కేసీఆర్ గెలిస్తే గడీల పాలనే | kcr win ofter rule the telengana | Sakshi
Sakshi News home page

కేసీఆర్ గెలిస్తే గడీల పాలనే

Published Sun, Apr 27 2014 1:14 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

కేసీఆర్ గెలిస్తే గడీల పాలనే - Sakshi

కేసీఆర్ గెలిస్తే గడీల పాలనే

ఇంటర్వ్యూ   దామోదర రాజనర్సింహ
 
 కేసీఆర్ మాటలు నమ్మొద్దు గడీల పాలన మనకొద్దు స్థానికత కచ్చితంగా ఉంటుంది వైఎస్ డైనమిక్ నాయకుడు

 
 
 
 వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి

 ‘తెలంగాణ పసిబిడ్డ తల్లి పొత్తిళ్లలో ఉంది. దాని బాగోగులు చూసే బాధ్యత తల్లి సోనియాకే ఇవ్వాలి. పూటకో మాట మాట్లాడే మాయల మరాఠి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు. ప్రాణాలు త్యాగం చేసి...కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ‘బాంఛన్ నీ కాల్మొక్త’ అనే గడీల పాలన వద్దే వద్దు’ అంటున్నారు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సిలారపు దామోదర రాజనర్సింహ. సోనియాగాంధీ బహిరంగ సభకు వేదిక ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా సాక్షికిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
 
 
 కేసీఆర్ మెర్జ్.. డీ మెర్జ్ అన్నాడు. మా దగ్గర రికార్డు ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం  కాదు. కానీ పర్యావరణం, అక్కడి గిరిజనులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రాజెక్టు కట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల ఆప్షన్లు అంటారా..! రాష్ట్రాల విభజన కొత్తేమీ కాదు. ఈ రోజే జరుగుతున్న అంశం కాదు. కేసీఆర్ మాట మార్చి ఓట్ల కోసం ఉద్యోగుల ఆప్షన్లను తెర మీదకు తెచ్చాడు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అందులో కచ్చితంగా స్థానికత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఉద్యోగుల బదిలీలుంటాయి. కేసీఆర్‌ను ఒక్క మాట అడుగుతున్న... పోలవరం ముంపు సమస్య ఉన్నప్పుడు, ఉద్యోగుల ఆప్షన్ల సమస్య ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు తెలంగాణ వచ్చిన రోజు ఒంటెల మీద, గుర్రాల మీద కూర్చొని ఊరేగి సంబరాలు చేసుకున్నడు. అప్పుడు కనిపించలేదా ఈ సమస్యలు?. కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి.
 
కేసీఆర్‌ని ప్రజలు గమనిస్తున్నారు

 కేసీఆర్ ఇదే ఆందోల్‌లో మీటింగ్ పెట్టి సింగూరు కట్ట మీద కుర్చీ వేసుకొని కూ ర్చుంటానని చెప్పాడు. సింగూరు నీళ్లను మెదక్ జిల్లాకు పారిస్తానని చెప్పాడు. సింగూరు నీళ్లే నిజాం సాగర్ వెళ్తాయి. నిజామాబాద్ పోయి ఏం చెప్పాడు? నిజాం సాగర్ కట్ట మీద కుర్చీ వేసుకొని కూర్చొని నిజామాబాద్‌కు నీళ్లు పారిస్తానని చెప్పాడు. ఇందులో ఏది నిజమో ఆయనే చెప్పాలి. కేసీఆర్ మాటలను ప్రజలు గమనిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలే తగిన విధంగా స్పందిస్తారు.

 మోడీ గురించి తక్కువ మాట్లాడాలి

 మోడీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాకుంటే మోడీని చూసి మీడియాను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవచ్చు.
 ఆందోల్ ప్రగతికి ఎంతో కృషి పదేళ్ల కిందట ఆందోల్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా తయారైంది. ఆందోల్ ప్రజలు ఎప్పుడైనా కలగన్నారా? జేఎన్‌టీయూ వస్తుందని. సింగూరు జలాల ట్రయల్ రన్ జరుగుతుందని ప్రజలు ఊహించారా? జోగిపేటలో మూడు పాలిటెక్నిక్, రెండు డిగ్రీ కళాశాలలు, పీజీ సెంటర్ ఉన్నాయి. మార్కెట్, రోడ్లు, సబ్‌స్టేషన్లు అన్ని తెచ్చాను. నా వంతు కృషి చేశాను. మిగిలింది ప్రజలు నిర్ణయిస్తారు.

 కేసీఆర్ మీడియా తయారు చేసిన నేత

మీడియాకు, కేసీఆర్‌కు ఉన్న సంబంధమేంటో భగవంతుడికే తెలియాలి. కేసీఆర్ మీడియా తయారు చేసిన నాయకుడు. మీరు సామాన్యుని దగ్గరకు వెళ్లి తెలంగాణ
 
 వైఎస్ లాంటి డైనమిక్ లీడర్ లేడు
 
వైఎస్సార్ లాంటి డైనమిక్ లీడర్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్లంత తోసుకొని ముందుకు పోయాం. అలాంటి నేత ఇప్పుడు లేడు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా ఈ గడ్డ మీద కాలు పెడుతుంటే... ఆ తల్లిని చూడాలని లక్షలాది జనం ఆరాట పడుతున్నారు. కానీ వారందరినీ తీసుకొని రావడంలో మేం విఫలమయ్యాం. ఇది మా దౌర్భాగ్యం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement