
మహిళల ఉసురు బాబుకు తగులుతుంది
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, మద్య నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబునాయుడే. ఏరులై పారుతున్న మద్యానికి కుటుంబ పెద్దలు బానిసలయ్యారు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. 30 శాతం మహిళలు అనాథలుగా మారారు. వారి తల్లి, బిడ్డల ఉసురు బాబుకు తగలక మానదు. ఎన్టీఆర్ చేతుల నుంచి అధికారం లాక్కొని రైతులకు ఇచ్చే కరెంటును కూడా దూరం చేసిన ఘనత బాబుకే దక్కింది.
కరెంటు ఇవ్వాలని అడిగిన పాపానికి అన్నదాతలపై కాల్పులు జరిపించి తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో రైతుల సంక్షేమానికి పాటుపడతానని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. బీజేపీ చెంత చేరి దేశంలో చక్రం తిప్పుతానని పగటి కలలు కంటున్నాడు. కాంగ్రెస్ కూడా మద్యం అమ్మకాలను యథేచ్ఛగా ప్రోత్సహిస్తోం ది. కేవలం మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే పాలన కొనసాగించే స్థాయికి కాంగ్రెస్ సర్కారు దిగజారడం సిగ్గుచేటు. మద్య నిషేధాన్ని అమలు చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలను కలిపి ఓడించాలి.
- మల్లు స్వరాజ్యం, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలు