కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్న ఆది | adi pinishetti new tamil movie starts soon | Sakshi
Sakshi News home page

కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్న ఆది

Published Fri, May 20 2016 4:13 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్న ఆది

కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్న ఆది

యువ నటుడు ఆది తాజా చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈరం తదితర చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆది. ఆయన తమిళంలో యాగవరాయన్ నాకాక్క చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. ఆ చిత్రం విడుదలై ఏడాది అవుతోంది. అయితే ఇటీవల తెలుగులో సరైనోడు చిత్రంలో అల్లుఅర్జున్‌కు విలన్‌గా నటించారు.

ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిన్న గ్యాప్ తరువాత ఆది తమిళంలో కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి.ఢిల్లీబాబు నిర్మించనున్నారు. ఇందులో ఆదికి జంటగా నటి శివదా నటించనున్నారు. ఏఆర్‌కే.శరవణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి పీవీ.శంకర్ చాయాగ్రహణం, డిబు సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement