యువ అభ్యర్థుల జోరు | Young candidates Enthusiasm in madhya pradesh state | Sakshi
Sakshi News home page

యువ అభ్యర్థుల జోరు

Published Fri, Apr 11 2014 11:47 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

Young candidates Enthusiasm in madhya pradesh state

మధ్యప్రదేశ్‌లో మొదటిసారి ఓటేయబోతున్న ఓటర్లతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థుల్లో యువ నాయకులకు భారీగానే అవకాశాలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో అత్యంత తక్కువ వయసున్న వ్యక్తిగా హీనా కావ్రే నిలిచారు. 29 ఏళ్ల హీనా కావ్రే మాజీ మంత్రి లిఖిరాం కావ్రే కుమార్తె.
 
 ఆమె బాలాఘాట్‌నుంచి బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థుల్లో ధార్ నుంచి పోటీ చేస్తున్న 35 ఏళ్ల సావిత్రి ఠాకూర్ అత్యంత పిన్న వయస్కురాలు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల సగటు వయసు 50 ఏళ్లు కాగా, బీజేపీ అభ్యర్థుల సగటు వయసు 55 సంవత్సరాలు. ఈ రాష్ర్టం నుంచి పోటీ చేస్తున్న వారిలో 73 ఏళ్ల లక్ష్మి నారాయణ్ యాదవ్(సాగర్) అత్యంత పెద్ద వయస్కుడు. రాష్ట్రంలోని మొత్తం 4.7 కోట్ల ఓటర్లలో 18-29 ఏళ్ల మధ్యనున్న యువత 33% ఉండడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement