Kick 2
-
బాలీవుడ్ కు తిరిగొస్తున్న కిక్కోడు
-
డెవిల్ ఈజ్ బ్యాక్
యస్.. డెవిల్ ఈజ్ బ్యాక్. మరోసారి డెవిల్‌గా వచ్చే ఏడాది క్రిస్మస్కు థియేటర్స్‌లో డబుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. ఆల్మోస్ట్ నాలుగేళ్ల క్రితం సాజిద్ నాడియాడ్వాలా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘కిక్’. తెలుగులో రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి రీమేక్ ఇది. హిందీ చిత్రంలో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రణ్‌దీప్ హుడా, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. దేవీలాల్ సింగ్ (డెవిల్) పాత్రలో సల్మాన్ నటించి, బాక్సాఫీసును కొల్లగొట్టారు. అంతేకాదు దర్శకత్వం వహించిన తొలి సినిమానే 200 కోట్ల క్లబ్లో చే ర్చిన ఘనత సాజిద్‌కు దక్కింది. బుధవారం ‘కిక్’కి సీక్వెల్‌గా ‘కిక్ 2’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారాయన. ‘‘వెయిట్ ఈజ్ ఓవర్.. డెవిల్ ఈజ్ బ్యాక్. ‘కిక్ 2’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయనున్నాం’’ అని పేర్కొన్నారు సాజిద్. ఇందులో సల్మాన్ డ్యూయెల్ రోల్ చేయనున్నారన్న వార్తలు బీటౌన్‌లో జోరందుకున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది తన ఫేవరెట్ ఫెస్టివల్ రంజాన్‌కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భరత్’ మూవీకి రెడీ అవుతున్నారు సల్మాన్. ఈ ఏడాది రంజాన్‌కు సల్మాన్ ‘రేస్ 3’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రిస్మస్కు సల్మాన్ ౖ‘టెగర్ జిందాహై’ చిత్రం రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. సో.. ఈ సెంటిమెంట్‌ను కొనసాగించడానికే సల్మాన్ వచ్చే ఏడాది క్రిస్మస్కు ‘కిక్ 2’ ప్లాన్ చేశారని బాలీవుడ్ టాక్. -
'కిక్ 2' ఎఫెక్ట్
రేసుగుర్రం లాంటి భారీ హిట్ తరువాత మంచి ఫాంలో కనిపించిన సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమాతోనే నిరాశపరిచాడు. భారీ అంచనాలతో కిక్ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కించిన కిక్ 2 సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. రేసుగుర్రం తరువాత చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు ఓకె చేసుకున్నా, ఇప్పుడా ప్రాజెక్ట్స్ అన్ని డైలామాలో పడ్డాయి. ముఖ్యంగా కిక్ 2 షూటింగ్ సమయంలోనే రామ్‌చరణ్‌కు కథ వినిపించిన సూరి నెక్ట్స్ ఆ సినిమానే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావించాడు. సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చిన చరణ్ కూడా శ్రీనువైట్లతో చేస్తున్న బ్రూస్లీ సినిమా తరువాత అదే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే కిక్ 2 రిజల్ట్ సీన్ రివర్స్ చేసేసింది. సురేందర్ రెడ్డితో చేసే ప్రాజెక్ట్ విషయంలో చెర్రీ పునరాలోచనలో ఉన్నాడట. బ్రూస్లీ సినిమా పూర్తి కావస్తుండటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తున్న చరణ్ ముందు రెండు ఆఫ్షన్స్ ఉన్నాయి. సురేందర్ రెడ్డి సినిమాతో పాటు తమిళ్లో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ రీమేక్. అయితే సూరి సినిమాతో రిస్క్ చేయటం కన్నా తనీఒరువన్ రీమేక్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు చరణ్. -
రేటు తగ్గించుకోక తప్పలేదు..!
కిక్ 2 ఫెయిల్యూర్ కళ్యాణ్ రామ్ తో పాటు రవితేజ కెరీర్ ను కూడా ఇబ్బందుల్లో పడేసింది. ఈ మధ్యే సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ బలుపు, పవర్ సినిమాల తరువాత భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. కిక్ 2 సినిమాకు కూడా అదే స్ధాయిలో పారితోషికం అందుకున్న రవితేజ ఆ సినిమా ఫెయిల్యూర్ తో ఢీలాపడిపోయాడు. కెరీర్ గ్రాఫ్ పరంగానే కాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా సినిమా ఫెయిల్యూర్ రవితేజను కష్టాల్లో పడేసింది. రవితేజ ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రచ్చ ఫేం సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు కీలకం కానుంది. కుర్ర హీరోల నుంచి కాంపిటీషన్ విపరీతంగా ఉండటంతో హిట్ ఇస్తే తప్ప రవితేజకు నెక్ట్స్ సినిమాలు దొరకని పరిస్థితి. దీంతో బెంగాల్ టైగర్ మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రవితేజ. బెంగాల్ టైగర్ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఓ కామెడీ ఎంటర్ టైనర్ కమిట్ అయ్యాడు రవితేజ.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు రవితేజ గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. భారీ ఫ్లాప్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో పాటు రవితేజ మార్కెట్ కూడా ఆ స్ధాయిలో లేకపోవటంతో రెమ్యూనరేషన్ తగ్గించుకోక తప్పలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కిక్ - 2లో 20 నిమిషాల కత్తిరింపు
చెన్నై : కిక్ - 2 చిత్రంలోని కొంత భాగాన్ని తొలగించినట్లు ఆ చిత్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి శనివారం చెన్నైలో వెల్లడించారు. ఈ చిత్రంలో ఇంటర్వేల్ తర్వాత 20 నిమిషాలను చిత్రాన్ని తీసివేసినట్లు తెలిపారు. రెండున్నర గంటల నిడివి గల ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కవైనట్లు అనిపించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన కిక్ -2 చిత్రం ఆగస్టు 21న విడుదలైన సంగతి తెలిసిందే. రవితేజ, ఇలియానా జంటగా నటించిన కిక్ 2009లో విడుదలైన బాక్సాఫీసు రికార్డులను బద్దలకొట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా కిక్ - 2చిత్రాన్ని నిర్మించారు. -
'కిక్-2లో బ్రహ్మానందం కామెడీ హైలైట్ అట'
హైదరాబాద్: కిక్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు కిక్కెక్కించిన రవితేజ... రెండోసారి ఆ కంఫర్ట్ మజాను అందించడానికి రెడీ అయ్యాడు. కిక్ సినిమా సీక్వెల్‌గా కిక్- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమా చూసిన వాళ్లు కథ బాగుందని ముఖ్యంగా బ్రాహ్మనందంతో కామెడీ హైలైట్ అంటున్నారు. సినిమాలో పాటలు అద్బుతంగా ఉన్నాయంటున్నారు. మరోవైపు మంచి కథతో రచయితలు ముందుకు వస్తే కిక్-3 తీయడానికి సిద్ధమని టాలీవుడ్ హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'వ్యాపారం కోసం కాదు...నిజంగానే చక్కటి కథ, మంచి టీమ్‌తో ఎవరైనా తనను సంప్రదిస్తే' కిక్ సీక్వెల్ లో నటిస్తానని మాస్ మహారాజ స్పష్టం చేశాడు. కిక్ 3 చేయడానికి తనకు చాలా ఉత్సాహంగా ఉందన్నాడు. కిక్ 3 సినిమా తీస్తే వ్యాపార విస్తరణకు అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నాడు. ఆసక్తికరమైన కథనంతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కూడా కావాలని రవితేజ అభిప్రాయపడ్డాడు. తెలుగులో కిక్ సినిమా అందించిన విజయోత్సాహంతో దూసుకుపోతున్న ఈ మాస్ మహారాజా ఆ మూడోది కూడా వస్తే ఆ కిక్కే వేరని చెప్పకనే చెబుతున్నాడు. -
డిక్షనరీలో... నాకు నచ్చని పదం డల్‌నెస్
స్థలం: ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్, హైదరాబాద్. సమయం: సాయంత్రం 4 గంటలవుతోంది. చేతికి గడియారం పెట్టుకోవడం ఎప్పుడూ అలవాటు లేని హీరో రవితేజకు తన బాడీ క్లాక్ మాత్రం టైమ్ చెప్పేసినట్లుంది. తలుపు వేసి ఉన్న ఆ ఏసీ ఆఫీసు గది బయట ఉన్న అసిస్టెంట్‌ను పిలిచి, టైమ్ ఎంతైందని అడిగారు. నాలుగు గంటలని అనగానే, ‘‘అయితే ప్రొటీన్లు పట్రా!’’ అనేశారు. సన్నగా, పొడుగ్గా ఉండే ఈ ఎనర్జిటిక్ హీరో ఇప్పుడు వ్యాయామం, ఆహారం విషయంలో మరింత క్రమశిక్షణ పాటిస్తున్నారు. బరువే తప్ప, ఉత్సాహం తగ్గని రవితేజ చేతిలోని ప్రొటీన్ షేక్‌ను నెమ్మదిగా సిప్ చేస్తూ, బాక్సులోని యాపిల్ ముక్కలు తింటూ ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా మాట్లాడారు. కెరీర్లో కెల్లా అత్యంత కాస్ట్లీ చిత్రం ‘కిక్2’ ఈ శుక్రవారం విడుదల కానున్న వేళ... ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే ఈ ‘మాస్ మహారాజా’ ‘సాక్షి’తో మనసు విప్పి పంచుకున్న కబుర్లు... *** చాలా సన్నబడ్డారు. కారణం? కారణమేమీ లేదు. ఇంతకు ముందు డిసిప్లిన్డ్గా ఉండేవాణ్ణి. ఇప్పుడు మరింత డిసిప్లిన్డ్గా మారా. రోజూ జిమ్‌కు వెళుతున్నా, వర్కౌట్లు చేస్తున్నా. మా అమ్మతో సహా అంతా ‘ఏంట్రా? చిక్కిపోయావ్’ అంటున్నారు కానీ, నాకు మాత్రం బరువు తగ్గాక ఎంత బాగుందో తెలుసా? *** మీరు గతంలో లావేమీ కాదే! ఎందుకు తగ్గారు? ఇదేదో సినిమాలో పాత్ర కోసం చేసిన పని కాదు. నేను నా కోసం చేసుకున్నది. దీనివల్ల శారీరకంగా, మానసికంగా బాగుంది. వ్యాయామం చేశాక షూట్‌కు వెళితే, ఆ ఉత్సాహం ఎంతుంటుందో మాటల్లో చెప్పలేను. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకు నా మాటలు అర్థమవుతాయి. మా పిల్లలిద్దరూ మునుపటి కన్నా బాగున్నానంటున్నారు. నాలా అవుతామంటున్నారు. *** ఇంతకీ వర్కౌట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? నేనెప్పుడూ ఉదయాన్నే నిద్ర లేస్తాను. ఇప్పుడు ఇంకా తొందరగా, తెల్లవారి 4.30 గంటలకే లేస్తున్నా. రొటీన్ అంతా పూర్తి చేసుకొని, రెండు గంటల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‌లతో సహా అన్నీ చేస్తా. ఆ తరువాత రెడీ అయిపోయి, షూటింగ్‌కు వెళతా. ఎప్పుడూ టైమ్ ప్రకారం ఆహారం తీసుకోవడం అలవాటు. ఇప్పుడూ అంతే. కాకపోతే, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా. కొద్ది కొద్దిగా ఎనిమిదిసార్లు తీసుకుంటున్నా. *** తిండిలో రిస్ట్రిక్షన్స్ పెట్టి, కడుపు కట్టేసుకుంటున్నారన్న మాట! అదేమీ లేదు. కినోవా రైస్ వాడుతున్నా. ఓట్స్, చికెన్, ఫిష్, స్వీట్లు - అన్నీ తింటున్నా. పులిహోర నాకు చాలా ఇష్టం. ఏదీ వదలడం లేదు. కాకపోతే, మితంగా! టైమ్ ప్రకారం! మసాలాలు, నూనెలు మాత్రం పూర్తిగా మానేశా. స్వీట్లు కూడా మా అమ్మ చేసినవి తింటున్నా. అదీ పంచదారతో కాకుండా, బెల్లంతో చేసిన పూతరేకుల లాంటివి తింటున్నా. పంచదారతో చేసేవన్నీ బెల్లంతో చేయించుకొని, ప్రయోగాలు చేస్తున్నా. ఒకప్పుడు 82 కిలోల దాకా ఉండేవాణ్ణి. ఇప్పుడు 70 కిలోలకు వచ్చా. *** మరి పార్టీలు, విందు వినోదాల మాటేమిటి? నైట్ లైఫ్ అంతా ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ మానేశా. పార్టీలకు నో చెప్పేశా. చాలా సంవత్సరాలై పోయింది. ఇప్పుడు రాత్రి 9.30 కల్లా నిద్రపోతున్నా. మరీ తప్పనిసరి పార్టీకి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినా, రాత్రి 12 గంటల కల్లా దుకాణం బంద్! *** సన్నబడ్డాక తొలి ఫిల్మ్ ‘కిక్2’కి ఎలా కనిపిస్తానన్న టెన్షన్ లేదా? నిజం చెప్పాలంటే, సన్నగా, పొడుగ్గా ఉన్నవాళ్ళు కెమేరా ముందు బాగుంటారు. కావాలంటే, హిందీ రంగం నుంచి ఇక్కడి దాకా అలాంటి వాళ్ళందరినీ మీరు చూడండి. కాకపోతే, సన్నబడడం వల్ల వార్డరోబ్ ఖాళీ అయిపోయింది. (నవ్వుతూ) కొత్త దుస్తులు షాపింగ్ చేసే పనిలో పడ్డా! *** మీ దృష్టిలో అందానికీ, ఆరోగ్యానికీ నిర్వచనం? ఆరోగ్యమే అందం. దాన్ని వేరు చేసి చూడలేం. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనస్సు అందంగా ఉంటే, ముఖం అందంగా కనిపిస్తుంది. అందుకే, ‘పాజిటివ్‌గా ఉండండి’ అంటా! *** అందుకేనా చిన్న వేషాలతో మొదలై ఇంత స్టారయ్యారు? చాలామంది కష్టపడి పనిచేస్తుంటారు, ఇష్టపడి పనిచేయరు. ఇష్టపడి చేస్తే కష్టం తెలీదు. ఇష్టపడి కష్టపడితే ఎవరైనా పైకొస్తారు! *** మీలాగే ఇప్పుడు చాలామంది సినీరంగంలో అండ లేకుండా పైకి రావడం... (మధ్యలోనే అందుకుంటూ...) గాడ్‌ఫాదర్ ఎవరూ లేని నాని, రాజ్ తరుణ్ లాంటి హీరోలు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివాళ్ళు చాలామంది రావాలి. వాళ్ళ సినిమాలు ఇంకా బాగా ఆడాలి. తమిళంలో ‘సూదుకవ్వవ్ు’ లాంటి చిన్న సినిమా 40 కోట్ల దాకా కలెక్ట్ చేసిందట. మన చిన్న సినిమాలూ ఆ స్థాయికి వెళ్ళాలి. అది ఇంకా ఎందుకో జరగట్లేదు. *** కొత్త సినిమాలన్నీ చూస్తుంటారా? బ్రహ్మాండంగా! తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, గుడ్...బ్యాడ్ అగ్లీ - ఇలా అన్నిరకాల సినిమాలూ హోవ్‌ు థియేటర్లో ‘క్యూబ్’తో చూస్తా. లేటెస్ట్ ‘సినిమా చూపిస్త మావ’ కూడా చూసేశా! *** మరి, ప్రేక్షకుల రియాక్షన్ ఎలా తెలుస్తుంది? ఒకప్పుడు లైన్లో నిల్చొని, కొట్టుకొని టికెట్లు కొనుక్కున్న రోజుల నుంచి ఇప్పటికీ నాలోని ప్రేక్షకుడు అలానే ఉన్నాడు. ఏ సినిమా చూసినా హీరోలా కాక, ఆ దృష్టితోనే చూస్తా. ఇప్పటికీ తెరపై సన్ని వేశాన్ని బట్టి నవ్వొస్తే నవ్వేస్తా. ఏడుపొస్తే, ఏడ్చేస్తా. ప్రివ్యూకి వెళ్ళి, కదలకుండా కూర్చొనే రకంలా సినిమా చూడడం నా వల్ల కాదు. *** మీ సంతోషం, దుఃఖం పంచుకొనే సన్నిహితులు? నాకు నేనే పెద్ద ఫ్రెండ్‌ని. షూటింగ్‌లోనైనా, బయటైనా నా చుట్టూ ఎవరైనా ఈసురోమంటూ ఉన్నా, రిజర్వుడ్‌గా ఉన్నా నచ్చదు. వాళ్ళను చెడగొట్టి, నాలా ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నిస్తా. *** ఎలాంటివాళ్ళంటే మీకు ఇష్టం? సెన్సిబుల్‌గా ఉండేవాళ్ళను ఇష్టపడతా. స్టుపిడిటీని భరించలేను. *** హార్డవర్కనే తప్ప విధిని నమ్మరా? దేవుడి మీద నమ్మకం లేదా? జరిగిపోయింది, జరగాల్సింది - దేని గురించీ ఆలోచించను. జరుగుతున్న దాని మీదే దృష్టి పెడతా. ఏదీ ముందుగా ప్లాన్ చేయను. అది కుదరదు కూడా. నా ట్రావెల్లో అనుకోకుండా కృష్ణ వంశీ, తరువాత పూరి జగన్నాథ్ తగిలారు. కలసి ప్రయాణించాం. పైకొచ్చాం. గుడులు, పూజలు, వారాలు, వర్జ్యాల లాంటి నమ్మకాలు లేవు కానీ, దేవుణ్ణి నమ్ముతాను. మనల్ని మించిన అతీతశక్తి ఉందని బలంగా విశ్వసిస్తాను. *** ఈ మధ్య రెండు చెవులకీ రింగుల లాంటి వాటితో కనిపిస్తున్నారే? ‘కృష్ణ’ సినిమా టైవ్‌ులో ఒక చెవికి పోగు లాంటిది పెట్టాం. అది బాగుందని, తరువాత రెండో చెవి కూడా కుట్టించి, పెట్టించా. అంతే తప్ప, మరేమీ లేదు. ఇప్పటికీ గొలుసులు, వాచీల లాంటివి పెట్టను. *** తెరపై మీరు చాలామందికి ఎనర్జీ. మరి మీకు ఎనర్జీ కావాలంటే? వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ, నా జీవితంలో డల్‌నెస్ అనేదే లేదు. చిన్న వేషాల రోజుల నుంచి ఇప్పటి దాకా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. డిక్షనరీలో నాకు నచ్చనిపదమేదైనా ఉందంటే అది ‘డల్‌నెస్’. చిన్నప్పటి నుంచీ నేనింతే! ఎప్పుడూ యాక్టివే! ఒక్కమాటలో, నేనెప్పుడూ ‘కిక్’లోనే ఉంటా. *** మీడియా ముందుకు రారు. ఇంటర్వ్యూలూ తక్కువే. కారణం? మనం కాదు మన పని, మన సినిమాలూ మాట్లాడాలని నమ్ముతా. అందుకే అలా! అయావ్‌ు టోటల్లీ ఎ ప్రైవేట్పర్సన్. *** మీ పిల్లల గురించి చెప్పండి? మా అమ్మాయి మోక్షద. ఇప్పుడు 8వ తరగతి చదువుతోంది. అబ్బాయి మహాధన్ 4వ తరగతి. వాళ్ళిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స. ఈ తరం పిల్లాడు.. మా వాడు పిచ్చ హుషారు. *** మీ వాడెప్పుడూ నటిస్తానని అడగడా? తండ్రిని చూసి పిల్లలు అలా ఉండాలనుకుంటారు. మా అబ్బాయి అప్పుడప్పుడు చిన్న వేషం వేస్తానంటూ ఉంటాడు. నేను ‘ముందు బుద్ధిగా చదువుకో’ అంటా. (నవ్వులు...) *** ‘మాస్ మహారాజా, ఆంధ్రా అమితాబ్’ అంటే ఎలా ఉంది? (నవ్వుతూ...) ఏమీ అనిపించదు. ఆ పేర్లకూ, నాకూ సంబంధం లేదనిపి స్తుంది. దర్శకుడు హరీశ్ శంకర్ నన్ను ‘మాస్ రాజా... మాస్ రాజా’ అనేవాడు. దాన్నే ‘మాస్ మహరాజా’ అని టైటిల్స్‌లో ప్రేమగా వేస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఇలా హీరోల ముందు బిరుదులు తగిలించడం మన తెలుగులో, తమిళంలోనే ఎక్కువ. *** మీకు తమిళ్, హిందీ బాగా వచ్చు. అక్కడ నటించాలని లేదా? కొన్ని అవకాశాలొచ్చాయి కానీ, నాకు నచ్చలేదు. మంచి ఛాన్సలు వస్తే చేయడానికి నేను ఇప్పటికీ ఓపెన్‌గానే ఉన్నా. *** హిందీలో మీ తరహా ఎంటర్టైనర్స చాలా వస్తున్నాయే! చాలాభాగం మల్టీస్టారర్లు. అలాంటివి ఇక్కడా చేయచ్చు. కానీ, మన దగ్గర ఇతర హీరోలూ ముందుకు రావాలిగా. నేనైతే మల్టీస్టారర్సకి రెడీ. కొంతకాలం క్రితం వెంకటేశ్‌తో వీరూ పోట్ల దర్శకత్వంలో చేయాలనుకున్నాం. కుదరలేదు. *** ‘మసాన్, మాంఝీ’ లాంటి రియలిస్టిక్ ఫిల్మ్స్ చేయచ్చుగా! ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివశంభో’, ‘నేనింతే’ లాంటి వెరైటీ స్క్రిప్ట్స్ చేస్తే ఏమైందో చూశారుగా. అందుకే, (దణ్ణం పెట్టేస్తూ...) అవన్నీ మనకు వద్దు. హాయిగా అందరినీ నవ్వించే కమర్షియల్ సినిమాలు చేసుకుందాం. *** ఈ మధ్య ఏడాదికి ఒకటే చేస్తున్నారు. స్పీడ్ తగ్గించారా! 2012లో నాలుగు సినిమాలు చేస్తే, పెద్దగా ఆడలేదు. అందుకే, కొంచెం బ్రేక్ వేసి, ఆగా. రెండేళ్ళుగా ఒక్కో సినిమానే వచ్చాయి. ఇప్పుడు స్పీడ్ అందుకుంటున్నా. ఇక నుంచి మళ్ళీ వరసగా సినిమాలు చేస్తా. *** హీరోగా చేయకపోయినా, స్పెషల్ అప్పీయరెన్సలు, కన్నడంలో ‘వజ్రకాయ’ లాంటి సినిమాల్లో గెస్ట్‌గా చేస్తున్నారు! అవన్నీ ఫ్రెండ్షిప్ కొద్దీ చేసినవి. కన్నడ శివ్‌రాజ్ కుమార్ ఫోన్ చేసి అడగడంతో, ‘వజ్రకాయ’ చేశా. దర్శకుడైన కొరియోగ్రాఫర్ హర్ష ఫ్రెండ య్యాడు. హర్ష నా నెక్ట్స్ ఫిల్మ్ ‘బెంగాల్ టైగర్’ కొరియోగ్రఫీ చేస్తున్నారు. *** ‘కిక్2’ దర్శక, నిర్మాతలకు విభేదాలొచ్చాయని ఒక పుకారు! అవన్నీ వట్టిదే. మీరే చూస్తున్నారుగా... పక్క గదిలో వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఇద్దరి మధ్య చిన్నచర్చ జరిగినా, చిలవలు పలవలు చేసి, మూడోవాడు ప్రచారం చేయడం సినీరంగంలో ఎక్కువ. *** అసిస్టెంట్ డెరైక్టర్‌గా మొదలయ్యారు. డెరైక్షన్ చేయాలని లేదా? తప్పకుండా చేస్తా. అదీ కమర్షియల్ సినిమానే చేస్తా. నేను నటించను, వేరే హీరోతో చేస్తా. అప్పట్లో నేను అనుకున్న రకరకాల స్క్రిప్ట్‌లు అలానే ఉన్నాయి. నేను అనుకున్నవి ఇప్పటిదాకా రాలేదు. వాటిని తీస్తా. *** మీ సహాయకులకు ఆర్థికసాయం, ఇల్లు కొనిపెట్టడం లాంటివి చేశారట... అదేమంత విషయం కాదండీ! నన్ను నమ్ముకొన్నవాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటా. అంతకు మించేమీ లేదు. *** అప్పటి భూపతిరాజు రవిశంకర్ రాజుకీ, ఇప్పటి రవితేజకీ వచ్చిన మార్పు? ఏమీ లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల మన మాట తీరు, ప్రవర్తన కొద్దిగా తేడా వస్తుందేమో కానీ, మౌలికమైన మన స్వభావమైతే ఎప్పటికీ మారదు. కాకపోతే, లోకంలో అవతలివాళ్ళు మనల్ని చూసేది మాత్రం ఎప్పుడూ మన బ్యాంక్ బ్యాలెన్సను బట్టే (నవ్వులు...)! ‘కిక్’కి ఇది సీక్వెల్ కాదు! *** ‘కిక్2’లో వినోదం, యాక్షన్ అన్నీ ఎక్కువే. నార్తిండియా బ్యాక్‌డ్రాప్. ‘కిక్’లోని హీరో పాత్ర కల్యాణ్‌కు రాబిన్ హుడ్ అనే కొడుకుంటే... అనే ఆలోచనతో చేశాం. అంతేతప్ప, ‘కిక్’కు ఇది సీక్వెల్ కాదు. *** రచయిత వక్కంతం వంశీ ఒక పాయింట్ చెప్పారు. దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డితో నా హిట్ఫిల్మ్ ‘కిక్’కు తగ్గట్లు తాత్కాలికంగా ‘కిక్2’ అని పేరు పెట్టుకున్నాం. స్క్రిప్ట్ పక్కాగా పూర్తయ్యాక, ఆ పేరే కరెక్టని ఫిక్సయ్యాం. *** హీరో కల్యాణరావ్ు నిర్మాతగా కూడా సూపర్బ. ఆయన బ్యానర్లో నాలుగైదేళ్ళ క్రితమే చేయాల్సింది. ఇప్పటికి కుదిరింది. *** ఇది నా కెరీర్లోనే అత్యంత కాస్ట్లీ ఫిల్మ్. సురేందర్‌రెడ్డి పర్ఫెక్షనిస్ట్. పోస్ట్‌ప్రొడక్షన్, డి.ఐ. వగైరా ఆలస్యమయ్యాయి. ‘బాహు బలి’ రిలీజ్ మారడంతో, మా డేట్లూ మార్చుకోవాల్సి వచ్చింది. అందుకే లేట్. *** సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పట్నించి తెలుసు. గతంలో సీరియస్టోన్ సిన్మాలు తీసే ఆయన ‘కిక్’ నుంచి వినోదం, కామెడీ జానర్ రుచిమరిగాడు. ‘రేసుగుర్రం’లానే ఇప్పుడీ ‘కిక్2’ కూడా అదే. *** ఇందులో బ్రహ్మానందం ‘పండిత్ రవితేజ’ అని నా పేరుతో ఉన్న పాత్ర చేస్తున్నారు. బోలెడంత వినోదం ఉంది. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ బాగా చేసింది. ఆమె ఇప్పుడు లక్కీ. ఆమె చేసిన సినిమాలన్నీ ఆడుతున్నాయి. అలాగే తమన్ ఇచ్చిన మెలొడీ సంగీతం, మనోజ్ పరమహంస కెమేరా ‘కిక్2’కు చాలా ఎస్సెట్. *** ‘కిక్2’ జనానికి మంచి కిక్ ఇస్తుంది. అయావ్‌ు స్యూర్. ఇట్ వోంట్ డిజప్పాయింట్. అన్నీ బాగుంటే, ‘కిక్3’ కూడా కన్ఫర్మగా చేస్తా. *** ‘బాహుబలి’ వల్ల మన సినిమాకు కొత్త డోర్లు తెరుచుకున్నాయి. మార్కెట్ పెరిగింది. ఇతర భాషల్లో మనకు మర్యాద ఇస్తున్నారు. *** యువ హీరోలు ఎలాంటి బెరుకూ లేకుండా బాగా చేస్తున్నారు. వాళ్ళు నా లాగా చేస్తున్నారనడానికి కారణం... నాలోని ఫ్రీ స్టయిల్. ఆ క్రెడిట్ ‘ఇడియట్’లో చంటి పాత్ర చేయించిన దర్శకుడు పూరీది. *** నెక్ట్స్ఫిల్మ్ ‘బెంగాల్ టైగర్’ పూర్తి కావచ్చింది. అక్టోబర్‌లో రిలీజ్. - రెంటాల జయదేవ -
కిక్2 ప్లాటినం డిస్క్ వేడుక హైలెట్స్!
-
సూపర్ కిక్ ఇస్తుంది
‘‘రవితేజ అంటే బయట హీరో కాదు.. ఆయన మా కుటుంబ సభ్యుడే. షూటింగ్ స్టార్ట్ అయ్యాక కేవలం రెండు రోజులు మాత్రమే నేను లొకేషన్‌కు వెళ్లానంటే... రవితేజ, దర్శకుడు సురేందర్‌రెడ్డిల మీద నమ్మకమే కారణం. వారిద్దరూ తమ సొంత ప్రాజెక్ట్‌లా ఫీలయ్యి ఈ సినిమా చేశారు’’ అని నందమూరి కల్యాణ్‌రామ్ చెప్పారు. రవితేజ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నిర్మించిన చిత్రం ‘కిక్-2’. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ‘‘మంచి కథా కథనాలతో రూపొందిన ఈ చిత్రం అందరికీ సూపర్ కిక్‌నిస్తుంది’’ అని రవితేజ అన్నారు. ‘‘నా కెరీర్లో ‘కిక్-2’ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. రవితేజ అంటేనే ఎనర్జీ. ఈ సినిమాలో ఆయన ఎనర్జీ పెరిగిందే గాని తగ్గలేదు’’ అని సురేందర్‌రెడ్డి అన్నారు. ‘‘వక్కంతం వంశీ- సురేందర్‌రెడ్డి లది హిట్ పెయిర్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘కిక్-2’ మంచి సక్సెస్ అవుతుంది’’ అని వీవీ వినాయక్ అన్నారు. రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
డైలమాలో మాస్ మహారాజా
హైదరాబాద్: వరుస హిట్స్‌తో ఓ రేంజ్లో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ డైలమాలో పడ్డాడని సమాచారం. 2009లో రవితేజ నటించి కిక్ చిత్రం విడుదలై ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఆయనే హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ - 2 చిత్రం షూటింగ్ జరుపుకొని... ఆగస్టు 21న విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సమస్య అంతా ఇక్కడే వచ్చిందట. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న విడుదల అయింది. శ్రీమంతుడు విడుదలైన అన్ని థియేటర్లలో హల్చల్ చేయడమే కాకుండా... కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఇదే సమయంలో కిక్ - 2 విడుదల చేస్తే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అని మాస్ మహారాజా రవితేజ తెగ వర్రీ అవుతున్నాడు. ఇదే విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డితోపాటు ఆ చిత్రానికి ప్రోడ్యుసర్‌గా వ్యవహరించిన నందమూరి కల్యాణ్‌రామ్‌కు తెలిపినట్లు తెలిసింది. దాంతో వారు ఆలోచనలో పడినట్లు సమాచారం. కిక్ - 2లో రవితేజ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. -
సల్మాన్ డబుల్ కిక్!
‘కిక్’... సల్మాన్ అభిమానులకు కిక్ ఎక్కించిన సినిమా. ఇప్పుడు డబుల్ కిక్ ఇవ్వడానికి ఆయన రెడీ అవుతున్నారు. అవును మరి.. సల్మాన్ రెండు పాత్రల్లో కనిపిస్తే రెట్టింపు కిక్ లభించడం ఖాయం కదా. ‘కిక్ 2’లో ఈ కండల వీరుడు హీరోగా, విలన్‌గా కనిపించనున్నారని సమాచారం. ఒకే ఫ్రేమ్‌లో పాజిటివ్, నెగటివ్.. ఇలా సల్మాన్‌లో రెండు కోణాలు చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. ప్రస్తుతం సల్మాన్ ఈ సినిమా కథా చర్చలతో చాలా బిజీగా ఉన్నారు. మొదటి భాగానికి మించిన వినోదం ఉండేలా, అంతకు మించిన హీరోయిజమ్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారట. -
రవితేజ కిక్ 2
‘కిక్’ అని టైటిల్ పెట్టి, రవితేజ, సురేందర్ రెడ్డి ఏ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారో తెలిసిందే. ఇప్పుడు ‘కిక్ 2’ అంటున్నారు. దాన్నిబట్టి ఎంటర్టైన్మెంట్ ‘కిక్’ కన్నా రెండింతలు ఉంటుందని ఊహించవచ్చు. రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకింగ్‌లో ఉన్న ఈ ‘కిక్ 2’కి సంబంధించిన కొన్ని స్టిల్స్... -
'కిక్2' ఆడియో ఆవిష్కరణ
-
చల్ల చల్లగా..!
భాగ్యనగరంలో ఎండలు మండిపోతున్నాయ్. అందరి సంగతెలా ఉన్నా రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్ మాత్రం ఈ ఎండలకు దూరంగా చల్ల చల్లని ప్రదేశానికి వెళ్లిపోయారు. ఇక్కడివాళ్లందరూ వామ్మో ఎండలు అంటుంటే.. రకుల్ మాత్రం వామ్మో చలి అంటున్నారు. ఇంతకీ రవితేజ, రకుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? స్విట్జర్లాండ్‌లో. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న ‘కిక్ 2’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
డబుల్ ‘కిక్’
రవితేజ ఇచ్చిన ‘కిక్’ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ చిత్రానికి మించిన స్థాయిలో ‘కిక్-2’ ద్వారా డబుల్ కిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్. పి. సురేందర్‌రెడ్డి. ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలను ఇటీవల రాజస్థాన్‌లోని జైసాల్మీర్‌లో చిత్రీకరించారు. నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘‘కిక్’లో రవితేజ, ఇలియానాల కొడుకు కథే ఈ ‘కిక్-2’. ‘కిక్’కి ఇది సీక్వెల్ మాత్రం కాదు ’’ అని చెప్పారు. రకుల్‌ప్రీత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్. -
కిక్ 2 షూటింగ్స్‌తో మాస్‌రాజా బిజీ
-
కిక్-2లో రవితేజ డబుల్ ధమాకా!
-
రవితేజ కొడుకు కథే కిక్ 2
ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే చిత్రాలెప్పుడూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటాయి. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘కిక్’ అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో బుధవారం మరో చిత్రం మొదలైంది. ‘కిక్ 2’ పేరుతో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. మహానటుడు ఎన్టీఆర్ చిత్రపటంపై తీసిన తొలి సన్నివేశానికి హీరో రవితేజ కెమెరా స్విచాన్ చేయగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ గౌరవ దర్శకత్వం వహించారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. ‘కిక్’లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ ‘కిక్ 2’ అని దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 28న చిత్రాన్ని విడుదల చేస్తామని కల్యాణ్‌రామ్ అన్నారు. -
కిక్ 2 మూవీ ప్రారంభోత్సవ వేడుక
-
ఈసారి మరింత కిక్ షురూ!
రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్ అనగానే... ‘కిక్’ సినిమా గుర్తొస్తుంది. అయిదేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా రూపొందనుంది. మసాలా సినిమాలను ఇష్టపడే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం . ‘కిక్’ని మరపించే స్థాయిలో పక్కా ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు సురేందర్‌రెడ్డి. ఈ నెల 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కథానాయిక, ఇతర వివరాలు ప్రారంభోత్సవం నాడు తెలియజేస్తామనీ, రవితేజ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలుస్తుందనీ కల్యాణ్‌రామ్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్. -
జూన్‌లో ‘కిక్-2’?
2009లో బాక్సాఫీస్ వద్ద ‘కిక్’ సినిమా హంగామా అంతా ఇంతా కాదు. పాత్ర పోషణలో రవితేజ ఉత్సాహానికి, ఉత్తేజానికి ప్రతీకగా నిలిచిన సినిమా అది. ‘కిక్’ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనే హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ ‘పవర్’ షూటింగ్లో బిజీగా ఉంటే... దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’తో బిజీగా ఉన్నారు. మరి ‘కిక్-2’ మొదలయ్యేదెప్పుడు? అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చూచాయగా దొరికేసింది. జూన్‌లో ‘కిక్-2’ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. ఒకవైపు ‘రేసుగుర్రం’ పనిలో బిజీగా ఉంటూ, మరోవైపు ‘కిక్-2’ స్క్రిప్ట్‌ని కూడా సురేందర్‌రెడ్డి పూర్తి చేసినట్లు సమాచారం. ‘అతనొక్కడే’ చిత్రంతో సురేందర్‌రెడ్డిని దర్శకునిగా పరిచయం చేశారు కల్యాణ్‌రామ్. ఆ రుణాన్ని తీర్చుకోవడమే లక్ష్యంగా సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. నిర్మాతగా కల్యాణ్‌రామ్‌కి ఘనవిజయం అందించాలనే కసితో ఆయన ఈ చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం.