
మూసీ మురుగుకు ఆద్యుడు
రాష్ట్ర రాజధాని నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న చారిత్రక మూసీనది కాలుష్య కోరల్లో చిక్కుకుని శిథిలమయ్యేందుకు బాబు జమానాలోనే పునాది రాయి పడింది.
రాష్ట్ర రాజధాని నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న చారిత్రక మూసీనది కాలుష్య కోరల్లో చిక్కుకుని శిథిలమయ్యేందుకు బాబు జమానాలోనే పునాది రాయి పడింది. బాబు జమానాలో 1996 నుంచి 2003 మధ్య ఫార్మా, బల్క్‌డ్రగ్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అనుమతులిచ్చారు. ఫాక్స్‌సాగర్, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి, పికెట్‌నాలా, బోయిన్‌పల్లి నాలా, బల్కాపూర్‌నాలాల పరిసరాల్లో విస్తరించిన ఈ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు తొలుత హుస్సేన్‌సాగర్‌లో చేరి అక్కడి నుంచి మూసీలో కలుస్తున్నాయి. ఫలితంగా దేశంలో అత్యంత విషతుల్యమైన నదుల్లో మూసీ నాలుగో స్థానంలో నిలిచి ఆందోళన కలిగిస్తోంది. బల్క్‌డ్రగ్స్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వదులుతున్న వ్యర్థాల్లో ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం వంటి హానికారక మూలకాల మోతాదు శ్రుతిమించిందని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్‌జీఆర్‌ఐ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ మూలకాల కారణంగా వ్యవసాయ పంటలు, నీటిలోని ఆల్గే, వృక్ష, జంతు ఫ్లవకాలు, భూగర్భ జలాలు విషతుల్యమై పరీవాహక ప్రాంతాల్లో మానవ మనుగడకే పెనుముప్పు వాటిల్లుతోంద ని ఎన్‌జీఆర్‌ఐ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. మూసీనది సుందరీకరణకు చంద్రబాబు హయాంలో రూ.200 కోట్లతో సిద్ధం చేసిన ప్రాజెక్టు ప్రహసనంగా మారింది. అంతేకాక నది మధ్యలో అప్పట్లో వాణిజ్య కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సన్నాహాలు చేయడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బాబు సర్కారు వెనక్కి తగ్గింది.