సంస్కారవంతంగా మెలగాలి: కేసీఆర్ | TRS workers behave like good manners, says KCR | Sakshi
Sakshi News home page

సంస్కారవంతంగా మెలగాలి: కేసీఆర్

Published Fri, May 16 2014 5:47 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

సంస్కారవంతంగా మెలగాలి: కేసీఆర్ - Sakshi

సంస్కారవంతంగా మెలగాలి: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ పునర్మిణామే ధ్యేయంగా పనిచేస్తామని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు. సంస్కారవంతంగా మెలగాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ సూచించారు. బేజషాలకు పోవద్దని హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే అందరి ఆకాంక్ష కావాలని, దీనికి అందరికి సహకారం కావాలన్నారు. మంచి పద్ధతితో ముందుకు పోతామన్నారు. నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement