మా సారు వస్తేనే... మాకు బతుకు
‘మాకు పెద్దగా కోరికలేమీ లేవు. మా గూడు మాకుంటే చాలు. మా తిండి మాకుంటే చాలు. మొక్కవోని మా ధైర్యం మాకుండనిస్తే చాలు. కాకపోతే జగనన్న రాజ్యంలో మాకు ఏ చీకూ చింత ఉండదు..’ అని చెబుతున్నారు గిరిజనులు. రాజన్న వారసత్వమే ఈ నమ్మకానికి గీటురాయి అనేది వాళ్ల భావన. విశాఖ జిల్లా అరకులోయలో ‘సాక్షి’ నిర్వహించిన రోడ్‌షోలో పలువురు గిరిజనులు తమ మనోభావాలను ఈవిధంగా పంచుకున్నారు.
రాజన్నకు గుండె నిండా ప్రేమ సారూ..
మట్టిలో పుట్టి... ఈ మట్టిలోనే పెరిగిన మమ్మల్ని రాజన్న పలకరించిండు సారూ! గుండెలకు హత్తుకున్నడు. ఈ ఊరు వచ్చిన ప్రతిసారీ ఏం కావాలని అడిగేవాడు.. ఇప్పుడు జగన్ సారూ అంతే... ఇంట్లోకి వచ్చి మాట్లాడాడు. పెన్షన్ వస్తుందా.. అని అడిగాడు. ఇంతకన్నా మాకేం కావాలి. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రయితేనే మేలు... అవుతాడు... ఆయన కోసం ఊరూరు తిరుగుతాం. - సింగారి రాము, రంగిని వలస
108 లేకుంటే ఏమయ్యేవాడినో..
రాజన్నకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే రాజన్న ప్రవేశపెట్టిన 108 నాకు పునఃజన్మనిచ్చింది. రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోతే... ఒక్క ఫోన్‌కాల్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అదే లేకపోతే నేను ఇప్పుడు మీ ముందు ఉండేవాడినే కాదు. అందుకే రాజన్న వారసుడు పాలకుడు కావాలి. ఆయన ఆశయాలను బతికించాలి. - కార్తీకరాజు, సుంకరమెట్ట
జగనన్న మాకు ఉద్యోగమిస్తాడు
చదువుకున్నా.. ఆఫీసుల చుట్టూ తిరిగినా ఉద్యోగం రాలేదు. ఊళ్లోనే పనులకెళ్తున్న. జగనన్న వస్తే యువతకు ఉద్యోగం గ్యారెంటీ. ఉన్న ఊళ్లోనే మాకు బతుకుతెరువు చూపిస్తాడు. యువకులందరూ ఇదే ఆశతో ఉన్నారు. బాబు పాలనలో ఉన్న ఉద్యోగాలే తీసేశారు. ఆయన పాలన మాకొద్దు బాబోయ్..
- శెట్టి ప్రియాంక, లోతేరు
బాబువన్నీ మాయమాటలే..
చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలే. జగనన్న పథకాలు మా గిరిజనుల బతుకులను బాగుచేస్తాయనే ప్రతి ఒక్కరం నమ్ముతున్నాం. మా కష్టసుఖాలన్నీ ఆయన తెలుసుకున్నాడు. అందుకే మాకు మేలు చేస్తాడని అందరం నమ్ముతున్నాం.
- ఎస్ భాగ్యవతి, జాకర వలస
వైఎస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నం..
వైఎస్ మా ఊరు వచ్చి ఏం కావాలని అడిగిండు. ఏ మొద్దన్నం. ఇల్లులేదు కాదా అన్నాడు. అధికారులను పిలిచి, ఇల్లు కట్టించమని చెప్పాడు. అంతే, రెండు నెలల్లో అయిపోయింది. మా బాగోగులు పట్టించుకున్న మహానుభావుడు. ఆయన కొడుక్కీ అలాంటి లక్షణాలే ఉన్నాయి. మాకు నమ్మకం ఉంది. ఆయన గెలుస్తాడు. మా తండాలకొస్తాడు. మా ఊళ్లో అందరికీ ఇల్లిస్తాడు.
- గొల్లూరి దాతిమ్మ, చినలబుడు గ్రామం