చల్ల చల్లగా..! | kick 2 movie shooting in Switzerland | Sakshi
Sakshi News home page

చల్ల చల్లగా..!

Published Wed, Mar 25 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

చల్ల చల్లగా..!

చల్ల చల్లగా..!

 భాగ్యనగరంలో ఎండలు మండిపోతున్నాయ్. అందరి సంగతెలా ఉన్నా రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్ మాత్రం ఈ ఎండలకు దూరంగా చల్ల చల్లని ప్రదేశానికి వెళ్లిపోయారు. ఇక్కడివాళ్లందరూ వామ్మో ఎండలు అంటుంటే.. రకుల్ మాత్రం వామ్మో చలి అంటున్నారు. ఇంతకీ రవితేజ, రకుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? స్విట్జర్లాండ్‌లో. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న ‘కిక్ 2’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై  హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement