నాకిది పెద్ద షాక్‌, నా వల్ల కావడం లేదు: బోరుమని ఏడ్చేసిన సదా | Actress Sadha Left In Tears, Shares Emotional Video | Sakshi
Sakshi News home page

Sadaa: ఎంత ప్రయత్నించినా కన్నీళ్లాగడం లేదు.. సదా ఎమోషనల్‌ వీడియో వైరల్‌

Published Fri, May 5 2023 4:12 PM | Last Updated on Fri, May 5 2023 4:31 PM

Actress Sadha Left In Tears, Shares Emotional Video - Sakshi

వెళ్లవయ్యా.. వెళ్లు అంటూ సింగిల్‌ డైలాగ్‌తో ఫేమస్‌ అయిన నటి సదా. జయం సినిమాలో హీరోయిన్‌గా నటించిన సదా తొలి చిత్రానికే ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకుంది. జయం తమిళ వర్షన్‌, అన్నియన్‌ (అపరిచితుడు) సినిమాలతో తమిళంలోనూ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాలు చేసింది. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా కనిపించని సదా బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలో జడ్జిగా వ్యవహరిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో కన్నీటిపర్యంతమవుతున్న వీడియో షేర్‌ చేసింది.

సదా ముంబైలో ఎర్త్‌లింగ్స్‌ కెఫె పేరిట వెజ్‌ రెస్టారెంట్‌ నడుపుతోంది. ఈ కెఫె చూసుకోవడంలో తనకు ఎంతో తృప్తి ఉందని గతంలోనూ వెల్లడించింది నటి. అయితే సడన్‌గా ఈ కెఫె మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అదే విషయాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సదా. '2019 ఏప్రిల్‌ 23న ఎర్త్‌లింగ్స్‌ కెఫె ప్రారంభించాను. ఇది నా ఫస్ట్‌ బిజినెస్‌. ఈ వ్యాపారాన్ని నా కన్నబిడ్డలా చూసుకున్నాను. 2023 ఏప్రిల్‌ 23.. నాకు బాధను మిగిల్చిన రోజు. కెఫె స్థలం యజమాని ఫోన్‌ చేసి ఖాళీ చేయాలని ఆదేశించాడు. అందుకు నెల రోజుల గడువు ఇచ్చాడు. నాకు పెద్ద షాక్‌ తగిలినట్లైంది. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగడం లేదు. మూడు వారాల్లో మేము ఖాళీ చేయాలి.

నేను కెఫె పెట్టకముందు ఈ స్థలం దారుణ స్థితిలో ఉంది. కోవిడ్‌ టైంలో రోజుకు 12 గంటలు ఇక్కడే పని చేశాను. ఏడాదిన్నరపాటు కష్టపడి దీన్ని అందంగా తీర్చిదిద్దాను. మిగతా పనిని కూడా పక్కన పడేసి ఇదే ప్రపంచంగా బతికాను. లాక్‌డౌన్‌ సమయంలోనూ పెద్దగా బిజినెస్‌ లేకపోయినా నేను క్రమం తప్పకుండా అద్దె చెల్లించాను. పరిస్థితులు చక్కబడ్డాక నెమ్మదిగా ఈ కెఫెను ముందు వరుసలో నిలబెట్టాను. ఎంతో బాగా రన్‌ అవుతోంది. అయినా సరే, అతడు ఖాళీ చేసి వెళ్లిపోమంటున్నాడు. నాకు దీన్ని వదిలి వెళ్లాలని లేదు.

ఇది నాకొక ఎమోషన్‌. ఏదో కోల్పోతున్నట్లుగా ఉంది. తట్టుకోలేకపోతున్నా.. మీకు మూడు వారాలు మాత్రమే రెస్టారెంట్‌ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అది మూతపడుతుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి నచ్చిన ఫుడ్‌ తినండి, ఈ ప్రదేశాన్ని ఆస్వాదించండి. కానీ మోమో(శునకం) ఎక్కడికని వెళ్తుంది. తర్వాత ఇక్కడ రెంట్‌కు వచ్చేవాళ్లు మోమోను తరిమేయకుండా దాని బాగోగులు చూస్తే బాగుండు. నేను దాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. మూడు రోజులు నాతో పాటు ఇంట్లో ఉంచేస్తే తను చాలా కోపంగా ఉంటోంది. అలా బందీ అయినట్లుగా ఉండటం తనకు నచ్చక అన్నీ పగలగొడుతోంది. అందుకే తనను తిరిగి మళ్లీ కెఫెలోనే వదిలేశా..' అని చెప్తూ ఎమోషనలైంది సదా. ఈ వీడియో చూసిన అభిమానులు రెస్టారెంట్‌ను మూసేయొద్దని, వేరే ప్రాంతానికి షిఫ్ట్‌ చేయండని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: ఒక్క సినిమాకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలే వద్దిలేద్దామనిపించింది
దొంగచాటుగా కలుసుకునేవాళ్లం: తన లవ్‌ స్టోరీ చెప్పిన మారుతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement