ఇదీ చరిత్ర: ప్రగతి పరిశీలన
నంద్యాల లోక్‌సభ స్థానం 1952లో ఏర్పడింది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శేషగిరిరావు విజయుం సాధించారు. ఆ తర్వాత ఈ స్థానం ఒకసారి ఆదోని, వురోసారి మార్కాపురం నియోజకవర్గాల్లో అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. 1967లో తిరిగి నంద్యాల నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికలతో పాటు 1971, 19-0లోనూ పెండేకంటి వెంకటసుబ్బయ్యు (కాంగ్రెస్) ఎన్నికయ్యూరు. ఈయున కేంద్రంలో మంత్రి పదవులను నిర్వహించారు. గవర్నర్‌గానూ పనిచేశారు. 1977 ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గానూ పని చేశారు. తర్వాత కొంతకాలానికే రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.
పెండేకంటి గెలుపొందారు. 19-4లో ఈ స్థానాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వుద్దూరు సుబ్బారెడ్డి గెలుపొం దారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బొజ్జా వెంకటరెడ్డి (19-9), గంగుల ప్రతాపరెడ్డి(1991) ఎంపీలుగా పనిచేశారు. ప్రతాపరెడ్డి ఎన్నికైన కొంతకాలానికే పదవికి రాజీనావూ చేసి..అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుకు అవకాశమిచ్చారు. పీవీ 1991-1996 వుధ్య ప్రాతినిధ్యం వహించారు. 1996 ఎన్నికల్లో ఆయన నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపురం నుంచి గెలుపొందారు. నంద్యాల కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 199-, 1999లోనూ ఇక్కడి నుంచి గెలిచారు. గత రెండు పర్యాయూలూ ఎస్పీవై రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.
సమాధి రాళ్లు
- చంద్రబాబు హయూంలో నంద్యాల పట్టణంలోని పేదలు ఇళ్లస్థలాలు లేక ఇబ్బందిపడ్డారు.
- రెండు కార్లకు సాగునీరు అందక నియోజకవర్గ రైతులు నష్టపోయూరు.
- వరదలు వచ్చి నంద్యాల పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోరుునా చంద్రబాబు పట్టించుకోలేదు.
- విజయా, నంది డెయిరీల నుంచి నంద్యాల పట్టణంలోకి బైపాస్ రోడ్లు లేక రాకపోకలకు కష్టంగా ఉండేది. వీటిపై బాబు ఏనాడూ దృష్టి పెట్టలేదు.
- చంద్రబాబు హయూంలో నంద్యాల చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారు. ఆ సమయంలో ఎంపీగా ఉన్న భూమా నాగిరెడ్డి అభ్యంతరం తెలిపినా బాబు వినలేదు. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని కేవలం రూ.6.50 కోట్లకు విక్రయించారు.
అభివృద్ధికి ఆనవాళ్లు
- వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో వరద రక్షణ చర్యల కోసం రూ.100 కోట్లు వుంజూరు చేశారు.
- నంద్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.75 కోట్లను మంజూరు చేశారు.
- నంద్యాల పట్టణంలో ఏడు వేల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా పక్కాగృహాలను కూడా మంజూరు చేశారు.
- నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.
- అవుకు రిజర్వాయర్ నుంచి 36 గ్రామాలకు తాగునీటి వసతి కల్పించారు.
- డోన్‌కు రూ.53 కోట్లతో, ఆత్మకూరుకు రూ.14 కోట్లతో మంచినీటి పథకాలు వుంజూరు చేశారు. నంద్యాలలో రూ.10 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, రూ.2 కోట్లతో స్టేడియం నిర్మించారు.
- శెలం అసెంబ్లీ సెగ్మెంట్‌లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి రూ.110 కోట్లు, నందికొట్కూరు నియోజకవర్గంలో వుల్యాల ఎత్తిపోతల పథకానికి రూ.3వేల కోట్లు వుుంజూరు చేశారు. శివాపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలనూ చేపట్టారు.