
జగనే సీఎం కావాలి..
రాష్ర్టం ముక్కలై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంక్షోభం నెలకొన్న ప్రస్తుత నేపథ్యంలో ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి శక్తివంతమైన నాయకుడి అవసరం చాలా ఉంది. మాది విజయవాడ.. నేను రాష్ట్రంలోనే పుట్టి పెరిగాను.. ఉన్నత విద్యావంతురాలిగాఇక్కడి రాజకీయ పరిస్థితులన్నీ నాకు తెలుసు. మా బంధువులు కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో మంచిస్థాయిల్లో ఉన్నారు.. అయితే నా ఓటు మాత్రం జగన్‌కే... వైఎస్సార్‌సీపీనే బలపరుస్తా..
అసలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేదా.. ఎవరైనా చెబుతారు కాదు అని... మరి అలాంటి మహానేత కుమారుడు వైఎస్ జగన్‌కే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలున్నాయి. అందుకే ఆయనే సీఎం కావాలి.. మరో ముఖ్య విషయం... ప్రతి ఒక్కరూ ఓటు తమ హక్కును వినియోగించుకోవాలి...
- మానస హిమవర్ష, ‘రొమాన్‌స’ ఫేం