
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఆదివారం కడపలో హల్‌చల్ చేసిన ఓ వ్యక్తిని చూసినవారు ఇది నిజమేనని ఆశ్చర్యపోయారు. జైలర్ సినిమాలో వర్మ పేరుతో నటించిన వినాయకన్ విలన్ ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే.
అన్నమయ్య జిల్లా చిన్నమండెంకు చెందిన మాజిద్ అచ్చు వినాయకన్‌లాగే కనిపించి హల్‌చల్ చేశాడు. బీడీలు తాగుతూ వర్మ వేషధారణలో హావభావాలు ప్రకటించాడు. దీంతో ప్రజలు అతని చుట్టూ చేరి జైలర్ సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘వర్త్.. వర్మా వర్త్’ అంటూ కేరింతలు కొట్టారు. – మహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప