యువతకు భరోసా | Ensuring of youth | Sakshi
Sakshi News home page

యువతకు భరోసా

Published Sun, Apr 27 2014 1:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

యువతకు భరోసా - Sakshi

యువతకు భరోసా

నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న జగన్
వయో పరిమితి ఒకసారి 40 ఏళ్లకు పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీ

 
 గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకమే కారణం సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయని వైనం రోశయ్య, కిరణ్ ఇద్దరి హయాంలోనూ అంతే అర్హతలున్నా పోటీ పడలేకపోయిన వారందరో వారికి న్యాయమైన అవకాశం దక్కాలంటున్న జగన్ వయసే అడ్డంకి కారాదన్నదే ఆయన ఉద్దేశం మూడుసార్లు వయో పరిమితిని పెంచిన వైఎస్ రెండుసార్లు నాలుగేళ్ల చొప్పున, ఒకసారి ఐదేళ్లు బాబు హయాంలో నోటిఫికేషన్లే అరకొర
 
 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు ముందు, తరవాత ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో అక్షరాలా ఆటలాడుకున్నాయి. ఉద్యోగులను నిరంతరం చెండుకు తిన్న చంద్రబాబు, తన పాలనలో ఎప్పుడూ గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల భర్తీని పట్టించుకున్న పాపాన పోలేదు! తొమ్మిదేళ్లు పాలించి కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా కనీసం 100 ఉద్యోగాలైనా భర్తీ చేయని ఘనుడు బాబు! ఇక వైఎస్ అనంతరం సీఎంగిరీ చేసిన రోశయ్యదీ అదే తీరు. ప్రభుత్వపరంగా బోలెడన్ని ఖాళీలున్నా భర్తీ మాటే తలపెట్టకుండా మీనమేషాలు లెక్కింపుతోనే కాలం గడిపి గద్దె దిగారాయన. తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితిని కేవలం రెండేళ్లు పెంచడంతో సరిపట్టారు. ఇలా వారిద్దరూ బాబుకు తీసిపోని తీరుతో లక్షలాది మంది ఆశావహ యువతీ యువకుల ఉసురు పోసుకున్నారు. అందుకే... వైఎస్ స్వర్ణయుగాన్ని తిరిగి తీసకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగుల ఆవేదనను తండ్రి మాదిరిగానే పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. వైఎస్ తదనంతరం గడచిన ఐదేళ్లలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భావించారు. అధికారంలోకి వచ్చాక ఒకసారి వయో పరిమితిని 40 ఏళ్లకు పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు.
 
 నిరుద్యోగుల ఆవేదనను దివంగత వైఎస్ సానుభూతితో అర్థం చేసుకున్నారు. అందుకే మూడుసార్లు గరిష్ట వయోపరిమితిని నాలుగేళ్లు, ఐదేళ్లు పెంచారు. బాబు 2003లో కేవలం ఎన్నికలపై దృష్టితో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇచ్చినా గరిష్ట వయో పరిమితిని మాత్రం పెంచలేదు. కాని వైఎస్ అలా కాదు. 2004లో అధికారంలోకి రాగానే దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటిదాకా పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాని వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని గరిష్ట వయోపరిమితిని నాలుగేళ్లు సడలించి మరీ పోస్టులను భర్తీ చేశారు. తరవాత 2007లో మరోసారి నాలుగేళ్లు, ఇక 2008లో ఏకంగా ఐదేళ్ల పాటు గరిష్ట వయో పరిమితిని సడలించిన ఘనత వైఎస్‌దే.
 
 చంద్రబాబు పాలనలో...

1.   ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లు పెద్దగా లేవు
2.   {Vూపు-1, గ్రూపు-2 వంటి నోటిఫకేషన్లు అంతంతే
3.  9 ఏళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు తక్కువే. ఏపీసీఎస్సీ ద్వారా కనీసం ఏటా 100 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు
4.    నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి పెంపును ఏనాడూ పట్టించుకోలేదు
5.    2003లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చినా ఆ పోస్టులను భర్తీ చేయలేదు
 
 వైఎస్ పాలనలో...

1.2004లో అధికారంలోకి రాగానే బాబు ఇచ్చిన నోటిఫికేషన్‌కు మరిన్ని ఖాళీలను కలిపి మరో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు
2. అప్పటిదాకా పెద్దగా నోటిఫికేషన్లు జారీ కాని దృష్ట్యా వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు కోరారు
 
 గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన స్తంభించి ఏటా రిక్రూట్‌మెంట్ జరగనందున, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు (వన్‌టైమ్) పెంచుతాం. మిగతా వర్గాలకు కూడా తదనుగుణంగా వయోపరిమితిని
 (వన్‌టైమ్) పెంచుతాం. ఏపీపీఎస్సీని సమూలంగా తీర్చిదిద్దుతాం. క్యాలెండర్ రూపొందించి ఏటా
 ఉద్యోగ నియామకాలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేపడతాం.
 
 వయోపరిమితి పెంపు ఎందుకంటే...
 
1.    కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతి 100 ఖాళీల్లో 66 శాతం పోస్టులను యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీల ద్వారా... 33 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. పైగా ఖాళీలను ఎప్పటికప్పుడు ఏటా భర్తీ చేస్తున్నారు
2.    మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధం. ఇక్కడ ఏకంగా 66 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, కేవలం 33 శాతాన్ని మాత్రమే డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అది కూడా అరకొరగా, నాలుగైదేళ్లకోసారి మాత్రమే. అందుకే వయో పరిమితి సమస్య తలెత్తుతోంది
3. ఇక యూనిఫామ్ పోస్టులై న ఐపీఎస్‌కు జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 30 ఏళ్లుగా, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లుగా కేంద్రం నిర్ణయించింది
4. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీఎస్పీ (సివిల్, జైల్స్) పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్ల వయో పరిమితిని నిర్ధారించింది
5.అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, ఎక్సైజ్ ఎస్‌ఐల కైతే జనరల్‌కు 26 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 31 ఏళ్లుగా నిర్దేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement