కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్న ఆది
యువ నటుడు ఆది తాజా చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈరం తదితర చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆది. ఆయన తమిళంలో యాగవరాయన్ నాకాక్క చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. ఆ చిత్రం విడుదలై ఏడాది అవుతోంది. అయితే ఇటీవల తెలుగులో సరైనోడు చిత్రంలో అల్లుఅర్జున్‌కు విలన్‌గా నటించారు.
ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిన్న గ్యాప్ తరువాత ఆది తమిళంలో కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జి.ఢిల్లీబాబు నిర్మించనున్నారు. ఇందులో ఆదికి జంటగా నటి శివదా నటించనున్నారు. ఏఆర్కే.శరవణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి పీవీ.శంకర్ చాయాగ్రహణం, డిబు సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.