మట్టి మనిషి | the soil man | Sakshi
Sakshi News home page

మట్టి మనిషి

Published Wed, Apr 23 2014 1:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

మట్టి మనిషి - Sakshi

మట్టి మనిషి

 రైతు పచ్చగా  కళకళ లాడిన నాడు

 మాత్రమే రాష్ట్రం స్వర్ణయుగం అవుతుందన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మాటనే తన బాటగా మలచుకున్నారు ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తండ్రి మాదిరిగానే అహర్నిశలూ అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా పోరాడుతున్న రైతు పక్షపాతి వైఎస్ జగన్. రైతులకు మద్దతు ధర కోసం రోడ్డెక్కినా, రుణాల రీ షెడ్యూలింగ్ కోరుతూ ధర్నా చేసినా, కరెంటు కోతలతో అల్లాడుతున్న అన్నదాతకు మద్దతుగా కలెక్టరేట్లను ముట్టడించినా... అన్నం పెట్టే ఆ చేయి చల్లగా ఉండాలన్న వైఎస్ జగన్ తపన అన్నింట్లోనూ అడుగడుగునా కన్పిస్తుంది. తొమ్మిదేళ్ల పాలనతో వ్యవసాయ రంగం ఉసురు పోసుకుని, అసలు సాగే దండగంటూ ఎద్దేవా చేసి, అదే నోటితో ఇప్పుడు అధికారం కోసం రైతు పాట పాడుతున్న ఆల్‌ఫ్రీ బాబుల తరహా ఎన్నికల రాజకీయాలు జగన్‌కు అస్సలు చేతకావు. మాటకు మనసుండాలని, నాయకుడన్న వాడికి విశ్వసనీయత ఉండాలని త్రికరణశుద్ధిగా నమ్మే నేత ఆయన. తండ్రి నుంచి తనకు అందివచ్చిన వారసత్వం కూడా అదేనని ఎప్పుడూ చెబుతుంటారు వైఎస్ జగన్.

రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచీ ఇప్పటిదాకా జగన్ ఎప్పుడూ రైతు పక్షమే. గత నాలుగేళ్లుగా రైతుల పక్షాన ఆయన చేపట్టిన దీక్షలే అందుకు సాక్షి. రైతన్నకు అన్యాయం జరిగిన ప్రతిసారీ, ప్రకృతి ప్రకోపానికి వారు బలైనప్పుడల్లా నేనున్నానంటూ ముందుకొచ్చారు జగన్. అధైర్యపడొద్దంటూ వారి వెన్ను తట్టారు. బాధ్యతను విస్మరించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను రైతుల పక్షాన ఎప్పటికప్పుడు నిలదీశారు. దీక్షలు, ఆందోళనలు, ఓదార్పు యాత్రల్లో తాను గమనించిన రైతు సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో పలు వాగ్దానాలు చేశారు జగన్. వీటన్నింటి వెనకా ఆయన లక్ష్యం ఒక్కటే... రైతు రాజ్యాన్ని, రైతే రాజుగా మారే రోజును తేవడం...
 
 లక్ష్య దీక్ష -21-12-2010  రైతుల సమస్యలపై   (48 గంటలు)   విజయవాడ
 

  తుపాన్లు, భారీ వర్షాల దెబ్బకు పంట కోల్పోయి 15 రోజుల్లో 126 మంది రైతులు మరణించినా కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదంటూ మండిపడ్డారు. సర్వం కోల్పోయి రైతులు అల్లాడుతుంటే, వారి నుంచి సగం ధాన్యాన్ని మాత్రమే కొంటానంటూ వ్యాపారుల కంటే అధ్వానంగా వ్యవహరిస్తోందం టూ దుయ్యబట్టారు. రైతును విస్మరిస్తే సర్కారుకు మూడినట్టేనని హెచ్చరించారు. ‘నాణ్యత ప్రమాణాల షరతుల్లేకుండా మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ఇన్‌పుట్ రాయితీ ని రూ.1,800 నుంచి కనీసం రూ.3,600 కు పెంచాలి. వ్యవసాయ రుణాలను రీ షెడ్యూల్ చేయాలి. వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలి. వచ్చే రబీలో రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి. నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.5,000 అదనపు సాయం అందించాలి. పంటను పూర్తిగా కోల్పోయిన కౌలు రైతులను అన్నిరకాలా ఆదుకోవాలి. వారికి గుర్తింపు కార్డులిచ్చి, పావలా వడ్డీని వర్తింపజేయాల’ని డిమాండ్ చేశారు.
 
 జలదీక్ష-11-01-2011  ఢిల్లీ: కృష్ణానదీ జలాల్లో రాష్ట్రానికి అన్యాయంపై (24 గంటలు)
 
కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జలదీక్ష చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులతో పాటు భారీగా రైతులు కూడా దీక్షలో పాల్గొన్నారు. ‘‘ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు అనుమతించరాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణం ట్రిబ్యునల్‌లో అప్పీలుకు వెళ్లాలి. రాష్ట్రం తరఫున కేంద్రం కూడా ఇంప్లీడ్ కావాలి’’ అని జగన్ డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును తిరగదోడాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.
 
హరితయాత్ర  07-02-2011  పోలవరం నిర్మాణం కోసం (4రోజులపాటు  పాదయాత్ర)  రావులపాలం-పోలవరం
 
పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలనే డిమాండ్‌తో 4 రోజుల పాటు 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రైతులు తదితరులు భారీ సంఖ్యలో వెంట నడిచారు. పోటెత్తిన జనసందోహం నడుమ ఆఖరి రోజున చివరి ఆరు కిలోమీటర్ల దూరం నడిచేందుకు జగన్‌కు ఏకంగా ఐదు గంటలు పట్టింది! కేంద్రం పట్టించుకోకపోతే పోలవరాన్ని మీరు కట్టలేరా అంటూ యాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై జగన్ నిప్పులు చెరిగారు. 32 మంది ఎంపీలను పంపి కూడా అడుక్కునే దుస్థితి ఎందుకంటూ నిలదీశారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం ఆలోచన చేసినా పోలవరం ఎప్పుడో పూర్తయి ఉండేదన్నారు. కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా తక్షణం పోలవరం నిర్మాణానికి టెండర్లు పిలవాలని, లేదంటే తీవ్ర ఆందోళన తప్పదంటూ హెచ్చరించారు.
 
రైతు దీక్ష 15-05-2011  రైతుల సమస్యలపై  (48 గంటలు)  గుంటూరు

కనీస మద్దతు ధర అందక అల్లాడుతున్న రైతులకు దన్నుగా చేసిన దీక్ష. ‘‘ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు తక్షణం రూ.1,000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. క్వింటాలుకు రూ.100 బోనస్ ధర ప్రకటించాలి’’ అంటూ ఈ సందర్భంగా జగన్ పలు డిమాండ్లు చేశారు. దీక్షలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పురుషులు, యువత, అభిమానులు అసంఖ్యాకంగా దీక్షకు తరలివచ్చి జగన్‌కు సంఘీభావం ప్రకటించాు.
 
 సాగుపోరు  13-06-2011  రైతు సమస్యలపై  ధర్నా   చిత్తూరు
 
రైతు సమస్యల తక్షణ పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్ష. రైతులు అడుగడుగునా కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదంటూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొని జగన్ నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్దా భారీ స్థాయిలో రైతులు ధర్నాలు నిర్వహించారు.
 
మహాధర్నా  01-10-2011 రైతులు  సమస్యలపై  ధర్నా  విజయవాడ
 
 అన్నదాత సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ‘‘మద్దతు ధరను రైతుకు హక్కులా మార్చాలి. క్వింటాలుకు కనీసం రూ.300 మిగిలేలా చూడాలి. వ్యవసాయ రుణాలివ్వడంతో పాటు పంటల బీమాను కూడా రైతు హక్కులుగా మార్చాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరల్లో పెరుగుదలను ప్రభుత్వమే భరించాలి. ప్రాకృతిక నష్టాలు రైతు వెన్ను విరవకుండా చూసేందుకు రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. గోదాముల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
 
కరెంటు పోరు 11-10-2011 కరెంటు కోతలకు నిరసనగా  వైఎస్సార్ జిల్లా  కలెక్టరేట్
 
 కరెంటు కోతలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. కడప కలెక్టరేట్ వద్ద జగన్ స్వయంగా పాల్గొన్నారు. ‘‘సాగుకు కరెంటివ్వరు. అడిగితే అన్నదాతను అరెస్టులు చేయిస్తారు. తప్పుడు కేసులు, దొంగ కేసులు పెడతారు’’ అంటూ దుయ్యబట్టారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా సాగుకు సజావుగా కనీసం ఏడు గంటల పాటు కరెంటివ్వాలని డిమాండ్ చేశారు. అల్ప వర్షపాతం నమోదైన 435 పై చిలుకు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, అక్కడి రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. రబీ సీజన్‌లో కూడా వారికి తిరిగి రుణాలివ్వాలన్నారు.
 
రైతుదీక్ష 10-01-2012  రైతులకు గిట్టుబాటు ధరల కోసం  (48 గంటలు) ఆర్మూరు  (నిజామాబాద్)
 
 ‘సర్కారు మొద్దు నిద్ర’ను వదిలిచేందుకు చేపట్టిన దీక్ష. రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ రెండేళ్లుగా ఎంతగా ఉద్యమించి నా, ఎన్ని దీక్షలు, ధర్నాలు చేసినా ఈ చెవిటి సర్కారుకు పట్టడం లేదంటూ దుమ్మెత్తిపోశారు జగన్. రైతులను, రైతు కూలీలను గాలికొదిలేసిందంటూ మండిపడ్డారు. ‘పసుపు, చెరకు, మిరప, పత్తి, వరి రైతును ఆదుకునేందుకు రూ.3,000 కోట్లతో తక్షణం మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. సాగుకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలి. ప్రకటించిన 800 పైచిలుకు కరువు మండలాల్లో రైతులకు తక్షణం సాయం అందజేయాల’ని డిమాండ్ చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా పల్లెలకు పల్లెలే కదిలి వచ్చిన అపూర్వ దృశ్యం రైతు దీక్ష సందర్భంగా ఆవిష్కృతమైంది. నిరాశ చెందొద్దని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని, మంచి రోజులు వస్తాయని పసుపు రైతులకు జగన్ ధైర్యం చెప్పారు.
 
‘సర్కారు మొద్దు నిద్ర’ను వదిలిచేందుకు చేపట్టిన దీక్ష. రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ రెండేళ్లుగా ఎంతగా ఉద్యమించి నా, ఎన్ని దీక్షలు, ధర్నాలు చేసినా ఈ చెవిటి సర్కారుకు పట్టడం లేదంటూ దుమ్మెత్తిపోశారు జగన్. రైతులను, రైతు కూలీలను గాలికొదిలేసిందంటూ మండిపడ్డారు. ‘పసుపు, చెరకు, మిరప, పత్తి, వరి రైతును ఆదుకునేందుకు రూ.3,000 కోట్లతో తక్షణం మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. సాగుకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలి. ప్రకటించిన 800 పైచిలుకు కరువు మండలాల్లో రైతులకు తక్షణం సాయం అందజేయాల’ని డిమాండ్ చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా పల్లెలకు పల్లెలే కదిలి వచ్చిన అపూర్వ దృశ్యం రైతు దీక్ష సందర్భంగా ఆవిష్కృతమైంది. నిరాశ చెందొద్దని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని, మంచి రోజులు వస్తాయని పసుపు రైతులకు జగన్ ధైర్యం చెప్పారు.
 
విద్యుత్ పోరు  03-04-2012  విద్యుత్ చార్జీల  పెంపున కు నిరసన  ధర్నా మొగల్తూరు (పశ్చిమగోదావరి)
 
కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ దీక్షకు దిగారు. రైతుల కష్టాలను పట్టించుకోని, కన్నీళ్లను తుడిచేందుకు ప్రయత్నం కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం... కరెంటు చార్జీలను మాత్రం ఎడాపెడా పెంచుతూ మోయలేని భారం మోపుతోందంటూ తూర్పారబట్టారు.(ఇవేగాక రాష్ట్రవ్యాప్తంగా 300 రోజులకుపైగా ఓదార్పు యాత్ర చేసి పలు రైతు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు జగన్)
 
11-03-2012

 పత్తి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి జగన్ లేఖ రాశారు. నిషేధం వల్ల పత్తి ధరలు దారుణంగా పడిపోతున్నాయంటూ ఆవేదన వెలిబుచ్చారు. పత్తి ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దాని మద్దతు ధరను రూ.5,500కు పెంచాలని కోరారు.
 
 
 
విద్యుత్ పోరు 02-04-2013  విద్యుత్ చార్జీల  పంపున కు నిరసన  ధర్నా ఎమ్మెల్యే క్వార్టర్‌‌స   హైదరాబాద్
 
 విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష
 
కరెంటు చార్జీల పెంపు, ఎడాపెడా కోతలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ 30 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఏకధాటిగా వర్షం కురిసినా లెక్క చేయకుండా దీక్షను కొనసాగించారు. ఐదు రోజుల అనంతరం దీక్షపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపింది. అర్ధరాత్రి వేళ ఖాకీలు ఒక్కసారిగా విరుచుకుపడి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అమానుషంగా లాక్కెళ్లారు.
     
 అంతేగాక విద్యుత్ సంక్షోభం తదితరాలపై కూడా ఎప్పటికప్పుడు విజయమ్మ ధర్నాలు, దీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబు సర్కారు బాటలోనే నడుస్తోందంటూ నిప్పులు చెరిగారు.  వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా ప్రజా సమస్యలు, రైతుల ఇక్కట్లపై ఎప్పటికప్పుడు ధర్నాలు, దీక్షలు నిర్వహించారు. అంతేగాక తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే ‘మరో ప్రజాప్రస్థానం’ వేలాది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి రాష్ట్ర చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్నారు షర్మిల.
 
 07-09-2011
 
ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్య పరిష్కారం కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను కలిశారు. ఒకదాని వెనక ఒకటిగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వాటి పరిష్కారానికి తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలన్నారు. కౌలు రైతులకూ రుణాలు లభించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
 
 08-09-2011

 పవార్‌ను కలిసిన మర్నాడే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కూడా జగన్ భేటీ అయ్యారు. అన్నిరకాలుగా సమస్యల్లో కూరుకుపోయిన రాష్ట్ర రైతులకు అండనివ్వాలని కోరారు. ‘కనీస మద్దతు ధర పెంచండి. అందుకు ఒక శాశ్వత యంత్రాంగాన్ని నెలకొల్పండి. ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి వెంటనే వాటి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.
 
 వ్యవసాయానికి మంచి జరుగుతుంది

 వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయరంగానికి ఇద్దరు మంత్రులుండాలన్న నిర్ణయం బాగానే ఉంది. కానీ వారు వ్యవసాయ కుటుంబాలకు చెందినవారైతే మరీ మంచిది. రెండు జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల ఉండాల్సిన అవసరాన్ని గుర్తించడం మంచి పరిణామం.  ప్రతి జిల్లాలో అగ్రోప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుతో రైతుల ఉత్పత్తులకు అధిక ధర పలుకుతుంది. రూ.3 వేల కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న హామీ రైతులకు వరం.
 - డాక్టర్ ఎం.మల్లారెడ్డి, అసోసియేట్ డీన్,  వ్యవసాయ కళాశాల, జగిత్యాల
 
 వైఎస్ హయాంలోనే  రైతు సంక్షేమం
 
 వైఎస్ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.లక్ష నష్టపరిహారం అందించడం గొప్ప విషయం. విత్తు వేసేనాటికి బ్యాంకు రుణాల పంపిణీ, అదనపు గోడౌన్ల నిర్మాణం, రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేస్తానన్న జగన్ హామీలు రైతాంగానికి మేలు చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1300 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేసి, ఉచిత విద్యుత్ ఇవ్వడం రైతాంగాన్ని బలోపేతం చేసింది. కరువు, వరదలతో నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ రాయితీ అందజేస్తూ ఆసరాగా నిలవడం గొప్ప విషయం.
 - డాక్టర్ వాణిశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్,   వ్యవసాయ కళాశాల, జగిత్యాల
 
 
 ధరల స్థిరీకరణ నిధితో కొండంత భరోసా

 రైతులకు పూర్తిగా న్యాయం జరగాలంటే ఓట్లతో నిమిత్తం లేకుండా చిత్తశుద్ధితో రైతు గురించి ఆలోచించే నాయకుడు కావాలి. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వురణం తరువాత నాయుకులెవరూ రైతును పట్టించుకోలేదు. రాష్ట్రంలో రైతు పరిస్థితి దారుణంగా మారిన తరుణలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిం ది. రైతులకు ‘ధరల స్థిరీకరణ నిధి’ భరోసా కల్పిస్తుంది. పంటలకు మద్దతు ధర ప్రకటించే అధికారం రాష్ర్ట ప్రభుత్వాలకు లేకపోవడంతో గిట్టుబాటు ధర ప్రకటనలకే పరిమితమైంది. వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టోలో రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. భూసార పరీక్షలు, పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు 102, పాడి రైతుల సంక్షేమానికి 103, రెండు జిల్లాలకు ఓ వ్యవసాయ కళాశాల వంటివి రైతాంగానికి కొండంత భరోసా కల్పించేలా ఉన్నాయి.
 - డాక్టర్ కళత్తూరు సుధాకర్‌రెడ్డి, డీన్, విన్స్ కళాశాల, తిరుపతి
 
 నాకు అయిదెకరాల భూమి ఉంది. మూడు విద్యుత్ మోటార్లున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక్కొక్క మోటార్‌కు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు బిల్లు కట్టెటోడిని. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే నా మూడు మోటార్ల బకాయిలు రూ.10 వేలతో పాటు, ఏటా కట్టే రూ.9 వేలు మాఫీ అయ్యాయి.
 - సంగెపు రాంరెడ్డి, గ్రామైక్య రైతు సంఘాధ్యక్షుడు, లక్ష్మిపూర్, కరీంనగర్ జిల్లా
 
 మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది

 నాడు దివంగత నేత వైఎస్ ఒక్కరే రైతుల గురించి ఆలోచించి రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు. నేడు జగన్ రూపొందించిన మేనిఫెస్టోలో రైతులకు ప్రాధాన్యత ఇచ్చాడు. రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయడం.. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. జగన్‌తో మళ్లీ రాజన్న రాజ్యం రావడం ఖాయం.
 - ఎం.ఈశ్వరరెడ్డి, కావలి  (నెల్లూరు జిల్లా)
 
 రైతు రాజ్యం వస్తుంది

 ప్రకృతి వైపరీత్యాలతో నాలుగేళ్లుగా పంటలు కోల్పోతున్నాం. ప్రభుత్వం నేటికీ నష్టపరిహారం అందించలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి వ్యవసాయం చేయాలంటేనే భయంగా ఉంది. పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైఎస్సార్ లాగానే జగన్‌మోహన్‌రెడ్డి రైతులను ఆదుకుంటారని ఎన్నో ఆశలతో ఉన్నాం.
 -  రైతు కోటిపల్లి భగవాన్, అన్నవరప్పాడు (పశ్చిమగోదావరి జిల్లా)
 

  రైతుకు భద్రత

 రైతు సంక్షేమమే లక్ష్యంగా రూపొందించిన వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో రూ. మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొనడం దేశ చరిత్రలో అపూర్వం. అతివృష్టి, అనావృష్టి, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలతో రైతు కుదేలవుతున్నాడు. అటువంటి విపత్కర పరిస్థితులలో రైతును ఆదుకునేందుకు ప్రతి ఏటా రూ. రెండు వేల కోట్లతో సహాయనిధి ఏర్పాటు చేసి రైతు సోదరులకు భద్రత కల్పించడం ప్రశంసనీయం. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావాలతో పంటకు గిట్టుబాటు ధరలేక  దళారీల దోపిడీకి గురవుతున్న స్థితిలో రైతుకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించడం రైతు సంక్షేమానికి ఎంతో ఆవశ్యం. రూ. 20 లక్షల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ మహిళాభ్యుదయానికి మకుటాయమానం. రైతు సోదరులంతా రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్‌సీపీకి ఓటేస్తారనడం నిస్సందేహం.
 - డాక్టర్ పి.వి. సుబ్బారావు  రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, చిలకలూరిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement