దిగ్గజాల్లో నెగ్గేదెవరు? | which government will be formation in upcoming elections? | Sakshi
Sakshi News home page

దిగ్గజాల్లో నెగ్గేదెవరు?

Published Sat, Apr 12 2014 2:00 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

దిగ్గజాల్లో నెగ్గేదెవరు? - Sakshi

దిగ్గజాల్లో నెగ్గేదెవరు?

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉద్దండులు తలపడుతున్న పలు లోక్‌సభ స్థానాలు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. పార్టీలు సైతం అక్కడతమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
 
 సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్... అందరూ ప్రముఖులే. ఇలాంటి పలువురు దిగ్గజాల్లో సునాయాసంగా గెలిచేదెవరు, కనాకష్టంగా గట్టెక్కేదెవరు, అనూహ్యంగా ఓడేదెవరు, ఎవరికెంత మెజారిటీ వస్తుంది... ఇలాంటి అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ నేపథ్యంలో వారు బరిలో ఉన్నలోక్‌సభ స్థానాలపై విహంగ వీక్షణం...

 
 హేమాహేమీలు తలపడుతున్న కీలక స్థానాల ముఖచిత్రం..
 వారణాసి
 దేశంలో అత్యధికుల దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఇదే. ఉత్తరప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రమైన వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్నారు. ఇక్కడి నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులే కరువయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్‌ని నిలిపింది.
 
 సిటింగ్ ఎంపీ అయిన బీజేపీ అగ్ర నేత మురళీ మనోహర్ జోషీ తప్పుకునేందుకు తొలుత ససేమిరా అన్నా, ఆయన్ను ‘ఒప్పించి’ మరీ హిందువులకు పరమపవిత్రమైన ఈ స్థానం నుంచి వ్యూహాత్మకంగా బరిలోకి దిగారు మోడీ! అయితే ఆ వెంటనే కేజ్రీవాల్ ఎంట్రీ ఇచ్చి ఏకపక్షమనుకున్న పోరును ఆసక్తికరంగా మార్చారు. ఇక్కడ మే 12న పోలింగ్ జరగనుంది.
 
 రాయ్‌బరేలీ
 ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమె వరుసగా మూడుసార్లు గెలిచారు. ‘ఆప్’ బరిలోకి దించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఫక్రుద్దీన్ ఉపసంహరించుకోవడంతో ఆయన బదులు సామాజిక కార్యకర్త అర్చనా శ్రీవాస్తవ పోటీ చేస్తున్నారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అజయ్ అగర్వాల్‌ను బీజేపీ నిలిపింది.
 
 వారణాసిలో కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలిపితే, రాయ్‌బరేలీ నుంచి బీజేపీ కూడా అదే పని చేయడం విశేషం. గట్టి ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో ఈసారి కూడా సోనియా గెలుపు సునాయాసమే. యూపీఏకు బయటి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ పోటీకి దూరంగా ఉండటం మరింత కలిసొచ్చే అంశం. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది.
 
 అమేథీ
 యూపీలో కాంగ్రెస్‌కు మరో కంచుకోట. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి టీవీ నటి స్మృతి ఇరానీ, ఆప్ తరఫున ‘వికటకవి’ కుమార్ విశ్వాస్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ కొంత ప్రముఖులే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
 
 ముఖ్యంగా, ‘ఈసారి రాహుల్‌పైనే పోటీ చేస్తా’నని ప్రకటించి మరీ బరిలో దిగిన విశ్వాస్ అమేథీలోనే మకాం వేశారు. ‘ఇరానీ అయినా రానీ, పాకిస్థానీ అయినా రానీ...’ అంటూ స్మృతిని విమర్శించి వివాదానికి తెర తీశారు. మహిళలను గౌరవించడం తెలియదంటూ ఆమె మండిపడ్డారు. రాహుల్‌ను ఓడిస్తామంటూ వచ్చిన వీరిద్దరూ వాగ్యుద్ధానికి దిగడం ఓటర్లకు వినోదంగా మారింది. సమాజ్‌వాదీ ఇక్కడ అభ్యర్థిని నిలపడం లేదు! ఇక్కడ మే 7న పోలింగ్ జరగనుంది.
 
 వుథుర
 కృష్ణ జన్మస్థానంగా ప్రసిద్ధికెక్కిన పశ్చివు ఉత్తరప్రదేశ్‌లోని వుథుర ఈసారి దక్షిణాదికి చెందిన బాలీవుడ్ నటి హేవువూలిని (65) బీజేపీ తరఫున పోటీకి దిగడంతో వార్తల్లోకెక్కింది. గాజియూబాద్, గౌతంబుద్ధనగర్ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినా వాటిని కాదని శ్రీకృష్ణ జన్మస్థలినే ఎంచుకున్నానని ఆమె ప్రకటించారు. హేమ రాకతో సిటింగ్ ఎంపీ, ఆరెల్డీ నేత అజిత్‌సింగ్ కువూరుడు జయుంత్ చౌధరీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో నాలుగుసార్లు వుథురలో నెగ్గిన బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. జాట్లు బాగా ఉన్న ఈ స్థానంలో వారి ఆదరణ ఉన్న జయుంత్‌కే వూవుూలుగా సానుకూలత ఉండాలి.
 
 కానీ ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల వాతావరణముందనే ప్రచారం, వుుజఫర్‌నగర్ వుత ఘర్షణలు తదితరాలు ఈసారి ఆయనకు ప్రతికూలంగా మారవచ్చంటున్నారు. పైగా తన భర్త, నిన్నటి తరం సూపర్ హీరో ధర్మేంద్ర జాట్ కాబట్టి తాను జాట్ల కోడలిననీ, ఆ వర్గం ఓట్లు తనకే పడతాయుని హేవువూలిని చెబుతున్నారు. ఇక జయుంత్ గత ఐదేళ్లలో నియోజకవర్గ ముఖం చూసింది తక్కువే అయినా ఇప్పుడు వూత్రం ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరిస్తూ చెమటోడుస్తున్నారు. హేవు మాత్రం ఖరీదైన ఆడీ కారు దిగకుండానే సుతారంగా చేతులూపుతూ సాగిపోతున్నారు. పోలింగ్ ఏప్రిల్ 24న జరగనుంది.
 
 లక్నో
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయిని ఆదరించిన ఈ స్థానంలో బీజేపీకి గణనీయమైన బలముంది. కాంగ్రెస్ తరఫున యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ బరిలో ఉన్నారు. ఆప్ తరఫున బాలీవుడ్ నటుడు జావేద్ జఫ్రీ కూడా ఉన్నా పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. పోలింగ్ ఏప్రిల్ 30న
 జరగనుంది.
 
 
విదిశ
లోక్‌సభలో విపక్షనేత, సిటింగ్ ఎంపీ సుష్మా స్వరాజ్ మరోసారి పోటీ చేస్తుండటంతో విదిశాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఒకసారి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఐదుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. ‘కమలం’ కంచుకోట అయిన ఈ స్థానాన్ని కాంగ్రెస్ సహజంగానే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్‌ను బరిలోకి దించి విస్తృతంగా ప్రచారం సాగిస్తుండటంతో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.
 
 
అమృత్ సర్
పంజాబ్‌లో రెండు ప్రధాన జాతీయు పార్టీల నుంచి బడా నేతలైన అరుణ్ జైట్లీ (బీజేపీ), కెప్టెన్ అవురీందర్‌సింగ్ (కాంగ్రెస్) తలపడుతుండటంతో సిక్కుల ప్రధాన పుణ్యక్షేత్రం అవుృతసర్‌లో ఎన్నికల వేడి ఎప్పుడూ లేనంతగా పెరిగింది. బీజేపీలోని కొత్త తరం నేతగా, మోడీ కొత్త కోటరీలో వుుఖ్యునిగా అవతరించిన జైట్లీ గెలుపు ఖావుయునే అభిప్రాయుం తొలుత వ్యక్తమైంది. బీజేపీ తరఫున గెలిచిన సిటింగ్ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజోత్‌సింగ్ సిద్ధూ, జైట్లీకి ‘గురుద క్షిణ’గా తప్పుకున్నారు.
 
 అత్యధిక సిక్కు ఓటర్లున్న ఈ స్థానంలో హిందూ అభ్యర్థులు ఏకంగా ఎనిమిదిసార్లు గెలిచారు. అందుకే సిక్కుల పార్టీ అరుున శిరోవుణి అకాలీదళ్ వుద్దతుతో జైట్లీ ధైర్యంగా రంగంలోకి దిగారు. కానీ పంజాబ్ వూజీ సీఎం, పాటియూలా సంస్థానం వూజీ ‘యుువరాజు’ అవురీందర్ తొలుత తటపటారుుంచినా, చివరికి బరిలో దిగడంతో జైట్లీకి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అరుణ్ పంజాబీ కాదని, బయుటివాడని పేర్కొంటూ అవురీందర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాను పరాయినేమీ కాదని, తన తల్లి అవుృతసర్ ఆడపడచేనని జైట్లీ చెబుతున్నారు. ఢిల్లీ తరహా పంజాబీలో ప్రసంగిస్తూ నానా తంటాలు పడుతున్నారు. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది.
 
 బెంగళూరు సౌత్
 దేశ ప్రజలందరికీ ఆధార్ కార్డు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన యుునీక్ ఐడెండిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియూ (యుూఐఏడీఐ) చైర్మన్‌గా పని చేసిన ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వూజీ ఉన్నతాధికారి నందన్ నీలేకని కాంగ్రెస్ తరఫున ఇక్కడ బరిలోకి దిగడంతో ఒక్కసారిగా ఈ స్థానం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయుకత్వంలోని యూపీఏకు మెజారిటీ వస్తే వున్మోహన్‌సింగ్‌కు వచ్చినట్టుగానే ప్రధాని పదవి నీలేకనికి దక్కవచ్చని ఒక దశలో మీడియూలో ఊహాగానాలు కూడా వచ్చారుు. ఆయన ప్రత్యర్థి అయిన 53 ఏళ్ల హెచ్‌ఎన్ అనంతకువూర్ వూజీ కేంద్రవుంత్రి, బీజేపీ నేత.
 
 ప్రస్తుతం సిటింగ్ ఎంపీ అయిన ఆయన 1996
 నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. జేడీఎస్ తరఫున రూత్ వునోరవు, ఆమ్‌ఆద్మీ పార్టీ టికెట్‌పై నీనా పి.నాయుక్ రంగంలో ఉన్నా పోటీ ప్రధానంగా నీలేకని, అనంతకువూర్ వుధ్యనే ఉంటుంది. ఈసారి కూడా నరేంద్రమోడీ గాలిలో గెలిచి కేంద్ర కేబినెట్‌లో స్థానం ఆశిస్తున్న ఆయనకు నీలేకని పెద్ద అడ్డంకిగా వూరారు. వరుసగా ఐదుసార్లు ఎన్నికవడం, రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం, యుువతరాన్ని ఆకర్షించే అభ్యర్థిగా నిలేకని బరిలో దిగడం అనంతకువూర్‌ను కుంగదీసే అంశాలు. పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది.
 
 గాంధీనగర్
 గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బీజేపీ కురువృద్ధుడు, సిట్టింగ్ ఎంపీ అద్వానీ మరోసారి పోటీ చేస్తున్నారు. కాకపోతే ఈసారి ఆయన అయిష్టంగానే బరిలోకి దిగారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచీ పార్టీపై కినుక వహిం చిన ఆయన ఈసారి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్లి పార్టీకి నష్టం కలగవచ్చనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు ఆయనకు నచ్చజెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి కిరీట్ పటేల్ ఐదుసార్లు గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వానీకి దీటైన అభ్యర్థి కాదు. ఆయన గెలుపు లాంఛనప్రాయమే. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది.
 
 సుల్తాన్‌పూర్
 యూపీలో సోనియూ, రాహుల్ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, అమేథీలకు పొరుగునే ఉన్న సుల్తాన్‌పూర్ నుంచి నెహ్రూ-గాంధీ కుటుంబానికే చెందిన వరుణ్‌గాంధీ బీజేపీ తరఫున బరిలో దిగడంతో సుల్తాన్‌పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కిందటిసారి తొలిసారి లోక్‌సభకు పిలిభిత్ నుంచి గెలిచిన వరుణ్, తన తండ్రి సంజయ్‌కి సుల్తాన్‌పూర్‌తో అనుబంధం ఉందనే కారణంతో ఇక్కడికొచ్చారు.
 
 కాంగ్రెస్ తరఫున అమేథీ వూజీ సంస్థానాధీశుని కోడలు అమితాసింగ్ రంగంలో ఉన్నా వరుణ్ గెలుపు తేలికేనంటున్నారు. రాహుల్ తన చిన్నాన్న కొడుకైన వరుణ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయుడం లేదు. వరుణ్ కూడా ఇదే సూత్రం పాటిస్తున్నారు. పైగా, పొరపాటున అమేథీలో రాహుల్ ప్రజలకు చేసిన మేలును ప్రశంసించి వివాదం సృష్టించారు కూడా! పిలిభిత్ నుంచి ఈసారి వరుణ్ తల్లి మేనకాగాంధీ పోటీ చేస్తున్నారు. అమితాసింగ్ తరఫున ఆమె భర్త, వూజీ యుువరాజు, రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ గట్టి ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ మే 7న జరగనుంది.
 
 వడోదరా
 వారణాసితో పాటు గుజరాత్‌లోని
 వడోదరా నుంచి కూడా మోడీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ, ఆప్ నుంచి సునీల్ దిగంబర్ కులకర్ణి బరిలో ఉన్నారు. మిస్త్రీ సీనియర్ నేతే అయినా మోడీ గాలి ముందు నిలవడం అనుమానమే. మెకానికల్ ఇంజనీర్ అయిన కులకర్ణీ రాజకీయాలకే కొత్త. ఆయన గురించి జనాలకు తెలిసిందీ తక్కువే. కాబట్టి తన బలానికి స్థాన బలమూ తోడై మోడీ తేలిగ్గా నెగ్గుతారంటున్నారు. పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement