఒంటరిగా పోటీ చేస్తున్నామని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
తెలంగాణ విభజన కోసం మూడు తరాలుగా ఉద్యమం జరుగుతోంది. కానీ 2001లో ఏర్పడిన టీఆర్‌ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చిందనేది పచ్చి నిజం. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా, టీఆర్‌ఎస్ పోరాట పటిమను గుర్తించి ప్రజల ఆకాంక్షకు పట్టం కట్టారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేయాలని అంటున్నాం.
ప్రజలు గుర్తించారు...
సస్యశామలమైన, సామాజిక దృక్పథం కలిగిన తెలంగాణను సాధించి ఇస్తామని ప్రజలకు మేం మాట ఇచ్చాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అధికారం కూడా కావాలి. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఇంటి పార్టీ అయిన టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. మళ్లీ ప్రాంతీయేతర పార్టీలకు అధికారమిస్తే తెలంగాణకు అర్థం లేకుండా పోతుంది.
కుటుంబ పార్టీలకు మూలం కాంగ్రెస్సే
నెహ్రూ నుంచి రాహుల్‌గాంధీ వరకు దశాబ్దాలుగా ఆ పార్టీని శాసిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిసి ్థతి ఉంది. టీడీపీ కూడా అంతే. వీటికి మా పార్టీ భిన్నమే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న కేసీఆర్‌తో పాటు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్, తెలంగాణ జాగృతితో చైతన్యం తెచ్చిన కవిత గురించి అందరికీ తెలుసు. హరీష్‌రావు కూడా ఉద్యమకారుడే. వీరు పోటీ చేయడం తప్పెలా అవుతుంది.
అర్థం లేని విమర్శలు
విలీనం చేస్తామనే మాట మా పార్టీ ఎవ్వరికీ ఇవ్వలేదు. సాయం చేసిన వారికి మర్యాదపూర్వకంగా కలవడం తెలంగాణ బిడ్డల నైజం. అందుకే సోనియాకు, తెలంగాణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. కానీ కాంగ్రెస్ తెరవెనుక కుట్రలకు పాల్పడింది. 1200 మంది అమరుల ప్రాణత్యాగాలను బలిగొని, మా పార్టీకి చెందిన విజయశాంతి, వివేక్, అరవిందరెడ్డి, విజయరామారావులను కాంగ్రెస్‌లో కలుపుకొంది.
టీడీపీ భూస్థాపితం...
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పెద్ద శిఖండి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదు. తెలంగాణలో మునిగిపోతున్న టీడీపీని భుజాన మోస్తున్న బీజేపీ కూడా మునిగిపోక తప్పదు. తెలంగాణ పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది. టీడీపీ మా పార్టీ నాయకులపై మొదట్లోనే కేసులు పెట్టించింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఎంతమందితో కలిసినా, సినిమా యాక్టర్లను తిప్పినా భూస్థాపితమయ్యే పార్టీ అది.
పక్కా ప్రణాళికతో హామీలు నెరవేరుస్తాం...
మా మేనిఫెస్టోకు పక్కా ప్రణాళిక ఉంది. తెలంగాణలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటాం. ప్రజలకు అవసరమయ్యే ప్రతి పనిని చేసి చూపెడతాం. ఎన్నికల హామీలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి ఆ దిశగా పనిచేస్తాం.
తెలంగాణ ఆంక్షాల మేరకే మద్దతు
మా లక్ష్యం బంగారు తెలంగాణ. అధికారం కన్నా మాకు ఆకాంక్షే ముఖ్యం. మా డిమాండ్లను స్వాగతించి ఆ దిశగా అమలు చేసే వాళ్లకే కేంద్రంలో మా మద్దతు ఉంటుంది. ఫలితాల తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాం. ఏ పార్టీతో