చంద్రబాబు నాయుడు అమలు చేసిన అప్రజాస్వామిక విధానాలతో వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. రూ.వందల కోట్ల లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి, నష్టాల్లో ఉన్నవాటిని నిర్దాక్షిణ్యంగా మూసివేశారు.
పరిశ్రమల ఉసురు తీసిన బాబు
చంద్రబాబు నాయుడు అమలు చేసిన అప్రజాస్వామిక విధానాలతో వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. రూ.వందల కోట్ల లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి, నష్టాల్లో ఉన్నవాటిని నిర్దాక్షిణ్యంగా మూసివేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కువ శాతం చంద్రబాబు హయాంలోనే మూతపడ్డాయి. నగరంలోని ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్, ప్రాగా టూల్స్, స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్, మీట్ అండ్ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ టెక్స్‌టైల్ కో ఆపరే షన్, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలతో పాటు ఐడీపీఎల్ వంటి కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా మూతపడ్డాయి. ఒక్కో పరిశ్రమ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను తొల గించారు. అప్పటి వరకు లాభాల్లో నడుస్తున్న ఆల్విన్ రిఫ్రిజిరేటర్ కంపెనీని ఓల్టాస్ అనే ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేశారు. దీంతో సుమారు 3000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అలాగే 18 షుగర్ మిల్లులను, 12 స్పిన్నింగ్ మిల్లులను బాబు మూసివేశారు.
కేసులు పెట్టి.. బలవంతపు వసూళ్లకు పాల్పడి..
చంద్రబాబు పాలనలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా చితికి పోయాయి. విద్యుత్ బిల్లులు కట్టలేక భారీ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, గృహాలు రోజుల తరబడి అంధకారంలో మగ్గిపోయాయి. కరె ంటు బిల్లులు చెల్లించని వినియోగదారులపై చంద్రబాబు కేసులు పెట్టించి జైళ్లలో వేయించారు.
రోగులనూ వదలని బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో సర్కారు వైద్యం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. ఉచిత వైద్యానికి స్వస్తిచెప్పి ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసిన ఘనుడు చంద్రబా బు. ‘గాంధీ’ సహా పలు ఆస్పత్రులను ప్రైవేటీకరించేం దుకు పన్నిన కుట్రలను వైద్యులు తిప్పి కొట్టారు.
పాతబస్తీ బతుకులు చిన్నాభిన్నం
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో పాతబస్తీ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జన్మభూమి పేరుతో పర్యటనలు తప్ప పాతబస్తీ అభివృద్ధికి నయాపైసా విడుదల చేయలేదు. నిజాం కాలం నాటి డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థ, శిథిలావస్థకు చేరిన రోడ్లు, పాఠశాల భవనాలు, ఇరుకు గల్లీలు, మురుగు కాలువల పరిస్థితిలో మార్పులేక పాతబస్తీ పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో పేదల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీలకు పెద్దగా నిధుల కేటాయించకపోవడంతో స్వయం ఉపాధి కూడా అందని ద్రాక్షగా మారింది. మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన దుకాణ్-మకాన్ పథకం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయిం ది. దీంతో దాదాపు లక్షమంది ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. ఇంకొందరు అక్రమ కేసులు, కక్ష సాధింపులకు గురై జైళ్లపాలయ్యారు.