ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయి | Looking at people's blessings | Sakshi
Sakshi News home page

ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయి

Published Mon, Apr 28 2014 1:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయి - Sakshi

ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయి

కోట్లాది తెలంగాణ ప్రజల  గుండెల్లో వైఎస్ కొలువు
{పజలు కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం ఆదుకుంది
ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండడం కనీస బాధ్యత
ఖమ్మం జిల్లా దశ, దిశను మార్చేందుకు ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు
రికార్డులు తిరగరాసే రోజు త్వరలోనే ఉంది
సీపీఎంతో ఎన్నికల అవగాహనతో వెళుతున్నాం
నవ తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైఎస్సార్ సీపీ
ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 
 ‘సంక్షేమ పథకాలే ఆలంబనగా, పేదవారికి సేవే పరమావధిగా, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాలనకొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. వైఎస్ మరణంతో వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ వైఎస్సార్ పాలన లాంటి సువర్ణయుగం రావాలంటే అది ఆయన తనయుడు, పేద ప్రజల మనసెరిగిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే సాధ్యం. అందుకే ఆయన నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జగన్ ఆలోచనలు,
ఆయన ఆశయాలు మేలు చేస్తాయి. పేదలకు పట్టం కడతాయి.’ అని అంటున్నారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పొంగులేటి గత రెండురోజులుగా జగన్ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ విశేషాలివి....
 
కూడు, గూడు, గుడ్డ కోసం పేదలు ఎంతగానో శ్రమిస్తారు. కుటుంబ పోషణకు కష్టపడతారు. అయితే, ఆ పేదవ్యక్తికి ఏదైనా అనుకోని ఆపద వస్తే పరిస్థితేంటి.. అనుకోకుండా ఏదైనా జబ్బు చేస్తోనో.. వేలు, లక్షల రూపాయులు చెల్లించి పిల్లలను చదివించాలంటే.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట విపత్తులతో కళ్లముందే పాడైపోతే..  ఇలా అన్ని విషయాలపై ఆలోచన చేసిన ఏకైక మఖ్యమంత్రి వైఎస్సార్. ఎంతోవుంది సీఎంలు అయ్యూ రు. కానీ జనం గురించి ఇంతగా ఆలోచించిన నాయకుడే లేరు.
 
ప్రజాప్రస్థానం పాదయాత్రతో వైఎస్ పేదల కష్టాలు తెలుసుకోగలిగారు. అధికారంలోకి రాగా నే రైతు రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ అవులు చేశారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు భరోసా ఇచ్చారు. ఆయన పాలన లో పేదలు గుండెపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీకార్డు ఉందిలే... పిల్లల చదువులకు ఫీజు ఆ ముఖ్యమంత్రే కడతాడులే... రైతన్నను కూడా ఆదుకుంటాడులే అనే నమ్మకం ప్రజలందరిలోనూ ఉండేది. వైఎస్ కూడా ఇచ్చిన వూటకు కట్టుబడేవాడు. మడమ తిప్పేవాడు కాదు. అందుకే ప్రజలకు ఆయనపై విశ్వాసం, ప్రేమ.
 
అప్పుడు పేదలను ఆదుకున్నందుకు....

 చంద్రబాబు పాలనలో వరుస కరువు, కాటకాలు, హైటెక్ పాలనతో జనం అల్లాడారు.  వైఎస్ వచ్చాక ప్రజలను సురక్షిత తీరాలకు చేర్చేందుకు చాలా కష్టపడ్డారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ  తేడా లేకుండా కష్టంలో ఉన్న వారికి సేవ చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం కష్టాల్లో ఉంది. ఈ తరుణంలో పేదలంతా ఆ కుటుంబానికి అండ గా నిలవడం కనీస బాధ్యత. కచ్చితంగా వైఎస్‌కు నిజమైన వారసుడు జగనేనని ప్రజలు ఓట్లు ద్వారా నిరూపించబోతున్నారు. ఆ నమ్మకం మాకుంది. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన వారున్నారు. వారి ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాం.

జన తెలంగాణ కావాలి

ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరుదశాబ్దాలుగా తెలంగాణ బిడ్డలు సాగించిన పోరాటం అద్వితీయమైనది. ఈ క్రమంలో సిద్ధించిన నూతన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలన్నదే వైఎస్సార్‌సీపీ ఆకాంక్ష. దీనికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తన పాలన సాగుతుందని జగన్ చెపుతున్నారు. సీమాంధ్రలో గెలిచి ముఖ్యమంత్రి అయినా తాను తెలంగాణ విడిచిపెట్టబోనని హామీ ఇస్తున్నారు. తన తండ్రి ఇచ్చి వెళ్లిన కుటుంబాన్ని వదులుకోబోనని ఆత్మీయత చూపెడుతున్నారు. అయితే దొరలు, విదేశీయుల పాలన కన్నా ప్రజలు ..తమను తాము పాలించుకునే తెలంగాణను చూడాలన్నది నా ఆరాటం. జన తెలంగాణ స్థాపన జరిగినపుడే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సార్థకత చేకూరినట్టు. అమరవీరుల స్వప్నం నెరవేరినట్టు. వైఎస్సార్‌సీపీ తెలంగాణలో క్రియాశీలకంగా పనిచేస్తుంద ని, కీలకపాత్ర పోషిస్తుందని గట్టిగా చెప్పగలుగుతున్నాం.

మాది విభిన్న రాజకీయ పరిస్థితి

ఖమ్మం జిల్లాలో రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది. రాజకీయంగా చైతన్యవంతులయిన ఈ జిల్లా ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు అనేక ప్రజాస్వామిక పోరాటాల్లో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఈ జిల్లాలో రాజకీయంగా ఎదగడం కత్తిమీద సాము లాంటిదే. వైఎస్‌పై ఉన్న అభిమానం, అనురాగంతో పాటు రైతులపై ఉన్న వాత్సల్యం నన్ను రాజకీయాల వైపునకు మళ్లించింది. రైతులకు, పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఓ వైపు పార్టీని నడిపిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై పోరాడాను. జిల్లాలో విస్తృతంగా పర్యటించాను. ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నా. వారిలో ఒకడిగా ఇమిడిపోయా. ఇప్పుడు అందరూ ఆప్యాయంగా నన్ను శీనన్న అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటోంది. ఎంత కష్టపడ్డా శ్రమ అనిపించడం లేదు. వీరందరికీ సేవ చేసే భాగ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా. ప్రజలు కూడా నన్ను గెలిపించేందుకు సిద్ధమయ్యారు. స్థానికేతరులను గెలిపించిన దాని కన్నా జిల్లా కు చెందిన నేను గెలిస్తే జిల్లా దశ, దిశ మారిపోతాయని వారు భావిస్తున్నారు. ఖమ్మంలో రికార్డులు తిరగరాసే రోజు త్వరలోనే ఉంది.

మార్క్సిస్టులతో కలిసే ప్రయాణం

ఈ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో సీపీఎంతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని ముందుకెళుతున్నాం. జిల్లాలో పట్టున్న సీపీఎంతో కలిసి మా కేడర్ అవగాహనతో ముందుకెళుతోంది. ఇరుపార్టీలు ఇరు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో మా రెండు పార్టీల మధ్య కొంత అంతరాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కానీ మేం మాత్రం మానసికం గా ఎన్నికల అవగాహనకే సిద్ధమై ఉన్నాం. వైఎస్సార్ సీపీ లేని చోట్ల సీపీఎం అభ్యర్థులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. సీపీఎం శ్రేణులు కూడా అదే తరహాలో పనిచేస్తున్నాయి. జిల్లాలో మేం క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
 
బాబును నమ్మరు.. కేసీఆర్, కాంగ్రెస్‌లకు ఓట్లేయరు
 
తొమ్మిదేళ్ల పాలనలో పేదల ఉసురు పోసుకున్న చంద్రబాబుని నమ్మి ప్రజలు ఓటేస్తారని అనుకోవడంలేదు. బాబు పాలన కోరుకోవడమంటే మళ్లీ ప్రజలు కష్టాలు కొనితెచ్చుకోవడమే. ఇక తెలంగాణ సాధన క్రమంలో దోబూచులాడిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలను కూడా ప్రజలు ఆదరించరు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కలిపేస్తానని ఒకసారి, నేనెందుకు కలపాలని మరోసారి కేసీఆర్ చెప్పడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు రాష్ట్రాలు ఏర్పాటు చేసేది పార్టీలను కలుపుకోవడం కోసమా అనిపిస్తుంది. ఇక, 2011, డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి, వెంటనే తోకముడిచేయుడం వల్లే తెలంగాణ విద్యార్థులు, యువకుల వుృతికి కారణవుయ్యూరు, ప్రాణా ల్ని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేయాలనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఆ పార్టీకి ప్రచారం చేసే వారే కరువయ్యారు. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్‌సీపీ పక్షాన కీలక పాత్ర పోషించబోతున్నాం. నవతెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నాం.
 
నాకో వ్యూ ఉంది
 
ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన తర్వాత ప్రజలకు ఎలా సేవ చేయాలన్న దానిపై నాకిప్పటికే ఓ అవగాహన ఉంది. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా నివసించే జిల్లాలో వారి సంక్షేమమే ప్రధానం. అందుకే వారి అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించుకున్నాం. సంక్షోభంలో ఉన్న జిల్లా గ్రానైట్ పరిశ్రమను గట్టెక్కించేందుకు, విద్యుత్‌కోతలు, పన్ను మోతలు లేకుండా చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించా. సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, జిల్లాలోని టెయిలెండ్ భూములకు సాగునీరు, అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో తాగునీటి సమస్య లేకుండా చేయడం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా పోరాటం... ఇలా చాలా చేయాలని ఉంది. ప్రజలు నాకు అవకాశమిస్తే నేనేంటో రుజువు చేసుకుంటా... ప్రజలకు భరోసాగా ఉంటా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement