
సల్మాన్ డబుల్ కిక్!
‘కిక్’... సల్మాన్ అభిమానులకు కిక్ ఎక్కించిన సినిమా. ఇప్పుడు డబుల్ కిక్ ఇవ్వడానికి ఆయన రెడీ అవుతున్నారు. అవును మరి.. సల్మాన్ రెండు పాత్రల్లో కనిపిస్తే రెట్టింపు కిక్ లభించడం ఖాయం కదా. ‘కిక్ 2’లో ఈ కండల వీరుడు హీరోగా, విలన్‌గా కనిపించనున్నారని సమాచారం.
ఒకే ఫ్రేమ్‌లో పాజిటివ్, నెగటివ్.. ఇలా సల్మాన్‌లో రెండు కోణాలు చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. ప్రస్తుతం సల్మాన్ ఈ సినిమా కథా చర్చలతో చాలా బిజీగా ఉన్నారు. మొదటి భాగానికి మించిన వినోదం ఉండేలా, అంతకు మించిన హీరోయిజమ్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారట.